Vijayawada: గూగుల్ తల్లికే తెలియని అడ్రస్.. ఏపీలో ఓ పాకిస్తాన్ ఉందని తెల్సా.!

సాధారణంగా మనకు తెలియని విషయాలు ఏవైనా ఉంటే.. అది గూగుల్ తల్లినో, లేక మరెవరినైనా అడిగి తెలుసుకుంటాం. అయితే గూగుల్ తల్లికే తెలియని విషయాలుంటే.? ఏంటి ఆశ్చర్యపోతున్నారా.? అవునండీ.! మన ఏపీలోని విజయవాడలో పాకిస్తాన్ ఉంది..

Vijayawada: గూగుల్ తల్లికే తెలియని అడ్రస్.. ఏపీలో ఓ పాకిస్తాన్ ఉందని తెల్సా.!
Vijawada
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 12, 2024 | 11:31 AM

గూగుల్ మ్యాప్స్, గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌లకు కూడా అడ్రస్ లభించని ప్రాంతం అది. దాని పేరు పాకిస్తాన్.! అది కూడా మన ఆంధ్రప్రదేశ్‌లో ఉంది.. ఎక్కడని అనుకుంటున్నారా.. బెజవాడలోని ఓ కాలనీ పేరు పాకిస్తాన్. ఇందిరా గాంధీ హయాంలో నిర్మించిన ఈ కాలనీ గూగుల్‌లో కూడా మీకు దొరకదు. పాకిస్తాన్ పేరు వినగానే అక్కడ నివసించేదంతా పాకిస్తానీయులని అనుకోవద్దు. అక్కడున్నది అందరూ మన వాళ్లే. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే నిరుపేదలు. 1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించింది. అదే సమయంలో పాక్, బంగ్లాదేశ్ విడిపోవడంతో ఇరు దేశాల సరిహద్దులలోని అనేక కుటుంబాలు నిరాశ్రయులు అయ్యారు.

దీనితో అప్పటి ప్రధాని దేశంలోని వివిధ ప్రాంతాల్లో వారికి ఆశ్రయం కల్పించారు. 1984లో నగరంలోని పాయకాపురం ప్రాంతంలో 40 ఇళ్లతో ఓ కాలనీ ఏర్పాటయింది. దానికి పాకిస్తాన్ కాలనీగా నామకరణం చేశారు. ముందుగా ఈ కాలనీ ఇందిరా గాంధీ హయాంలో పాకిస్తాన్ బట్టల వ్యాపారస్తుల కోసం నిర్మించినట్టు తెలుస్తోంది. అయితేనేం.. ఈ కాలనీలో పాకిస్తాన్ వాసులు ఎవరు లేరని, రాలేదని స్థానికులు చెబుతున్నారు. అప్పట్లో వరదలు ఉధృతంగా రావడంతో.. ఇళ్లు లేని వాళ్లు అనేక మంది ఇక్కడకు వచ్చి ఈ ప్రాంతంలో తలదాచుకున్నారని అంటున్నారు. ఇక అప్పుడు వచ్చిన వాళ్లు కొందరు ఇంకా ఇప్పటికీ ఆ కాలనీలోనే ఉంటుంటే.. మరికొందరు వారి స్థలాలను అమ్మేసుకుని వేరే ప్రాంతానికి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. నున్న పోలీస్ స్టేషన్‌కు సమీపంలో ఈ పాకిస్తాన్ కాలనీ గురించి బయట వాళ్లకు పక్కనపెడితే.. బెజవాడలోని చాలామందికే ఈ ప్రాంతం గురించి తెలియకపోవడం గమనార్హం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.