Boda kakarakaya: బోడ కాకర కాయతో బోలెడు లాభాలు..తెలిస్తే బోరు అనకుండా తింటారు..!
బీడు భూములు, కొండ ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతాయి. ముఖ్యంగా జూన్-జులై మాసాల్లో మొలకెత్తి ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు మార్కెట్లో కూడా అందుబాటులో ఉంటున్నాయి. ఇక వీటి ధర చికెన్, మటన్ ధరతో పోటీ పడుతుందని చెప్పాలి. అలాంటి బోడ కాకరకాయ లాభాలు తప్పక తెలుసుకోవాల్సిందే..
బోడ కాకర..ఇటీవలి కాలంలో బాగా పాపులర్ అయింది. కరోనా తర్వాత ప్రజలు ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకున్నారు. ఆరోగ్యానికి అవసరమైన ఆహారాలు తీసుకోవటం అలవాటు చేసుకుంటున్నారు. తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటున్నారు. వాటితో పాటు సేంద్రీయ ఉత్పత్తులు కూడా ఎక్కువగా వాడుతున్నారు. అలాగే, మారుమూల పల్లెలు, గ్రామాల్లో ప్రజలు ఎక్కువగా తినే ఆహారాలను అలవాటు చేసుకుంటున్నారు. అలాంటిదే బోడకాకరకాయ కూడా. అటవి ప్రాంతాలలో సహజంగా దొరికే ఆరోగ్యకరమైన కూరగాయ ఇది. బీడు భూములు, కొండ ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతాయి. ముఖ్యంగా జూన్-జులై మాసాల్లో మొలకెత్తి ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు మార్కెట్లో కూడా అందుబాటులో ఉంటున్నాయి. ఇక వీటి ధర చికెన్, మటన్ ధరతో పోటీ పడుతుందని చెప్పాలి. అలాంటి బోడ కాకరకాయ లాభాలు తప్పక తెలుసుకోవాల్సిందే..
బోడ కాకర కాయల్లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. ఇందులో విటమిన్ సి, ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, గ్లైకోసైడ్లు, అమైనో ఆమ్లాలులతో పాటు జింక్, పొటాషియం, ఫాస్పరస్ ఉంటాయి. కాబట్టి క్రమం తప్పకుండా ఆహారాల్లో తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
బోడ కాకర కాయలో అనేక రకాల ఆయుర్వేద గుణాలు నిండివున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్లు వీటిని క్రమం తప్పకుండా ఆహారాల్లో తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా అదుపులో ఉంటాయి. తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను నేరుగా సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి