AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Grapes: నల్ల ద్రాక్ష పండ్లను తింటున్నారా?.. అయితే మీరు కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.. ఎందుకంటే..

Black Grapes: ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. రోజూ వ్యాయామం చేయడంతో పాటు.. ఆరోగ్యకరమైన ఆహారమూ తీసుకోవాలి. అందుకోసం..

Black Grapes: నల్ల ద్రాక్ష పండ్లను తింటున్నారా?.. అయితే మీరు కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.. ఎందుకంటే..
Black Grapes
Shiva Prajapati
|

Updated on: Mar 27, 2021 | 7:23 AM

Share

Black Grapes: ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. రోజూ వ్యాయామం చేయడంతో పాటు.. ఆరోగ్యకరమైన ఆహారమూ తీసుకోవాలి. అందుకోసం పండ్లను అధికంగా తినాలని వైద్యులు సైతం సూచిస్తుంటారు. అయితే, పండ్లలో మనం నల్ల ద్రాక్ష పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మిగతా పండ్లతో పోలిస్తే నల్ల ద్రాక్షలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఎన్నో ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ద్రాక్ష పండ్లలో సీ-విటమిన్, ఏ-విటమిన్, బీ6, ఫోలిక్ ఆమ్లం, గ్లూకోజ్, మెగ్నీషియం, సిట్రిక్ యాసిడ్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి మనుషులను అనేక వ్యాధుల బారి నుంచి, రోగాల నుంచి రక్షిస్తాయి. రోజూ కొన్ని ద్రాక్ష పండ్లను తినడం ద్వారా మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, జట్టు, చర్మం, ఊబకాయం వంటి సమస్యలు కూడా తగ్గుముఖం పడుతాయి.

అంతేకాదు.. ద్రాక్ష పండ్లలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు మనుషుల్లో వచ్చే వృద్ధాప్య ఛాయలను తొలగించి నిత్య యవ్వనంగా ఉండేందుకు తోడ్పాటునందిస్తాయి. ఇక ఈ పండ్లను తినడం ద్వారా రక్తంలో నైట్రిన్ ఆక్సైడ్ మోతాదులు పెరుగుతాయి. తద్వారా రక్తనాళాలలో రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది. అలా గుండెపోటు నివారణకు దోహదపడుతుంది. నల్ల ద్రాక్షలో ఉండే కొన్ని రకాల పోషకాలు క్యాన్సర్‌ కారకాలతో పోరాడుతాయని వైద్యులు తెలిపారు. నల్లద్రాక్షలో ఉండే ఫైటోకెమికల్స్‌ గుండెలో పేరుకునే చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి అక్కడి కండరాలకు మేలుచేస్తాయి. అలా హృద్రోగాలను కూడా దూరం చేస్తాయట. ఇక నల్ల ద్రాక్ష పండ్లను తినడం వల్ల శరీరం బరువును కూడా తగ్గించుకోవచ్చు. ఊబకాయంతో బాధపడుతున్నవారు నల్ల ద్రాక్షను తరచుగా తీసుకోవడం ద్వారా.. రక్తంలో కొలెస్ట్రాల్‌ ఏర్పడకుండా ఆపుతుంది. తద్వారా ఊబకాయం వంటి ఇతర ఆరోగ్య సమస్యలను కూడా ఇది నివారిస్తుంది. అలాగే మనుషుల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరిగేందుకు సహకరిస్తుంది. మైగ్రేన్ వంటి వ్యాధుల నుంచి కూడా బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.

నల్ల ద్రాక్ష పండ్లను క్రమం తప్పకుండా తినడం వల్ల మధుమేహం కూడా కంట్రోల్‌లోకి వస్తుందట. నల్ల ద్రాక్ష పండ్లలో రెస్వెరాటల్ అనే పదార్థం ఉంటుంది. అది రక్తంలో ఇన్సులిన్ స్థాయిని పెంచడం ద్వారా శరీరంలోని చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. వీటిని తినడం ద్వారా చర్మ ఆరోగ్యవంతంగా, కాంతివంతంగా తయారవుతుందట. ఇక జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి నల్ల ద్రాక్ష ఎంతగానో ఉపకరిస్తుందని వైద్యులు చెబుతున్నారు. జట్టుకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే ఎక్కువగా నల్ల ద్రాక్ష పండ్లను తింటే ప్రయోజనం కలుగుతుందంటున్నారు. ఈ పండ్లలో ఉండే విటమిన్లు.. జుట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయట. జట్టు రాలటం, తెలుపు రంగులోకి మారడం, చుండ్రు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయట. జుట్టు మందంగా, మృదువుగా, బలంగా తయారవుతుందట. మరింకెందుకు ఆలస్యం.. రోజూ కొన్ని నల్ల ద్రాక్ష పండ్లను తినండి.. మెండైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి.

Also read:

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ఎవరిని టార్గెట్ చేస్తున్నారో.. ఓటర్లకు ఏం చెబుతున్నారో.. అంతా కన్ఫ్యూజన్.!

Shooting World Cup: షూటింగ్ ప్రపంచకప్​లో భారత్ జోరు.. మహిళల 25 మీటర్ల పిస్టల్ గ్రూప్ విభాగంలో స్వర్ణం