AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాలు, పాల పదార్ధాలు ఆరోగ్యానికి మంచివే.. వీరు మాత్రం పాల ఉత్పత్తులకు వీలైనంత దూరంగా ఉండడం మేలు.. ఎందుకంటే..

పాలలో పుష్కలంగా పోషకాలు ఉన్నాయి అందువల్ల పాలు సంపూర్ణ ఆహారంగా పరిగణించబడుతుంది. అదే సమయంలో పాలు, పెరుగు, వెన్న , జున్ను వంటి పాల ఉత్పత్తులలో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే కొందరు వ్యక్తులు పాలు దాని ఉత్పత్తులను తినడం మానుకోవాలి. లేకుంటే పాలు ఆరోగ్యానికి ప్రయోజనం చేకూర్చే బదులు హాని కలిగించవచ్చు. ఎముకలు, కండరాలను బలోపేతం చేయడంతో సహా అనేక విధాలుగా ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయి. అయితే పాలు, దాని ఉత్పత్తులకు ఏ వ్యక్తులు దూరంగా ఉండాలో ఈ రోజు తెలుసుకుందాం..

పాలు, పాల పదార్ధాలు ఆరోగ్యానికి మంచివే.. వీరు మాత్రం పాల ఉత్పత్తులకు వీలైనంత దూరంగా ఉండడం మేలు.. ఎందుకంటే..
Dairy Products
Surya Kala
|

Updated on: May 14, 2024 | 5:14 PM

Share

ఆరోగ్యంగా ఉండటానికి రోజువారీ ఆహారంలో పాలను చేర్చుకోవాలని చెబుతారు. పాలు పిల్లలతో పాటు పెద్దల ఆరోగ్యానికి ఉపయోగకరంగా పరిగణించబడుతున్నాయి. ఎందుకంటే పాలలో పుష్కలంగా పోషకాలు ఉన్నాయి అందువల్ల పాలు సంపూర్ణ ఆహారంగా పరిగణించబడుతుంది. అదే సమయంలో పాలు, పెరుగు, వెన్న , జున్ను వంటి పాల ఉత్పత్తులలో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే కొందరు వ్యక్తులు పాలు దాని ఉత్పత్తులను తినడం మానుకోవాలి. లేకుంటే పాలు ఆరోగ్యానికి ప్రయోజనం చేకూర్చే బదులు హాని కలిగించవచ్చు.

పాలు, పెరుగు, పన్నీర్ ఈ మూడింటిలో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ B12, విటమిన్ A, విటమిన్ D, జింక్, పొటాషియం, ఫాస్పరస్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి ఎముకలు, కండరాలను బలోపేతం చేయడంతో సహా అనేక విధాలుగా ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయి. అయితే పాలు, దాని ఉత్పత్తులకు ఏ వ్యక్తులు దూరంగా ఉండాలో ఈ రోజు తెలుసుకుందాం..

లాక్టోస్ అంటే అలెర్జీ ఉన్నవారు పాలకు దూరంగా ఉండాలి: లాక్టోస్ అసహనం ఉన్నవారికి పాలు తాగిన తర్వాత అజీర్ణం, కడుపు ఉబ్బరం, విరేచనాలు వంటి సమస్యలు మొదలవుతాయి. అలాంటి వారు పాలతో పాటు పన్నీర్ కు దూరంగా ఉండాలి. అయితే పెరుగు తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

గుండె సమస్యలు ఉన్నవారు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి: గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఫుల్ ఫ్యాట్ పాలు, దీనితో తయారు చేసిన ఉత్పత్తులను తినకూడదు. లేకుంటే అవి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి. అయితే, పాలు, జున్ను లేదా పెరుగు పూర్తిగా మానేయడానికి బదులుగా.. మితంగా పాల ఉత్పత్తులను తీసుకోవాలి.

ఈ మందులను తీసుకుంటే, పాల ఉత్పత్తులను తీసుకోకండి: బిస్ఫాస్ఫోనేట్ మందులు తీసుకునే వ్యక్తులు పాలు లేదా దాని ఉత్పత్తులను తీసుకోవడం తగ్గించాలి. వాస్తవానికి.. ఇవి ఎముకల సాంద్రత కోల్పోకుండా నిరోధించడానికి ఉపయోగించే మందులు. ఈ మందులను ఎముకల వ్యాధి, బోలు ఎముకల వ్యాధి, ఎముకల ఫ్రాక్చర్ వంటి సమస్యల నివారణకు ఉపయోగిస్తారు. అందువల్ల ఈ కాలంలో పాలు లేదా ఇతర పాల ఉత్పత్తులను వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే తీసుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..