ఇప్పపువ్వు సారా కిక్కు.. మామూలుగా ఉండదు.. కానీ ఆ ప్రాంత మహిళలు ఈ పువ్వును దేనికి వాడుతున్నారో తెలిస్తే..
Benefits Of IPPAPUVVU : ఇప్పపువ్వు తెలంగాణలో దొరికే ప్రకృతి ప్రసాదం. దీని గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఏజెన్సీ వాసులకు దీని పరిచయం
Benefits Of IPPAPUVVU : ఇప్పపువ్వు తెలంగాణలో దొరికే ప్రకృతి ప్రసాదం. దీని గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఏజెన్సీ వాసులకు దీని పరిచయం అక్కర్లేదు. దీంతో తయారుచేసిన సారా భలే మత్తెక్కిస్తుంది. ఆదివాసీలకు ఇది మంచి ఆదాయ వనరు కూడా. అయితే ఈ పువ్వుతో మత్తెక్కించే సారాయే కాకుండా చాలా వాటిలో ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు దేనికి వాడుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
భారత దేశంలోని మెజార్టీ ఆడవాళ్లలో రక్తహీనత (రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడం) కనపడుతుంది. తెలంగాణలోని భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని ఏజెన్సీ గర్భిణుల్లో లక్షమందిలో 152 మంది, వెయ్యి మంది అప్పుడే పుట్టిన శిశువుల్లో48 మంది చనిపోతున్నారు. ప్రసవ సమయంలో రక్తస్రావం జరిగి తల్లీబిడ్డలు మరణిస్తున్నారు. హెల్దీ ఫుడ్ తీసుకునే వాళ్లలోనే ఈ సమస్య ఉంటే.. ఇంకా ఏజెన్సీ ప్రాంత మహిళల్లో ఆ పరిస్థితి మరీ దారుణం. ఇంకా గర్భిణుల్లోనైతే హిమోగ్లోబిన్ 3నుంచి 5శాతం కూడా ఉండక ఎర్ర రక్త కణాలు తగ్గపోతున్నాయి. దీంతో వారిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి వివిధ రకాల రోగాల బారిన పడుతున్నారు.
ఇవన్నీ అరికట్టడానికి గిరిజన సంక్షేమ అధికారులు ఓ మార్గం ఎంచుకున్నారు. ఇప్ప పువ్వులో ఉండే ఐరన్ కు రక్త హీనత తగ్గించే లక్షణాలు ఉన్నాయి. అలాగే ఇతర పోషకాలు ఎన్నో ఉన్నాయి. దీంతో ఇప్పపువ్వుతో చేసిన లడ్డూలను గర్భిణులకు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిని ఏప్రిల్ నుంచి ఆరు నెలలు గర్భిణులకు అందించనున్నారు.
ఇవి కూడా చదవండి : Bharat Bandh Today Live: ‘భారత్ బంద్’: రైతు ఆందోళనలు ఉధృతం.. మద్దతుగా ఉక్కు కార్మికులు.. ఏవేవి బంద్ కానున్నాయంటే.!
Buchi Babu Sana: ఖరీదైన కారును బహుమతిగా అందుకున్న ఉప్పెన దర్శకుడు.. మొదటి రైడ్ ఎవరితో వెళ్లాడంటే..