Viral: లాటరీతో లక్ వచ్చిందనుకున్నాడు.. కట్ చేస్తే.. కొద్దిరోజుల్లోనే ఊహించని సీన్

అతడికి లాటరీ లక్ వచ్చిపడింది. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. సుమారు రూ. 284 కోట్లు వచ్చాయి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.! అది వచ్చిన కొద్దిరోజుల్లోనే ఊహించని సీన్ ఎదురైంది..

Viral: లాటరీతో లక్ వచ్చిందనుకున్నాడు.. కట్ చేస్తే.. కొద్దిరోజుల్లోనే ఊహించని సీన్
Lottery Prize
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 16, 2024 | 8:49 AM

రాత్రింబవళ్లు కష్టపడి బోలెడంత డబ్బు సంపాదించాలనేది ప్రతి ఒక్కరి కల. ఈ డబ్బుల వేటలో ఒక్కోసారి కొంతమంది అదృష్టం ఏమేరకు ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓవర్‌నైట్‌లోనే కోటీశ్వరులైన కొందరిని మనం చూస్తూనే ఉన్నాం. సరిగ్గా ఇలాంటి తరహ ఓ ఘటన బ్రెజిల్‌లో జరిగింది. ఒక వ్యక్తి సుమారు రూ. 284 కోట్లను లాటరీలో గెలుచుకున్నాడు. అయితేనేం గెలిచిన కొద్దిరోజుల్లోనే విగతజీవిగా మారాడు. ఆ వివరాలు ఇలా..

ఇది చదవండి: మీరు నిజంగానే తోపులైతే.. ఈ ఫోటోలో దాగున్న నెంబర్ కనిపెట్టగలరా.?

జాతీయ మీడియా కథనం ప్రకారం.. బ్రెజిల్‌కు చెందిన ఆంటోనియో అనే రైతు.. ఆ దేశంలోనే అతిపెద్ద లాటరీ అయిన మెగాసేనలో £26.5 మిలియన్ల జాక్‌పాట్‌ను గెలుచుకున్నాడు. భారత కరెన్సీ పరంగా ఈ లెక్క రూ. 283.6 కోట్లు. ఇంత మొత్తం గెలుచుకున్న అనంతరం.. తన కలలు అన్నింటినీ నెరవేర్చుకోవచ్చునని.. అప్పులన్నీ తీర్చేసి సంతోషంగా జీవితాన్ని గడపవచ్చునని భావించిన ఆంటోనీయో.. అనూహ్యంగా లాటరీ కొన్న కొద్ది రోజుల్లోనే గుండెపోటుతో చనిపోయాడు.

ఇవి కూడా చదవండి

ఆంటోనియో డబ్బులు రాగానే.. తన డెంటల్ సర్జరీకి డేట్ ఫిక్స్ చేసుకున్నాడు. ఇక ఆ సర్జరీ చేస్తున్న సమయంలోనే అతడు గుండెపోటుతో మరణించినట్టు సమాచారం. దీంతో ఆంటోనియో కుటుంబీకులు శస్త్రచికిత్స నిర్వహించిన క్లినిక్‌పై అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

ఇది చదవండి: గూగుల్ తల్లికే తెలియని అడ్రస్.. ఏపీలో ఓ పాకిస్తాన్ ఉందని తెల్సా.!

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి