AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దీపావళికి IRCTC Air బంపర్‌ ఆఫర్.. విమాన టిక్కెట్లు బుక్ చేసుకోండి.. ప్రయోజనాలు పొందండి..

IRCTC Air: దీపావళి పండుగ సీజన్‌లో మీరు విమాన టిక్కెట్లను బుక్ చేసుకోవాలనుకుంటే మంచి విషయం. ఎందుకంటే IRCTC ఎయిర్ మీకు అనేక ఆఫర్లను అందిస్తుంది.

దీపావళికి IRCTC Air బంపర్‌ ఆఫర్.. విమాన టిక్కెట్లు బుక్ చేసుకోండి.. ప్రయోజనాలు పొందండి..
Flight Ticket
uppula Raju
|

Updated on: Oct 28, 2021 | 12:05 PM

Share

IRCTC Air: దీపావళి పండుగ సీజన్‌లో మీరు విమాన టిక్కెట్లను బుక్ చేసుకోవాలనుకుంటే మంచి విషయం. ఎందుకంటే IRCTC ఎయిర్ మీకు అనేక ఆఫర్లను అందిస్తుంది. కేవలం రూ.50లతో ఐఆర్‌సిటిసి ఎయిర్‌ టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం మీరు air.irctc.co.in సందర్శిస్తే సరిపోతుంది. IRCTC తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి టిక్కెట్‌లను ఎలా బుక్ చేసుకోవాలో ట్వీట్‌ చేసింది.

ఆ ట్వీట్‌లో “ఈ దీపావళికి మీ కుటుంబానికి అత్యుత్తమ బహుమతిని ఇవ్వండి. ఇంటికి వెళ్లడానికి, IRCTCAirలో విమాన టిక్కెట్లను బుక్ చేసుకోండి. ప్రతి బుకింగ్‌పై ప్రయోజనాలను పొందండి. అత్యల్ప సౌకర్యవంతమైన రుసుము రూ.50. LTC క్లెయిమ్‌లు మరిన్ని విషయాలకు http://air.irctc.co.inని సందర్శించండి లేదా యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి” అని సూచించింది.

మరో ట్వీట్‌లో “పండుగ సీజన్‌లో ప్రత్యేకంగా ఏదైనా చేయాల్సిన అవసరం ఉంది. IRCTC ఎయిర్‌లో విమాన టిక్కెట్‌లను బుక్ చేయండి. సులభమైన బుకింగ్ కేవలం రూ.50 మాత్రమే. ఉచిత బీమా, ఎల్‌టిసి ఛార్జీలు, ప్రత్యేక రక్షణ ఛార్జీలు వంటి ప్రయోజనాలను పొందండి” IRCTC ఎయిర్ అనేది దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలకు చౌకగా విమాన టిక్కెట్‌లను అందించే సర్టిఫైడ్ వెబ్‌సైట్.

ఈ ప్రయోజనాలను పొందండి >> కస్టమర్లు కనీస సౌకర్య రుసుము రూ.50తో టిక్కెట్లు బుక్ చేసుకోగలరు. >> ప్రయాణికులకు రూ. 50 లక్షల ఉచిత ప్రయాణ బీమా లభిస్తుంది. >> LTC టిక్కెట్ బుకింగ్ కోసం ప్రభుత్వ అధీకృత ఏజెన్సీ. >> IRCTC SBI కార్డ్ ప్రీమియర్‌తో బుకింగ్‌లపై 5% తిరిగి పొందండి.

IRCTC ద్వారా విమాన టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రక్రియ చాలా సులభం. అందుబాటులో ఉన్న అన్ని విమానాల జాబితా కనిపిస్తుంది. ప్రయాణికుల రాక, బయలుదేరే గమ్యస్థానం, ప్రయాణీకుల సంఖ్య, ప్రయాణ తరగతి, బయలుదేరే తేదీని నమోదు చేసి ఆపై ఇష్టపడే విమానాన్ని రిజర్వ్ చేయడానికి బుక్ నౌపై క్లిక్ చేస్తే సరిపోతుంది.

ఇలాంటి భార్యలు కూడా ఉంటారా బాబోయ్‌..! విషయం తెలిస్తే షాక్ అవుతారు..

Best Places in Vizag: వావ్ అనిపించే విశాఖ అందాలు.. శీతలంలో మరింత అద్భుతంగా.. వింటర్‌లో చలో వైజాగ్!

Katrina Kaif: త్వరలో ప్రియుడు విక్కీ కౌశల్‌ను పెళ్లి చేసుకోనున్న కత్రినా కైఫ్.. వివాహ వేడుక ఎప్పుడు? ఎక్కడంటే?