Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఖతర్నాక్‌ కిలేడీ… ఆదరించిన వారికే సున్నం పెట్టింది.. నమ్మకంగా ఉంటూ చివరకు ఇలా..

గరంలోని ప్రగతినగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఒడిశాలో ఉంటున్న భార్య ఊర్వశి, పది నెలల కుమారుడు మహీర్‌ను నెల క్రితం ఒంగోలు తీసుకువచ్చాడు. వారి పక్కింట్లోనే దయామణి అనే మహిళ నివసిస్తోంది. తాను అనాధనని, తనకు ఎవరూ లేరని పరిచయం చేసుకుంది.

Andhra Pradesh: ఖతర్నాక్‌ కిలేడీ... ఆదరించిన వారికే సున్నం పెట్టింది.. నమ్మకంగా ఉంటూ చివరకు ఇలా..
Boy Kidnap Case
Follow us
Fairoz Baig

| Edited By: Jyothi Gadda

Updated on: Dec 14, 2024 | 12:45 PM

ఒంగోలులో పదినెలల బాలుడి కిడ్నాప్‌ కలకలం రేపింది… ఇంట్లో పడుకుని ఉన్న బాబును ఇంటి పక్కనే ఉంటున్న మరో మహిళ ఎత్తుకెళ్లింది… బాలుడు కిడ్నాపయ్యాడని తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గంటల వ్యవధిలోనే కిడ్నాపర్‌ను పట్టుకుని బాలుడ్ని సంరక్షించారు… బాలుడ్ని తల్లిదండ్రులకు అప్పగించారు… తమ బిడ్డను సురక్షితంగా తమకు అప్పగించిన పోలీసులకు బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

ఒంగోలు ప్రగతి నగర్‌లో శుక్రవారం పదినెలల బాలుడు కిడ్నాప్‌కు గురయ్యాడు… ఇంటి దగ్గర ఉన్న బాలుడ్ని అదే కాలనీలో ఉంటున్న మరో మహిళ ఎత్తుకెళ్ళింది… ఎంతకీ ఆమె తిరిగి రాకపోవడంతో బాలుడ్ని కిడ్నాప్‌ చేసిందని గ్రహించిన తల్లిదండ్రులు ఒంగోలు తాలూకా పియస్‌లో ఫిర్యాదు చేశారు… వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాలుడికోసం గాలింపు ముమ్మరం చేశారు..

ఒడిశాకు చెందిన ప్రదీప్‌ సునానీ మూడేళ్లుగా ఒంగోలులోని ఓ కార్‌ కేర్‌ షాపులో పనిచేస్తున్నాడు. నగరంలోని ప్రగతినగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఒడిశాలో ఉంటున్న భార్య ఊర్వశి, పది నెలల కుమారుడు మహీర్‌ను నెల క్రితం ఒంగోలు తీసుకువచ్చాడు. వారి పక్కింట్లోనే దయామణి అనే మహిళ నివసిస్తోంది. తాను అనాధనని, తనకు ఎవరూ లేరని పరిచయం చేసుకుంది. నిత్యం ఆమె బాలుడిని ఆడిస్తుంటుంది. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం బాలుడ్ని ఆడించేందుకు తీసుకెళ్లింది. సాయంత్రం వరకు ఇంటికి తీసుకురాలేదు. దీంతో తల్లిదండ్రులు పిల్లాడి కోసం వెతకగా ఇద్దరూ కనిపించలేదు. దయామణికి సంబంధించిన దుస్తులు, వస్తువులు కూడా ఆమె ఇంట్లో లేవు. దీంతో బాలుడిని కిడ్నాప్‌ చేసిందని నిర్ధారించుకున్న తల్లిదండ్రులు ఒంగోలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఒంగోలు డిఎస్‌పి రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఐదు బృందాలు బాలుడి కోసం గాలించాయి. ఇంటి సమీపంలో ఉన్న సిసికెమెరా పుటేజ్‌ను పరిశీలించారు. కిడ్నాపర్‌ దయామణి కోసం నగరమంతా జల్లెడ పెట్టారు… ఎట్టకేలకు రాత్రి 12 గంటల ప్రాంతంలో నగర శివారులో కిడ్నాపర్‌ దయామణిని గుర్తించి పట్టుకున్నారు. బాలుడ్ని సంరక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితురాలు దయామణిని అరెస్ట్‌ చేశారు. తమ ఇంటి పక్కన నమ్మకంగా ఉంటున్న దయామణి అనే మహిళ బాలుడ్ని కిడ్నాప్‌ చేసిందని, అయితే వెంటనే పోలీసులు స్పందించి తమ బిడ్డను సురక్షితంగా తమకు అప్పగించారని బాలుడి తల్లి, బంధువులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..