Shooting World Cup: షూటింగ్ ప్రపంచకప్‌లో భారత్ జోరు.. మహిళల 25 మీటర్ల పిస్టల్ గ్రూప్ విభాగంలో స్వర్ణం
Shooting World Cup: ఢిల్లీలో జరుగుతోన్న షూటింగ్ ప్రపంచకప్‌లో భారత్ జోరు కొనసాగుతోంది. తాజాగా మహిళల 25 మీటర్ల పిస్టల్ గ్రూప్ విభాగంలో స్వర్ణం సాధించింది భారత్. రహీ సర్నోబత్, మను బాకర్, చింకీ యాదవ్‌లతో కూడిన బృందం..
ఢిల్లీలో జరుగుతోన్న షూటింగ్ ప్రపంచకప్‌లో భారత్ జోరు కొనసాగుతోంది. తాజాగా మహిళల 25 మీటర్ల పిస్టల్ గ్రూప్ విభాగంలో స్వర్ణం సాధించింది భారత్. రహీ సర్నోబత్, మను బాకర్, చింకీ యాదవ్‌లతో కూడిన బృందం పొలాండ్ టీమ్‌పై గెలిచి బంగారు పతకం దక్కించుకుంది.
డాక్టర్ కర్నీ సింగ్ షూటింగ్ రేంజ్లో జరిగిన ఈ పోరులో పొలాండ్‌కు చెందిన జొన్నా ఇవోనా, వావ్రోనోవస్కా, జులితా బోరెక్ బృందంపై భారత్‌కు చెందిన రహీ సర్నోబత్, చింకీ యాదవ్, మను బాకర్ టీమ్ 17-7 తేడాతో విజయం సాధించింది.
ఈ పతకంతో భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ప్రస్తుతానికి ఇండియా ఖాతాలో 21 పతకాలు చేరాయి. ఇందులో 10 స్వర్ణం, 6 వెండి, 5 కాంస్య పతకాలు ఉన్నాయి.