చలికాలంలో గుండెను ఆరోగ్యంగా ఉంచే ఈ పండు.. ఆరోగ్య రహస్యాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!
శీతాకాలంలో చల్లటి వాతావరణం కారణంగా చాలా మంది నారింజ పండ్లను తినడానికి వెనుకాడతారు. ఆరెంజ్ జ్యూస్ తాగితే జలుబు, ఫ్లూ వంటి సమస్యలు వస్తాయని చాలా మంది భయపడుతుంటారు.. కానీ చలికాలంలో వీటిని తీసుకోవడం వల్ల చాలా రకాలుగా మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చలికాలంలో నారింజ పండు, జ్యూస్ తీసుకోవటం వల్ల కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Dec 16, 2024 | 9:05 AM

చలికాలం వస్తే మార్కెట్లో రకరకాల నారింజ పండ్లు దర్శనమిస్తాయి. ముఖ్యంగా నారింజలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి కాలానుగుణ జలుబు, దగ్గు నుంచి బయటపడటానికి సహాయపడుతుంది. శరీరంలో వివిధ రకాల విటమిన్ల అవసరం ఉన్నప్పటికీ.. వాటిల్లో విటమిన్ సి అగ్రస్థానంలో ఉంటుంది.

నారింజ పండులో విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ పండులోని ఫైబర్ ఆకలిని తగ్గిస్తుంది. ఇది మన శరీరంలోని జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి మనలను చలికాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల బారి నుండి కాపాడుతుంది.

చర్మానికి సహజమైన హైడ్రేషన్ అందిస్తుంది. ముడతలను తొలగిస్తుంది. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్ల కారణంగా చర్మం అంతర్గతంగా ఆరోగ్యంగా ఉంటుంది. నారింజ తినడం వల్ల మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులోని ఫైబర్, సహజ ఎంజైమ్‌లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. నారింజలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.

నారింజ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. వివిధ వ్యాధుల నుండి రక్షిస్తుంది.

నారింజ రసంలో విటమిన్ సి, ఇ పుష్కలంగా ఉన్నాయి. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల చర్మం శుభ్రపడుతుంది. ముఖ ముడతలను తగ్గిస్తుంది. చర్మ కణాలను పునరుత్పత్తి చేస్తుంది. ఇది గాయాల వల్ల ఏర్పడే డార్క్ స్పాట్‌లను తొలగించడంలో సహాయపడుతుంది. నారింజ పండులో ఉండే పోషకాలు మన కంటి చూపును కూడా మెరుగుపరిచి మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి.




