Health Tips: ఈ పండ్లు తిన్న తర్వాత అస్సలు నీటిని తాగవద్దు.. ఏవేం ప్రూట్స్ అంటే
చాలా మంది ఏదైనా ఫుడ్ తిన్న వెంటనే లేదా భోజనం చేసిన వెంటనే నీరు తాగుతారు. ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయట. అలానే కొన్ని పండ్లను తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు వస్తాయట. అవి ఏం పండ్లు..? ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి.. ? పూర్తి వివరాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం పదండి..

పండ్లు తినడం ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం అన్న విషయం తెలిసిందే. పండ్లలో సహజసిద్ధమైన విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు లభిస్తాయి. అందుకే రోజూ పండ్లు తినాలని వైద్యులు, పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అయితే కొన్ని రకాల ప్రూట్స్ తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. కొన్నిసార్లు ఈ ఒక్క పొరపాటు జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి ఏ పండ్లు తిన్న వెంటనే నీరు తాగకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
యాపిల్:
యాపిల్ ఆరోగ్యానికి ఒక వరం. ఇది అధిక ఫైబర్ కంటెంట్ కలిగి ఉంటుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే మెరుగైన జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. కానీ మీరు యాపిల్ తిన్న వెంటనే నీరు త్రాగితే, అది జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. గ్యాస్ లేదా అజీర్ణం వంటి సమస్యలు రావొచ్చు.
అరటిపండు:
సాధారణంగా చాలామంది అరటిపండును రోజూ తినడానికి ఇష్టపడతారు. ఆరోగ్యకరమైన కొవ్వులు, కాల్షియం మొదలైన పోషకాలను కలిగి ఉండటం వల్ల.. అరటి ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ అరటిపండు తిన్న వెంటనే నీరు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ప్రభావితమవుతాయి. దీని కారణంగా, శరీరంలో ఇన్సులిన్ పరిమాణం పెరుగుతుంది. అందుకే అరటిపండు తిన్న వెంటనే నీళ్లు తాగకండి.
దానిమ్మ:
దానిమ్మ పండు తినడం వల్ల మనకు సూపర్ హెల్త్ బెనిఫిట్స్ అందుతాయి. ఈ పండు శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అయితే తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. ఇలా చేయడం వల్ల వికారం, అసిడిటీ, వాంతులు వంటివి వస్తాయి.
ఆమ్ల ఫలాలు:
నారింజ, గూస్బెర్రీస్, ద్రాక్ష మొదలైన సిట్రస్ పండ్లను తిన్న తర్వాత నీరు తాగవద్దు. వాటర్ తాగితే, మీ శరీరం pH స్థాయి తగ్గుతుంది. జీర్ణ సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి
నేరేడు పండు:
డయాబెటిక్ రోగులకు నేరేడు చాలా ప్రయోజనకరమైన పండు. అలాగే దీని విత్తనం డయాబెటిక్ పేషెంట్లకు అద్భుతమైన హోం రెమెడీ కూడా. నేరేడు పండు తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల దగ్గు, జలుబు వంటివి వచ్చే అవకాశం ఉంది
పుచ్చకాయ:
ఎక్కువగా వేసవిలో పుచ్చకాయ తినడానికి ఇష్టపడతారు. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ పండు తిన్న తర్వాత నీరు త్రాగడం మానుకోండి. లేకపోతే, జీర్ణ సమస్యలు రావొచ్చు.
బేరి:
బేరి కాయల్లో ఫైబర్, విటమిన్లు A, C, ఫోలిక్ యాసిడ్, పొటాషియం వంటివి ఉంటాయి. దీన్ని తినడం వల్ల జీర్ణ సమస్యలు దూరమవుతాయి. దీన్ని తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఉపశమనం పొందుతుంది. అయితే తిన్న వెంటనే నీరు తాగితే జీర్ణవ్యవస్థ ట్రాక్ తప్పే అవకాశం ఉంటుంది.
( ఈ సమాచారం డైటీషియన్ల నుంచి సేకరించబడింది. మీరు ఫాలో అయ్యే ముందు నిపుణులను సంప్రదించండి)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం




