Snake viral video: పాముతోనే పరాచకం.. హద్దు మీరి ముద్దు పెట్టి.. ఆ తర్వాత జరిగింది చూడాల్సిందే..

వైరల్‌గా మారిన ఈ వీడియోలో ఓ వ్యక్తి కొండచిలువను పట్టుకుని ముద్దుపెట్టుకోవడానికి ప్రయత్నించాడు. కానీ, అది అతనికి తిరిగి ముద్దుపెట్టింది. పాము అతడిని ముద్దుపెట్టడమే కాదు, ఆ వ్యక్తి

Snake viral video: పాముతోనే పరాచకం.. హద్దు మీరి ముద్దు పెట్టి.. ఆ తర్వాత జరిగింది చూడాల్సిందే..
Snake
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 16, 2024 | 8:38 AM

సోషల్ మీడియాలో ప్రతిరోజూ అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీటిలో పాముల వీడియోలు ప్రజల్ని ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. కొంతమంది విషపూరిత పాములతో స్టంట్స్ చేస్తుంటారు. మరికొంతమంది పాముల్ని పెంపుడు జంతువులుగా కూడా పెంచుకుంటారు. మరికొంతమంది పాముల కాటు ప్రమాదాల నుంచి తృటిలో తప్పించుకున్న వీడియోలను లక్షలాది మంది వీక్షిస్తున్నారు. ప్రాణహాని ఉందని తెలిసి కూడా కొందరు పాములతో ఆడుకునే ప్రయత్నం చేస్తుంటారు.. పాములను పట్టుకుని రక్షించేందుకు వెళ్లిన కొందరు వాటి కాటుకు గురై చనిపోతుంటారు కూడా. అయితే, ఇక్కడ కూడా అలాంటి వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది.

చాలా మంది తమ ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా పాములతో వెర్రి సాహసాలు చేస్తుంటారు . అలాంటిదే మరో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. @Poonam_1992 అనే ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియో షేర్ చేయబడింది. ఇప్పటికే లక్షలాది మంది ఈ వీడియోని వీక్షించారు. ఈ 15 సెకన్ల వీడియో చూడటానికి చాలా భయంగా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

వైరల్‌గా మారిన ఈ వీడియోలో ఓ వ్యక్తి కొండచిలువను పట్టుకుని ముద్దుపెట్టుకోవడానికి ప్రయత్నించాడు. కానీ, అది అతనికి తిరిగి ముద్దుపెట్టింది. పాము అతడిని ముద్దుపెట్టడమే కాదు, ఆ వ్యక్తి చెంపను గట్టిగా పట్టేసుకుని బలంగా కొరికింది. పాము కాటు కారణంగా అతని చెంపలో పళ్లు ఇరుక్కుపోయాయి. అతను ఎంత ప్రయత్నించినా పామును వదిలించుకోలేకపోయాడు. పాము కాటుకు గురై నొప్పితో ఇబ్బంది పడ్డాడు.

ఈ వైరల్ వీడియో సోషల్ మీడియా వీక్షకుల దృష్టిని ఆకర్షించింది. చాలా మంది ఈ వీడియోపై ఫన్నీగా కామెంట్స్ చేశారు. పాముతో సరసాలాడే వారికి ఇదే శిక్ష అని కొందరంటే, పాము ముద్దు పొందిన మీరు ధన్యులు అని మరికొందరు వ్యాఖ్యానించారు. ఈ ఘటన ఇంటర్నెట్‌లో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్