AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చాణక్యనీతి: ఈ దీపావళికి లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే చాణక్య చెప్పే ఈ 4 విషయాలు తెలుసుకోండి..

చాణక్యనీతి: ఆచార్య చాణక్య నీతి శాస్త్రం అనే గ్రంథంలో కాలానికి సంబంధించిన అనేక విషయాలను రాశారు. ఇది అతడి దూరదృష్టిని రుజువు చేస్తుంది. ఆచార్య చాణక్య గొప్ప పండితుడు,

చాణక్యనీతి: ఈ దీపావళికి లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే చాణక్య చెప్పే ఈ 4 విషయాలు తెలుసుకోండి..
Acharya Chanakya
uppula Raju
|

Updated on: Oct 28, 2021 | 9:15 AM

Share

చాణక్యనీతి: ఆచార్య చాణక్య నీతి శాస్త్రం అనే గ్రంథంలో కాలానికి సంబంధించిన అనేక విషయాలను రాశారు. ఇది అతడి దూరదృష్టిని రుజువు చేస్తుంది. ఆచార్య చాణక్య గొప్ప పండితుడు, నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయుడు, ఆర్థికవేత్త, సామాజికవేత్త, రాజకీయవేత్త. మొత్తం నంద వంశాన్ని సర్వనాశనం చేసి ఒక సాధారణ పిల్లవాడిని చక్రవర్తిగా చేసిన గొప్ప మేధావి. అతను జీవితాంతం మౌర్య రాజవంశం వ్యవస్థాపకుడిగా, పోషకుడిగా కొనసాగారు. ఆచార్య తన నీతి శాస్త్రం అనే పుస్తకంలో అనేక విషయాలను ప్రస్తావించారు. నేటి కాలంలో అన్ని సమస్యలకు ఇందులో పరిష్కారం లభిస్తుంది. అలాగే వీటన్నింటి మధ్యలో ఇంటి దారిద్ర్యాన్ని పోగొట్టి లక్ష్మీదేవి అనుగ్రహం సాధించే మార్గాల గురించి కూడా ప్రస్తావించారు. దీపావళి పండుగ దగ్గర పడింది. అటువంటి పరిస్థితిలో ఆచార్య లక్ష్మి దేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో చెప్పారు. వాటి గురించి తెలుసుకుందాం.

1. ఇబ్బందులు సృష్టించవద్దు ఆచార్య చాణక్యుడు ఇంట్లో కష్టాలు ఉంటే లక్ష్మిదేవి అక్కడ ఉండదని చెబుతారు. అలాంటి ఇళ్లలో డబ్బు సమస్యలు నిత్యం ఉంటాయని అన్నారు. మహాలక్ష్మీ ఇంట్లో శాశ్వతంగా ఉండాలని మీరు కోరుకుంటే ఇంట్లో ఎప్పుడు ఇబ్బందులు సృష్టించవద్దు. శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలి.

2. ఆరాధన ఉదయం, సాయంత్రం పూజలు చేయాలని శాస్త్రాలలో చెప్పారు. అయితే ఆచార్య చాణక్య దీనిని విశ్వసించారు. పూజ చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల వాతావరణం ఉంటుందని నమ్మారు. అంతేకాదు లక్ష్మిదేవి అనుగ్రహం సంపాదించాలంటే ఉదయం, సాయంత్రం ఇంట్లో దేవుడి ముందు దీపం వెలిగించాలన్నారు.

3. పెద్దలను గౌరవించాలి పెద్దలు అసంతృప్తిగా ఉన్న కుటుంబంలో లక్ష్మిదేవి ఎప్పుడూ నిలువదు. మీరు లక్ష్మీ దేవి అనుగ్రహలుగా మారాలంటే కచ్చితంగా ఇంటి పెద్దలకు సేవ చేయాలని ఆచార్య చెప్పారు. పెద్దలను గౌరవించని ఇళ్లలో తల్లి లక్ష్మి ఉండదని, ఆ ఇంట్లో పేదరికం తాండవం చేస్తుందని చెప్పారు.

4. శుభ్రత పట్ల శ్రద్ధ ఆచార్య చాణక్యుడి ప్రకారం.. మురికిగా ఉండే వ్యక్తులు, మురికి దుస్తులు ధరించేవారు ఇంట్లో మురికినే ఉంచుతారు. అలాంటి ఇళ్లకి లక్ష్మీదేవి ఎప్పుడు రాదు. తల్లి నిత్యం పరిశుభ్రత పాటించే ప్రదేశానికి వెళుతుందని వివరించారు.

T20 World Cup 2021: టోర్నమెంట్ నుంచి నిష్క్రమించే ప్రమాదంలో టీమ్ ఇండియా..! ఈ 4 కారణాల వల్లే..?

Inspirational Video: ఈ చిన్నారికి కాళ్లు లేకపోయినా అందరి కళ్లను తన వైపు తిప్పుకుంటోంది..

Asaduddin Owaisi: పాక్ మంత్రి రషీద్ ఓ పిచ్చివాడు.. మా పెద్దలు పాకిస్థాన్ వెళ్లనందుకు మేము అదృష్టవంతులం అంటున్న ఒవైసీ