నాన్ వెజ్ ప్రియులా.. కోనసీమ స్టైల్‌లో చింత చిగురు చికెన్ ఫ్రై‌ని తయారు చేసుకోండి.. ఇలా రెసిపి మీకోసం..

చింత చిగురు పప్పు, పచ్చడి, చింత చిగురు కారం వంటి రకరకాల రుచికరమైన ఆహర పదార్ధాలను తయారు చేస్తారు. ఇంకా చెప్పాలంటే చింత చిగురుతో క‌లిపి ఏ కూరలు చేసినా సరే రుచికరంగా ఉంటాయి. చింత చిగురుతో నాన్ వెజ్ ప్రియులకు కూడా ఇష్టమైన ఆహరాన్ని తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా చింత చిగురు రొయ్యలు, చింత చిగురు చికెన్, చింత చిగురు బోటీ వంటి కూరలను కోనసీమ వాసులు ఎక్కువగా తయారు చేస్తారు. ఈ నేపధ్యంలో టేస్టీగా ఉండే చింత చిగురు చికెన్ ఫ్రై కర్రీని రెసిపీ గురించి తెలుసుకుందాం..

నాన్ వెజ్ ప్రియులా.. కోనసీమ స్టైల్‌లో చింత చిగురు చికెన్ ఫ్రై‌ని తయారు చేసుకోండి.. ఇలా రెసిపి మీకోసం..
Chintha Chiguru Chicken Fry
Follow us

|

Updated on: May 14, 2024 | 5:54 PM

వేసవి కాలం వచ్చిందంటే చాలు మార్కెట్ లో చింత చిగురు సందడి మొదలైంది. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచికరమైన చింత చిగురుతో రకరకాల వంటలను తయారు చేస్తారు. ముఖ్యంగా చింత చిగురు పప్పు, పచ్చడి, చింత చిగురు కారం వంటి రకరకాల రుచికరమైన ఆహర పదార్ధాలను తయారు చేస్తారు. ఇంకా చెప్పాలంటే చింత చిగురుతో క‌లిపి ఏ కూరలు చేసినా సరే రుచికరంగా ఉంటాయి. చింత చిగురుతో నాన్ వెజ్ ప్రియులకు కూడా ఇష్టమైన ఆహరాన్ని తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా చింత చిగురు రొయ్యలు, చింత చిగురు చికెన్, చింత చిగురు బోటీ వంటి కూరలను కోనసీమ వాసులు ఎక్కువగా తయారు చేస్తారు. ఈ నేపధ్యంలో టేస్టీగా ఉండే చింత చిగురు చికెన్ ఫ్రై కర్రీని రెసిపీ గురించి తెలుసుకుందాం..

త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు

 1. బోన్‌లెస్ చికెన్- అరకిలో
 2. చింత చిగురు- కప్పు మీద కొంచెం
 3. ఇవి కూడా చదవండి
 4. పచ్చి కొబ్బరి తురుము – రెండు టీస్పూన్లు
 5. అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీస్పూన్‌
 6. ధ‌నియాల పొడి – ఒక టీస్పూన్‌
 7. కారం పొడి – రెండు టీ స్పూన్లు
 8. గ‌రం మ‌సాలా – అర టీస్పూన్‌
 9. దాల్చిన చెక్క- చిన్న ముక్కలు రెండు
 10. లవంగాలు – 3 లేదా 4
 11. ఉల్లిపాయ‌లు – 2( నిలువుగా కట్ చేసిన ముక్కలు)
 12. ప‌చ్చి మిర్చి – 4(లువుగా కట్ చేయాలి)
 13. కరివేపాకు – నాలుగు రెమ్మలు
 14. కొత్తిమీర తరుగు కొంచెం
 15. పసుపు – పావు టీస్పూన్‌
 16. ఉప్పు – రుచికి సరిపడా
 17. నూనె – వేయించడానికి సరిపడా

త‌యారు చేసే విధానం: ముందుగా చింత చిగురుని శుభ్రం చేసుకుని కడిగి పక్కకు పెట్టుకోవాలి. చికెన్ ను శుభ్రం చేసుకుని కడిగి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇంతలో గ్యాస్ స్టవ్ మీద బాణలి పెట్టి తగినంత నూనె పోసి వేడి ఎక్కిన తర్వాత దాల్చిన చెక్క, ల‌వంగాలు వేసి వేయించుకోవాలి. తర్వాత నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించి ఇప్పుడు నిలువగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇప్పుడు పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తర్వాత చికెన్ ముక్కలను వేసి బాగా కలిపి మూత పెట్టాలి. కొంచెం సేపు చికెన్ ముక్కలు వేగిన తర్వాత మూత తీసి చికెన్ లో కారం, ధనియాల పొడి, కొబ్బరి తురుము, గరం మసాలా వేసి కొంచెం ఉప్పు వేసి కలిపి బాగా కలిపి మూత పెట్టాలి. నూనెలో చికెన్ ఉడికిన తర్వాత ఇపుడు కడిగి పక్కకు పెట్టుకున్న చింత చిగురుని రెండు చేతులతో నలిపి కాడలు తీసి ఆ చింత చిగురుని ఉడికిన చికెన్ లో వేసి బాగా కలపాలి. ఇప్పుడు మంటను స్విమ్ లో పెట్టి ఉడికించాలి. ఫ్రై అడుగు అంట కుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే కూరలో నీరు తగ్గి.. పొడిగా అంటే చికెన్ నుంచి నూనె విడిపోతుంది. అప్పుడు కొంచెం కొత్తిమీర.. వేయించిన జీడిపప్పు వేస్తే చింత చిగురు చికెన్ ఫ్రై రెడీ అయినట్లే.. పుల్లపుల్లగా రుచికరంగా ఉండే చిగురు చికెన్ ఫ్రైని అన్నంలో తిన్నా , చపాతీల్లో తిన్నా చాలా బాగుంటుంది. పుల్లగా రుచికరంగా ఉండే ఈ చిగురు చికెన్ ఫ్రై ని పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. సీజన్ వెళ్లకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
హైదరాబాదీలకు అలర్ట్‌.. రేపటి నుంచి ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
హైదరాబాదీలకు అలర్ట్‌.. రేపటి నుంచి ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
ఎండలో నుంచి వచ్చిన వెంటనే నీరు తాగుతున్నారా..! తస్మాత్ జాగ్రత్త
ఎండలో నుంచి వచ్చిన వెంటనే నీరు తాగుతున్నారా..! తస్మాత్ జాగ్రత్త
కీలక గ్రహాల ప్రభావం.. ఈ రాశుల వారికి స్వదేశంలోనే మంచి ఉద్యోగాలు!
కీలక గ్రహాల ప్రభావం.. ఈ రాశుల వారికి స్వదేశంలోనే మంచి ఉద్యోగాలు!
ప్రకృతి అందాలను తిలకించిన ప్రధాని మోదీ.. ఫోటో షూట్ వీడియో వైరల్..
ప్రకృతి అందాలను తిలకించిన ప్రధాని మోదీ.. ఫోటో షూట్ వీడియో వైరల్..
పాపువా న్యూ గినియాలో విరిగిపడిన కొండచరియలు.. గ్రామం సమాధి
పాపువా న్యూ గినియాలో విరిగిపడిన కొండచరియలు.. గ్రామం సమాధి
టైం వచ్చింది కావ్యాపాపా.. ఆ పాశుపతాస్త్రాన్ని సంధించాల్సిందే
టైం వచ్చింది కావ్యాపాపా.. ఆ పాశుపతాస్త్రాన్ని సంధించాల్సిందే
చార్లీ చాప్లిన్ గెటప్‌లో ఉన్న ఈ అమ్మడు ఎవరో కనిపెట్టరా..?
చార్లీ చాప్లిన్ గెటప్‌లో ఉన్న ఈ అమ్మడు ఎవరో కనిపెట్టరా..?
లక్ష్మణ్ మనసు దోచుకున్న దోశ స్టాల్ యువతి.. నేటి యువతకు స్ఫూర్తి
లక్ష్మణ్ మనసు దోచుకున్న దోశ స్టాల్ యువతి.. నేటి యువతకు స్ఫూర్తి
జాజికాయను ఇలా తీసుకుంటే.. మీ జీవితమే మారిపోతుంది!
జాజికాయను ఇలా తీసుకుంటే.. మీ జీవితమే మారిపోతుంది!
తక్కువ ధరకే అమ్మేశాను.. ఆ రోజులు గుర్తు చేసిన శివశంకరన్‌
తక్కువ ధరకే అమ్మేశాను.. ఆ రోజులు గుర్తు చేసిన శివశంకరన్‌