November: నవంబర్‌లో ఈ 4 ప్రదేశాలు చూస్తే మైమరచిపోతారు.. ఏంటో తెలుసుకోండి..
November: ఈ సంవత్సరం నవంబర్‌లో చాలా సెలవులు వస్తున్నాయి. ఎక్కడికైనా వెళ్లాలంటే వాతావరణం చాలా బాగుంటుంది. ఎందుకంటే నవంబర్‌లో చలి ఎక్కువగా ఉండదు
November: ఈ సంవత్సరం నవంబర్‌లో చాలా సెలవులు వస్తున్నాయి. ఎక్కడికైనా వెళ్లాలంటే వాతావరణం చాలా బాగుంటుంది. ఎందుకంటే నవంబర్‌లో చలి ఎక్కువగా ఉండదు అలాగే వేడి ఎక్కువగా ఉండదు. అందుకే పర్యాటకులకు ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ నవంబర్‌లో మీరు పర్యటించాలనుకుంటే ఈ ప్రదేశాలు చాలా అందంగా ఉంటాయి. అంతేకాదు ఖర్చు కూడా తక్కువే. వాటి గురించి ఒక్కసారి తెలుసుకుందాం.
1. లోయల్లో తిరగాలనుకుంటున్నారా.. మీరు లోయల్లో సంచరించాలనుకుంటే హిమాచల్ లేదా ఉత్తరాఖండ్‌లోని ఏదైనా స్థలాన్ని ఎంచుకోవచ్చు. హిమాచల్ ప్రదేశ్ మీకు దగ్గరగా ఉన్నట్లయితే సిమ్లా వంటి అనేక ప్రదేశాలలో పర్యటించవచ్చు. అంతేకాదు నరకంద పైన కూడా తిరగవచ్చు. ఇది కాకుండా ఉత్తరాఖండ్‌లో కూడా మీ కోసం చాలా పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.
2. హిమపాతానికి సరైన సమయం ఇటీవల కేదార్‌నాథ్, బద్రీనాథ్ పరిసర ప్రాంతాల్లో మంచు కురుస్తుంది. మీరు ఒక్కసారి హిమపాతం చూడాలనుకుంటే, మంచు కొండల మధ్య సంచరించాలనుకుంటే నవంబర్ నెల మీకు ఉత్తమమైనది.
3. రాజస్థాన్ సందర్శించడానికి ఉత్తమ సీజన్ రాజస్థాన్‌లో సంచరించడానికి చాలామంది భయపడుతారు. ఎందుకంటే అక్కడ ఎక్కువగా వేడి ఉంటుందని అంటారు కానీ నవంబర్ నెలలో అక్కడి వాతావరణం చల్లగా ఉంటుంది. ఈ సమయంలో మీరు జైసల్మేర్ నుంచి ఉదయపూర్, జోధ్పూర్ మొదలైన ప్రాంతాలలో తిరగవచ్చు.
4. అడవుల సందర్శన మీరు సాహస యాత్రకు వెళ్లాలనుకుంటే మధ్యప్రదేశ్ అడవులకు లేదా మరేదైనా అభయారణ్యానికి వెళ్లవచ్చు. దీనితో పాటు పర్వతాలపై ట్రెక్కింగ్ కూడా చేయవచ్చు. ఎందుకంటే వాతావరణం కారణంగా ఈ సమయం సరైనదిగా పరిగణిస్తారు.