Best Places in Vizag: వావ్ అనిపించే విశాఖ అందాలు.. శీతలంలో మరింత అద్భుతంగా.. వింటర్‌లో చలో వైజాగ్!

విశాఖపట్నం అనగానే సముద్రం గుర్తొస్తుంది ఎవరికైనా. అయితే, వైజాగ్ లో సముద్రాన్ని మించిన అందాలు చాలా ఉన్నాయి. కొన్ని ఆ సముద్రం చుట్టూ ఉన్న అద్భుతాలు అయితే, మరికొన్ని విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్నవి. ఇక్కడ ప్రకృతి రమణీయతతో పాటూ ఆధ్యాత్మిక వీచికలనూ మనం ఆస్వాదించవచ్చు. వైజాగ్ దగ్గరలో చూడవలసిన ప్రదేశాలలో కొన్ని ఇవే!

KVD Varma

|

Updated on: Oct 28, 2021 | 11:20 AM

అందాల అరకు: 
గిరిజన ప్రాంతమైన అరకు విశాఖ ప్రాంతంలో అతి పెద్ద టూరిస్ట్ స్పాట్ అని చెప్పాలి. పచ్చని కొండల మధ్యలో ఉండే చల్లని లోయ ఇది. ఇక్కడ పద్మావతీ గార్డెన్స్, దగ్గరలోని చాపరాయి, బొర్రా గుహలు వంటి ప్రకృతి సిద్ధమైన ప్రదేశాలతో పాటు గిరిజన మ్యూజియం సందర్శకులను మైమరిచిపోయేలా చేస్తాయి.

అందాల అరకు: గిరిజన ప్రాంతమైన అరకు విశాఖ ప్రాంతంలో అతి పెద్ద టూరిస్ట్ స్పాట్ అని చెప్పాలి. పచ్చని కొండల మధ్యలో ఉండే చల్లని లోయ ఇది. ఇక్కడ పద్మావతీ గార్డెన్స్, దగ్గరలోని చాపరాయి, బొర్రా గుహలు వంటి ప్రకృతి సిద్ధమైన ప్రదేశాలతో పాటు గిరిజన మ్యూజియం సందర్శకులను మైమరిచిపోయేలా చేస్తాయి.

1 / 8
వణికించే లంబసింగి:
లంబసింగి విశాఖ మన్యంలో మరో అద్భుతమైన ప్రదేశం. ఇక్కడ నవంబర్ డిసెంబర్ నెలలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. అందుకే దీనిని ఆంధ్రా కాశ్మీర్ అని కూడా అంటారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ కొండపై నుంచి చలికాలంలో సూర్యోదయాన్ని చూడటం ఒక గొప్ప అనుభూతి ఇస్తుంది.

వణికించే లంబసింగి: లంబసింగి విశాఖ మన్యంలో మరో అద్భుతమైన ప్రదేశం. ఇక్కడ నవంబర్ డిసెంబర్ నెలలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. అందుకే దీనిని ఆంధ్రా కాశ్మీర్ అని కూడా అంటారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ కొండపై నుంచి చలికాలంలో సూర్యోదయాన్ని చూడటం ఒక గొప్ప అనుభూతి ఇస్తుంది.

2 / 8
ఆధ్యాత్మిక పరవశం..సింహాచలం: 
విశాఖకు దగ్గరలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం దర్శానానికి దేశం నలుమూలల నుంచీ భక్తులు వస్తుంటారు. ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయం ఇదే. ఇక్కడ లక్ష్మీనరసిమ్హస్వామిది ఉగ్ర రూపం. చందనంతో కప్పబడి నిత్యం దర్శనం ఇస్తారు. సంవత్సరంలో ఒక్కసారి  12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది.

ఆధ్యాత్మిక పరవశం..సింహాచలం: విశాఖకు దగ్గరలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం దర్శానానికి దేశం నలుమూలల నుంచీ భక్తులు వస్తుంటారు. ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయం ఇదే. ఇక్కడ లక్ష్మీనరసిమ్హస్వామిది ఉగ్ర రూపం. చందనంతో కప్పబడి నిత్యం దర్శనం ఇస్తారు. సంవత్సరంలో ఒక్కసారి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది.

3 / 8
భీమిలి ఎర్రమట్టి దిబ్బలు:
ఎర్ర మట్టి దిబ్బలు విశాఖపట్నం శివార్లలోని భీమిలిలో ఉన్నాయి. ఈ భౌగోళిక వారసత్వ ప్రదేశం 12,000 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నాటిది. విశాఖపట్నం మరియు బీమునిపట్నం తీరాల మధ్య విస్తరించి ఉన్న ఈ 10 కి.మీ ప్రకృతి ప్రసాదించిన అద్భుత వరం. దశాబ్దాల క్రితమే ఎర్ర మట్టి దిబ్బలు విశిష్టతను విలియం కింగ్ అనే భూగర్భ శాస్త్రవేత్త వీటిని కనుగొన్నారు. వైజాగ్‌కు సమీపంలో ఉన్న అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఇది ఒకటి.

భీమిలి ఎర్రమట్టి దిబ్బలు: ఎర్ర మట్టి దిబ్బలు విశాఖపట్నం శివార్లలోని భీమిలిలో ఉన్నాయి. ఈ భౌగోళిక వారసత్వ ప్రదేశం 12,000 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నాటిది. విశాఖపట్నం మరియు బీమునిపట్నం తీరాల మధ్య విస్తరించి ఉన్న ఈ 10 కి.మీ ప్రకృతి ప్రసాదించిన అద్భుత వరం. దశాబ్దాల క్రితమే ఎర్ర మట్టి దిబ్బలు విశిష్టతను విలియం కింగ్ అనే భూగర్భ శాస్త్రవేత్త వీటిని కనుగొన్నారు. వైజాగ్‌కు సమీపంలో ఉన్న అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఇది ఒకటి.

4 / 8
ఐఎన్ఎస్ కురుసుర సబ్‌మెరైన్ మ్యూజియం:
మీరు ఆ మధ్య వచ్చిన ఘాజీ సినిమా చూశారా? ఆ సినిమాలో చెప్పిన కథ ఈ కురుసురా కథే! క్లిష్టమైన పరిస్థితుల్లో పాక్ జలాంతర్గామిని ముంచేసి భారత్ కు రాబోతున్న ముప్పు తప్పించిన సబ్ మెరైన్ కురుసురు. కురుసుర కు రిటైర్మెంట్ ఇచ్చేశాకా.. దానిని విశాఖ బీచ్ వద్ద నిలిపారు. దీనిని ఇప్పుడు సబ్ మెరైన్ మ్యూజియంగా మార్చారు. ఇక్కడ జలాంతర్గాముల గురించిన అన్ని విషయాలు చక్కగా తెలుసుకోవచ్చు. విశాఖ వచ్చిన పర్యాటకులు తప్పనిసరిగా చూసి తెలుసుకోవలసిన విశేషాలెన్నో ఇక్కడ ఉన్నాయి.

ఐఎన్ఎస్ కురుసుర సబ్‌మెరైన్ మ్యూజియం: మీరు ఆ మధ్య వచ్చిన ఘాజీ సినిమా చూశారా? ఆ సినిమాలో చెప్పిన కథ ఈ కురుసురా కథే! క్లిష్టమైన పరిస్థితుల్లో పాక్ జలాంతర్గామిని ముంచేసి భారత్ కు రాబోతున్న ముప్పు తప్పించిన సబ్ మెరైన్ కురుసురు. కురుసుర కు రిటైర్మెంట్ ఇచ్చేశాకా.. దానిని విశాఖ బీచ్ వద్ద నిలిపారు. దీనిని ఇప్పుడు సబ్ మెరైన్ మ్యూజియంగా మార్చారు. ఇక్కడ జలాంతర్గాముల గురించిన అన్ని విషయాలు చక్కగా తెలుసుకోవచ్చు. విశాఖ వచ్చిన పర్యాటకులు తప్పనిసరిగా చూసి తెలుసుకోవలసిన విశేషాలెన్నో ఇక్కడ ఉన్నాయి.

5 / 8
అందమైన డాల్ఫిన్ నోస్:
విశాఖపట్నం సహజ రేవు పట్టణంగా ఉండటానికి కారణం ఈ డాల్ఫిన్ నోస్ కొండ. ఈ కొండ అచ్చు డాల్ఫిన్ ముక్కులా ఉంటుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. డాల్ఫిన్ నోస్ కొండ అందాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి.

అందమైన డాల్ఫిన్ నోస్: విశాఖపట్నం సహజ రేవు పట్టణంగా ఉండటానికి కారణం ఈ డాల్ఫిన్ నోస్ కొండ. ఈ కొండ అచ్చు డాల్ఫిన్ ముక్కులా ఉంటుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. డాల్ఫిన్ నోస్ కొండ అందాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి.

6 / 8
సహజ సుందరం..రిషికొండ బీచ్:
సహజంగా వైజాగ్ అనగానే మనకు గుర్తొచ్చే బీచ్ ఆర్కే బీచ్. అయితే, అంతకంటే అందమైన బీచ్ మరోటి ఉంది. అదే రిషికొండ బీచ్. ఒక పక్క కొండ. కొండ అంచునే ఉండే సముద్రం. వంపు తిరిగిన బీచ్. చూడగానే భలే ముచ్చటగా అనిపిస్తుంది. ఈ బీచ్ లో ఎంతసేపు ఉన్నా సమయం తెలీదు అంటే అతిశయోక్తి కాదు.

సహజ సుందరం..రిషికొండ బీచ్: సహజంగా వైజాగ్ అనగానే మనకు గుర్తొచ్చే బీచ్ ఆర్కే బీచ్. అయితే, అంతకంటే అందమైన బీచ్ మరోటి ఉంది. అదే రిషికొండ బీచ్. ఒక పక్క కొండ. కొండ అంచునే ఉండే సముద్రం. వంపు తిరిగిన బీచ్. చూడగానే భలే ముచ్చటగా అనిపిస్తుంది. ఈ బీచ్ లో ఎంతసేపు ఉన్నా సమయం తెలీదు అంటే అతిశయోక్తి కాదు.

7 / 8
అందమైన ప్రదేశం.. అంతకంటే ఆహ్లాదకరమైన వాతావరణం
ఇక్కడ చెప్పినవి విశాఖ అందాలలో కొన్ని మాత్రమే. ఇంకా ఇక్కడ ప్రకృతితో పెనవేసుకుపోయిన కటికి వాటర్ ఫాల్స్ వంటి ప్రాంతాలు.. చారిత్రాత్మకమైన అల్లూరి సీతారామరాజు నడయాడిన ప్రదేశాలు.. భీమిలి, రేవుపోలవరం బీచ్ లు చాలా ఉన్నాయి. విశాఖ వెళితే అన్నిటినీ తప్పక చూడండి. ఇవన్నీ విశాఖపట్నం బస్టాండ్ సెంటర్ గా తీసుకుంటే 100-150 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి.

అందమైన ప్రదేశం.. అంతకంటే ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ చెప్పినవి విశాఖ అందాలలో కొన్ని మాత్రమే. ఇంకా ఇక్కడ ప్రకృతితో పెనవేసుకుపోయిన కటికి వాటర్ ఫాల్స్ వంటి ప్రాంతాలు.. చారిత్రాత్మకమైన అల్లూరి సీతారామరాజు నడయాడిన ప్రదేశాలు.. భీమిలి, రేవుపోలవరం బీచ్ లు చాలా ఉన్నాయి. విశాఖ వెళితే అన్నిటినీ తప్పక చూడండి. ఇవన్నీ విశాఖపట్నం బస్టాండ్ సెంటర్ గా తీసుకుంటే 100-150 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి.

8 / 8
Follow us
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!