Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: మట్టిని తవ్వుతుండగా మెరుస్తూ కనిపించింది.. ఏంటా అని వెలికితీయగా

పురాతన తవ్వకాల్లో చారిత్రక సంపదకు సంబంధించిన విశేషాలు ఎన్నో దొరుకుతుంటాయి. అప్పుడప్పుడూ వింత వింత వస్తువులు సైతం దర్శనమిస్తాయి. తాజా ఆ తరహ ఓ వీడియో..

Viral: మట్టిని తవ్వుతుండగా మెరుస్తూ కనిపించింది.. ఏంటా అని వెలికితీయగా
Representative Image
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 15, 2024 | 1:00 PM

పురాతన తవ్వకాల్లో చారిత్రక సంపద, నగలు, నవరత్నాలు లభిస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. అలాగే పాత ఇళ్లను కూల్చుతుండగా కూడా కొన్ని బంగారు, వెండి నాణేలు కనిపిస్తుంటాయి. ఇలాంటి విచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఈ తరహ ఓ వీడియో ఇంటర్నెట్‌లో తెగ సందడి చేస్తోంది. తవ్వకాల్లో ఓ మానవ ఎముకలు బయటపడ్డాయి.

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. తవ్వకాలు జరుగుతుండగా.. మట్టిలో ఏదో అనుమానాస్పదంగా కనిపించడంతో.. దాన్ని బయటకు తీశారు. ఇక అవి మానవ ఎముకలుగా గుర్తించారు. ఆ ఎముకల వద్ద ఒక వింత వస్తువు కనిపించింది. గుండ్రంగా ఉన్న ఓ ఇనుప వస్తువు ఎముకతో కలిపి ఉండటాన్ని చూసి పురావస్తు శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. అదేంటని పరిశీలించగా.. మోకాలి ఆపరేషన్ సమయంలో అమర్చే కీలుగా గుర్తించారు. మోకాలి ఆపరేషన్ సమయంలో ఇలా గుండ్రంగా ఉండే ఇంప్లాంట్లను అమర్చుతారు. ఇది 20 నుంచి 30 సంవత్సరాల వరకు ఉండేలా తయారు చేస్తారు. ఇక బయటపడ్డ శరీరం కుళ్లిపోయినా కూడా.. ఈ ఇంప్లాంట్ మాత్రం చెక్కు చెదరకుండా ఉండటం అందరినీ ఆశ్చర్యాన్ని గురి చేసింది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి