నకిలీ ప్రొఫైల్స్.. నిజమైన నష్టాలు..! వాట్సాప్ డీపీ తో 5 లక్షలు స్వాహా..

సాధారణంగా స్నేహితులంటే అమితమైన ప్రేమ ఉన్నవారు అడగంగానే ఏదైనా చేసేస్తారు. అందులో భాగంగానే పాపం ఈ స్నేహితుడు తన స్నేహితుడి ఫోటో ఉన్న వాట్సాప్ నుంచి డబ్బులు అవసరం అంటూ మెసేజ్ రావడంతోనే 500000 పంపేశాడు. తీరా అది స్నేహితుడు కాదని తెలుసుకుని అవాక్కయ్యాడు.. వినటానికి మరి విడ్డూరంగా ఉన్న.. నిజమైన ప్రేమ గుడ్డిది అన్నట్లు

నకిలీ ప్రొఫైల్స్.. నిజమైన నష్టాలు..! వాట్సాప్ డీపీ తో 5 లక్షలు స్వాహా..
Whatsapp Dp Scam
Follow us
P Kranthi Prasanna

| Edited By: Jyothi Gadda

Updated on: Dec 16, 2024 | 1:54 PM

మోసపోయేవారు ఉంటే మోసం చేసేవారికి హద్దే లేదు… ఈ మధ్యకాలంలో మోసపోయిన తర్వాత గాని ఇలా కూడా మోసం చేస్తారా అనేలా ఉన్నాయి ప్రస్తుత రోజుల్లో జరుగుతున్న మోసాలు … తాజాగా అలాంటి ఘటనే ఒకటి కృష్ణా జిల్లా గుడివాడలో చోటు చేసుకుంది… సాధారణంగా స్నేహితులంటే అమితమైన ప్రేమ ఉన్నవారు అడగంగానే ఏదైనా చేసేస్తారు. అందులో భాగంగానే పాపం ఈ స్నేహితుడు తన స్నేహితుడి ఫోటో ఉన్న వాట్సాప్ నుంచి డబ్బులు అవసరం అంటూ మెసేజ్ రావడంతోనే 500000 పంపేశాడు. తీరా అది స్నేహితుడు కాదని తెలుసుకుని అవాక్కయ్యాడు.. వినటానికి మరి విడ్డూరంగా ఉన్న.. నిజమైన ప్రేమ గుడ్డిది అన్నట్లు ఈ ఐదు లక్షలు పోయాక గాని స్నేహం కూడా గుడ్డిదే అన్న సామెత గుర్తుకొచ్చిందంట పాపం…

కృష్ణ జిల్లా పెదపారుపూడి మండలం వెంట్రుప్రగడ గ్రామానికి చెందిన సత్యనారాయణకు అమెరికాలో ఓ మిత్రుడు ఉన్నాడు … వీరిద్దరి మధ్య నిత్యం ఎప్పుడూ ఆర్థిక లావాదేవీలు జరుగుతూనే ఉంటాయి …అందులో భాగంగానే నిన్న సడన్గా ఓ నెంబర్ నుంచి తన మిత్రుడి డీపీ ఉన్న వాట్సాప్ మెసెంజర్ లో ఓ మెసేజ్ వచ్చింది వెంటనే ఫోన్ చేసిన సత్యనారాయణ తన స్నేహితుడు డబ్బులు కావాలని చెప్పడంతో మాట్లాడింది తన మిత్రుడే అనుకుని ఫోన్ పే ద్వారా రెండు లక్షలు మరో ఎకౌంటు నుంచి మరో మూడు లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు.. డబ్బులు వేసిన వెంటనే తన అమెరికా మిత్రుడికి కాల్ చేశాడు ఇంతలోనే అసలు విషయం తెలుసుకుని కంగుతున్నాడు… మెసేజ్ వచ్చిన ఫోన్ కి కాకుండా తను రెగ్యులర్ గా మాట్లాడే ఫోన్ నెంబర్ ద్వారా స్నేహితుడికి కాల్ చేయడంతో ఆ కాల్లో మాట్లాడిన అసలైన మిత్రుడు అసలు నేను డబ్బులు అడగలేదని సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు… వెంటనే తను ఫోన్ పే చేసిన నెంబర్కు కాల్ చేయగా ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ రావడంతో తను మోసపోయినట్లు గ్రహించాడు… వెంటనే పోలీసులు ఆశ్రయించాడు…

ఈ మధ్యకాలంలో ఇలాంటి మోసాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది …ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఫేక్ ఐడి లు క్రియేట్ చేసుకుని తెలిసిన వారి ప్రొఫైల్ ఫొటోస్ పెట్టుకుని స్నేహితులు లాగా డబ్బులు అడగడం ట్రెండ్ అయిపోయింది… ఈ మోసాల సంఖ్య పెరిగిపోవడంతో ఈ మధ్యకాలంలో వాటిని గుర్తించిన పబ్లిక్ చాలామంది వారి ఫేక్ అకౌంట్స్ గురించి వారే ఫోటో తీసి ఇది ఫేక్ అకౌంట్ ఎవరన్నా నా పేరుతో డబ్బులు అడిగితే ఇవ్వొద్దు అంటూ ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది… ఈ మోసాలు పబ్లిక్ కి తెలిసిపోవడం వారు అలెర్ట్ అవ్వటంతో డబ్బులు సరిగ్గా రాక సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పందాలు ఎంచుకుంటున్నారు… అందులో భాగంగానే ఇప్పుడు టెలిగ్రామ్ వాట్సాప్ మెసెంజర్లలో లింకులు మెసేజ్లు పెడుతూ అమాయకులను తమ వలలోకి వేసుకుని మోసం చేస్తున్నారు ఇక మోసపోయేవారు ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన తమ జేబులకు చిల్లు పెట్టుకోవాల్సిందే ఒకటి కాదు రెండు కాదు లక్షల్లో కొల్లగొడుతున్న కేటుగాళ్ల చేతిలో పడ్డాక తిరిగి రూపా రాదంటున్నారు పోలీసులు… కాబట్టి డబ్బులు పోగొట్టుకోవడానికి ముందే అప్రమత్తంగా ఉండాలి తప్ప పోయిన తర్వాత పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి ఉపయోగం లేదంటూ హెచ్చరిస్తున్నారు..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వీళ్లు మనుషులా? మృగాలా? గుండె తరుక్కుపోయే ఘటన.! వీడియో
వీళ్లు మనుషులా? మృగాలా? గుండె తరుక్కుపోయే ఘటన.! వీడియో
2025లో ఏం జరగబోతోంది.? నోస్ట్రడామస్‌ ఏం చెప్పారు.? వీడియో..
2025లో ఏం జరగబోతోంది.? నోస్ట్రడామస్‌ ఏం చెప్పారు.? వీడియో..
‘నేను చెబుతున్నాగా.. మీ తల్లిదండ్రుల్ని..’ అమెరికా బాలుడికి వింత
‘నేను చెబుతున్నాగా.. మీ తల్లిదండ్రుల్ని..’ అమెరికా బాలుడికి వింత
దోమలు టార్గెట్ చేసే బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా.?
దోమలు టార్గెట్ చేసే బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా.?
ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు! తండ్రి ఏం..
ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు! తండ్రి ఏం..
తగ్గేదేలే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
తగ్గేదేలే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
ప్రతి నెలా రూ.9 వేలు మీ చేతికి.! రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్
ప్రతి నెలా రూ.9 వేలు మీ చేతికి.! రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్
రైల్లో మంటలు చెలరేగితే తప్పించుకోవడం ఎలానో తెలుసా.? రెడ్‌ విండో..
రైల్లో మంటలు చెలరేగితే తప్పించుకోవడం ఎలానో తెలుసా.? రెడ్‌ విండో..
మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు..
మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు..
శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా.? నిపుణుల సలహా ఏమిటి.?
శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా.? నిపుణుల సలహా ఏమిటి.?