AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bedu Fruit: ‘బేడూ’ ఫ్రూట్ ఒక న్యాచ్‌రల్‌ పెయిన్‌ కిల్లర్.. ఎక్కడ దొరుకుతుందో తెలుసా..?

Bedu Fruit: తలనొప్పి, బాడీ పెయిన్, వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పులు మొదలైన నొప్పులన్నింటికి ప్రజలు తరచుగా పెయిన్ కిల్లర్‌లను ఉపయోగిస్తారు. ఈ మందుల వల్ల మనకు

Bedu Fruit: 'బేడూ' ఫ్రూట్ ఒక న్యాచ్‌రల్‌ పెయిన్‌ కిల్లర్.. ఎక్కడ దొరుకుతుందో తెలుసా..?
Bedu Fruit Anjeer
uppula Raju
|

Updated on: Oct 28, 2021 | 12:09 PM

Share

Bedu Fruit: తలనొప్పి, బాడీ పెయిన్, వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పులు మొదలైన నొప్పులన్నింటికి ప్రజలు తరచుగా పెయిన్ కిల్లర్‌లను ఉపయోగిస్తారు. ఈ మందుల వల్ల మనకు తక్షణ ఉపశమనం కలుగుతుంది కానీ వాటి వల్ల దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విషయాన్ని వైద్యులు కూడా ధ్రువీకరిస్తారు. అంతేకాదు పెయిన్ కిల్లర్స్ శరీరంలోని అనేక భాగాలను దెబ్బతీస్తాయి. దీర్ఘకాలికంగా ప్రభావం చూపుతాయి. అటువంటి పరిస్థితిలో ప్రజలు ఆయుర్వేద నివారణలను స్వీకరించాలని సూచించారు.

ఉదాహరణకు తలనొప్పి లేదా శరీర నొప్పి ఉంటే ఆవాల నూనె మసాజ్ ప్రయోజనకరంగా ఉంటుంది. కడుపు నొప్పికి జామిన్, బ్లాక్ సాల్ట్ నీరు తాగడం కూడా మంచిది. అలాగే పెయిన్‌ కిల్లర్స్‌ కోసం ఉపశమనానికి సంబంధించి ఒక సహజ నివారణ కూడా ఉద్భవించింది. దాని పేరే బేడూ ఫ్రూట్‌.’బేడు’ ఫ్రూట్‌నే హిమాలయ అత్తి అని కూడా అంటారు. నొప్పి నుంచి ఉపశమనం కోసం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఉత్తరాఖండ్‌లోని కుమావోన్ జిల్లాలో సాధారణంగా ‘బేడు’ పండ్లు చెట్లు ఉంటాయి.

ఆస్పిరిన్, డిక్లోఫెనాక్ వంటి సింథటిక్ నొప్పులకు సురక్షితమైన ప్రత్యామ్నాయంగా వీటిని ఉపయోగించవచ్చు. ప్రయోగశాలలో ఎలుకలపై చేసిన పరిశోధనల ఫలితాల ద్వారా ఇది నిరూపించారు. ‘ప్లాంట్స్’ జర్నల్‌లో ప్రచురించబడిన పరిశోధన నివేదిక ప్రకారం.. అడవి హిమాలయన్ అత్తి నొప్పి నివారిణిగా ఉపయోగపడుతుంది. రాబోయే కాలంలో ఇది చాలా ప్రభావవంతమైన పరిష్కారం అని తేలింది. అలాగే లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (ఎల్‌పియు) పరిశోధకుల నేతృత్వంలోని అంతర్జాతీయ బృందం వీటిపై పరిశోధన చేసింది. ఇందులో చర్మ వ్యాధుల చికిత్స, ఇన్‌ఫెక్షన్లకు చికిత్స, అనేక ఇతర వైద్య ప్రయోజనాలను కలిగి ఉందని తేలింది.

దీపావళికి IRCTC Air బంపర్‌ ఆఫర్.. విమాన టిక్కెట్లు బుక్ చేసుకోండి.. ప్రయోజనాలు పొందండి..

Diwali 2021: అచ్చం మన దేశంలోలానే.. ఆ విదేశాల్లోనూ అంబరాన్ని అంటేలా దీపావళి వేడుక సంబరాలు

T20 World Cup: ఈ తప్పులు చేస్తే ప్రపంచకప్‌పై టీమిండియా ఆశలు వదులుకోవాల్సిందే.! అవేంటంటే..