Apple Peel: ఆపిల్‌ను తొక్క తీసి తింటున్నారా..? అలా చేస్తే ఏం జరుగుతుందో తెలిస్తే..

ఇది ఆకలిని తగ్గిస్తుంది. దీంతో బరువు తగ్గడానికి కూడా దోహదం చేస్తుంది. యాపిల్ పీల్స్‌లో చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడే పోషకాలు ఉంటాయి. యాపిల్ తొక్కలో క్వెరెక్టిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. ఇది ఊపిరితిత్తులను, గుండెను అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది.

Apple Peel: ఆపిల్‌ను తొక్క తీసి తింటున్నారా..? అలా చేస్తే ఏం జరుగుతుందో తెలిస్తే..
Apple Peel
Follow us

|

Updated on: Aug 16, 2024 | 9:44 PM

యాపిల్ పోషకాలు అధికంగా ఉండే పండు. యాపిల్ పండును ఎప్పుడూ తొక్కతో తినాలంటారు. ఎందుకంటే యాపిల్ తొక్కలో యాపిల్ కంటే ఎక్కువ గుణాలు ఉన్నాయంటున్నారు పోషకాహర నిపుణులు. కానీ, కొందరు యాపిల్‌ను తొక్క ఒలిచి పారేస్తుంటారు. ఇలా చేయటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను మిస్ చేసుకున్నట్టే అని సూచిస్తున్నారు. యాపిల్ తొక్కలను తినక పోవడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో కూడా తెలుసుకోండి.

యాపిల్ తొక్కలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. యాపిల్ పీల్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. యాపిల్‌ పండ్లను తొక్కతో తింటే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. దీనిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను సవ్యంగా చేయడానికి ఉపయోగపడుతుంది. యాపిల్ తొక్కతో తింటే అందులో ఉండే ఫైబర్ డయాబెటిస్ రోగులకు ఎంతో మేలు చేస్తుంది. యాపిల్‌ తొక్కలో ఉండే పాలీఫెనాల్స్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంతో పాటు రక్తపోటును తగ్గిస్తాయి. దీనివల్ల గుండెలోని సిరలు మృదువుగా ఉండి వాటిలో ఎలాంటి అడ్డంకులు ఉండవు. దీనివల్ల గుండె జబ్బులు దరిచేరవు.

యాపిల్ తొక్కలో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె ఉంటాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే పోషకాలు కూడా ఇందులో ఉన్నాయి. యాపిల్ తొక్కలోని ఫైబర్ గంటల తరబడి కడుపు నిండుగా ఉంచుతుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. దీంతో బరువు తగ్గడానికి కూడా దోహదం చేస్తుంది. యాపిల్ పీల్స్‌లో చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడే పోషకాలు ఉంటాయి. యాపిల్ తొక్కలో క్వెరెక్టిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. ఇది ఊపిరితిత్తులను, గుండెను అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి