AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇలాంటి భార్యలు కూడా ఉంటారా బాబోయ్‌..! విషయం తెలిస్తే షాక్ అవుతారు..

Wife Fakes Kidnapping: ఆధునిక ప్రపంచంలో కొంతమంది డబ్బుల కోసం ఎంత నీచానికైనా దిగజారుతున్నారు. సొంత మనుషులనే మోసం చేస్తున్నారు. డబ్బుంటే ఏదైనా సాధించవచ్చని

ఇలాంటి భార్యలు కూడా ఉంటారా బాబోయ్‌..! విషయం తెలిస్తే షాక్ అవుతారు..
Wife Fakes
uppula Raju
|

Updated on: Oct 28, 2021 | 11:15 AM

Share

Wife Fakes Kidnapping: ఆధునిక ప్రపంచంలో కొంతమంది డబ్బుల కోసం ఎంత నీచానికైనా దిగజారుతున్నారు. సొంత మనుషులనే మోసం చేస్తున్నారు. డబ్బుంటే ఏదైనా సాధించవచ్చని అనుకొని ఒంటరిగా మిగిలిపోతున్నారు. అంతేకాదు డబ్బుల కోసం సొంతవారినే వదులుకుంటున్నారు. తాజాగా స్పెయిన్‌లో ఓ మహళ డబ్బుల కోసం సొంత భర్తనే మోసం చేసింది. అందుకోసం చాలా డ్రామా ఆడింది. ఈ విషయం తెలిసి అందరు ఆశ్చర్యపోతున్నారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

ఒక నివేదిక ప్రకారం.. ఈ సంఘటన స్పెయిన్‌లో జరిగింది. ఈ డ్రామా సృష్టించిన మహిళ జూదానికి బానిసైంది. అయితే మరోవైపు ఆమె భర్త అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సమయంలోనే ఆమె తనను కొంతమంది కిడ్నాప్ చేశారని వదిలేయాలంటే దాదాపు రూ.5 లక్షలు అడుగుతున్నారని భర్తకు ఫోన్‌ చేసి బాధపడుతూ చెప్పింది. ఆ తర్వాత ఆస్పత్రిలో ఉన్న భర్త ఆమె కోరిన మొత్తాన్ని భార్యకు పంపించాడు. ఆ డబ్బును ఆ మహిళ భర్త ఒకరికిచ్చి పంపించాడు. అయితే ఈ విషయం గురించి పోలీసుల‌కి కూడా ఫిర్యాదు చేశాడు.

భార్య మొబైల్ నంబ‌ర్ కూడా ఇచ్చాడు. పోలీసులు సదరు మహిళ ఒక షాపింగ్‌ మాల్‌లోకి ప్రవేశిస్తుండగా ఆమెను చూశారు. అనుమానం వచ్చి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. విచారించగా అసలు విషయాలు వెల్లడించింది. తాను డబ్బుల కోసమే ఇలా చేశానని చెప్పింది. దీంతో పోలీసులు జరిగిన విషయాన్ని ఆ మహిళ భర్తకు తెలియజేశారు. ప్రస్తుతం ఆ మహిళ బెయిల్‌పై విడుదలైనప్పటికీ కేసు విచారణ కొనసాగుతోంది. అయితే ఈమె కొంతమందితో కలిసి డబ్బుల కోసం కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు.

Protein Foods: ఈ 5 ఆహారాలలో ప్రొటీన్లు పుష్కలం..! ఏంటో తెలుసుకోండి..

November: నవంబర్‌లో ఈ 4 ప్రదేశాలు చూస్తే మైమరచిపోతారు.. ఏంటో తెలుసుకోండి..

Aloevera Sharbat: పరగడుపున అలోవెరా షర్బత్‌.. బరువు తగ్గడానికి చక్కటి పరిష్కారం..