AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: లండన్‌ వీధుల్లో ఇండియన్ బేల్‌పూరీ.. ఉద్యోగం మానేసిన బ్రిటీష్‌ వ్యక్తి ఇలా..

మరమరాలు ఉపయోగించి తయారు చేసే రుచికరమైన వంటకం అంతేకాదు.. పోషక విలువులు కూడా సమృద్ధిగా లభించే స్నాక్‌ ఐటమ్‌ బెల్‌పూరీ. ఇలాంటి బేల్‌పూరీ లవర్స్‌ ఇప్పుడు మన దేశంలోనే కాదు..ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. ఝల్మూరి కేవలం భారత్‌కే పరిమితం కాకుండా లండన్‌లోనూ చర్చనీయాంశమైంది.

Watch: లండన్‌ వీధుల్లో ఇండియన్ బేల్‌పూరీ.. ఉద్యోగం మానేసిన బ్రిటీష్‌ వ్యక్తి ఇలా..
Kolkata Style Jhalmuri In London
Jyothi Gadda
|

Updated on: Dec 16, 2024 | 1:34 PM

Share

ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా, ఎంత రుచికరమైన ఆహారం తిన్నా భారతీయ మసాలా దినుసులు, ఆహారపదార్థాల రుచి మరెక్కడా దొరకదు. చాలా మంది విదేశీయులు మన దేశం ఆహార పదార్థాల రుచికి ఎంతగానో ఆకర్షితులవుతారు. అలాంటి వారు ఇక్కడ తమకు నచ్చిన వంటకాన్ని ఎలా తయారు చేయాలో ఇష్టంగా నేర్చుకుంటారు. తమ దేశానికి తిరిగి వెళ్లి అక్కడ వాటిని ట్రై చేస్తుంటారు. అలా నేర్చుని వెళ్లిన ఓ వ్యక్తి ఏకంగా లండన్‌లో పెద్ద వ్యాపారం మొదలుపెట్టాడు. అదేంటో పూర్తి వివరాల్లోకి వెళితే..

మన దేశంలో సాయంత్రం వేళ, భోజనం అందుబాటులో లేని సమయంలో తినేందుకు ప్రత్యేకించి చాలా రకాల స్నాక్స్‌ ఉన్నాయి. అందులో పారీపూరీ, సమోసా, చాట్‌, బేల్‌పూరీ వంటివి ప్రజల్లో బాగా క్రేజ్‌ ఉన్నా తినుబండరాలు. వీటిని ప్రజలు బాగా ఇష్టంగా లాగిస్తుంటారు. అయితే, ఇప్పుడు కోల్‌కత్తాలో బాగా పాపులర్‌ అయిన బేల్‌పూరీ వంటకం ఇప్పుడు లండన్‌ వీధుల్లో దుమ్మురేపుతోంది. మన దేశంలో బేల్‌పూరీ టేస్ట్‌ చేసిన లండన్‌ వ్యక్తి ఒకరు దానిపై బానిసగా మారిపోయారు. దాంతో అతను లండన్‌లో బేల్‌పూర్తీ వ్యాపారం మొదలు పెట్టాడు. ఆ రుచితో లండన్‌ వ్యాప్తంగా బాగా ఫేమస్‌ అయ్యాడు. అతని వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరమరాలు ఉపయోగించి తయారు చేసే రుచికరమైన వంటకం అంతేకాదు.. పోషక విలువులు కూడా సమృద్ధిగా లభించే స్నాక్‌ ఐటమ్‌ బెల్‌పూరీ. ఇందులో టమాట, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వేరుశెనగ, బూందీ మిక్చర్ ఉపయోగిస్తారు. అంతేకాకుండా కరకరలాడే పఫ్డ్ రైస్, క్రంచీస్, దంచిన పాప్డీ, మసాలా శనగలు, బంగాళాదుంప వంటి కూరగాయలు, చాట్ మసాలాతో రుచిగా, మూడు చట్నీలు – తీపి, టమ్‌కీన్‌లను కలిపి భేల్‌పూరి తయారు చేస్తారు. ఇలాంటి బేల్‌పూరీ లవర్స్‌ ఇప్పుడు మన దేశంలోనే కాదు..ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. ఝల్మూరి కేవలం భారత్‌కే పరిమితం కాకుండా లండన్‌లోనూ చర్చనీయాంశమైంది. లండన్‌లో ఓ వ్యక్తి కోల్‌కతా స్టైల్‌లో బెల్ పూరినీ విక్రయిస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు.  అంతకు ముందు ఆ వ్యక్తి మంచి ఉద్యోగం చేస్తూ బాగానే సంపాదించేవాడని తెలిసింది. ఆ తర్వాత ఉద్యోగం మానేసి బెల్‌పూరీ అమ్మడం మొదలుపెట్టాడని సమాచారం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి