Parenting Tips: పిల్లల వయసు పెరిగినా.. ఎత్తు పెరగడం లేదా..? అయితే ఇదిగో మీ సమస్యకు పరిష్కారం..!

తమ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని అందరి తల్లిదండ్రులు కోరుకుంటారు. ఇంకా వారు పొడవుగా, దృడమైన శరీరాన్ని కలిగి ఉండాలని కూడా అనుకుంటారు. ఈ క్రమంలోనే తమ పిల్లలతో వ్యాయామాలు చేపించడం, వివిధ రకాల..

Parenting Tips: పిల్లల వయసు పెరిగినా.. ఎత్తు పెరగడం లేదా..? అయితే ఇదిగో మీ సమస్యకు పరిష్కారం..!
Foods For Kids Height Growth
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 25, 2023 | 4:33 PM

తమ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని అందరి తల్లిదండ్రులు కోరుకుంటారు. ఇంకా వారు పొడవుగా, దృడమైన శరీరాన్ని కలిగి ఉండాలని కూడా అనుకుంటారు. ఈ క్రమంలోనే తమ పిల్లలతో వ్యాయామాలు చేపించడం, వివిధ రకాల ఆహారాలను తినిపించడం వంటివి చేస్తుంటారు. కానీ ఎక్కువ సందర్భాలలో ఇవి వారిపై ప్రభావం చూపించవు. తల్లిదండ్రులు పొడవుగా ఉన్నా పిల్లలు పొట్టిగా ఉంటారు. అందువల్ల చాలామంది తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. అయితే  పిల్లలు తినే ఆహారంలో పోషకాలు సరిపడా లేకపోవడమే ఇందుకు కారణమని ఆరోగ్య నిపుణులు, పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వారి ప్రకారం పిల్లలు ఎత్తు పెరగాలంటే వారిలో శారీరక శ్రమ, చురుకు దనం ఉండటం చాలా ముఖ్యం. నేడు పిల్లల్లో శారీరక శ్రమ తక్కువగా ఉండడంతో పిల్లలు తగిన ఎత్తు ఎదగలేకపోతున్నారు. పిల్లలు హైట్ పెరగాలనుకుంటే వ్యాయామంతో పాటు కొన్ని రకాల ఆహారాలను కూడా తీసుకోవాలి.  మరి పిల్లలు ఏయే ఆహారాలను తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  1. తృణధాన్యాలు: పిల్లలు ఆహారంలో తృణధాన్యాలు చేర్చడం చాలా ముఖ్యం. తృణధాన్యాలలో విటమిన్-బి, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఎముకలు, చర్మం, కండరాలకు ఈ రెండూ చాలా అవసరం. అదేవిధంగా పిల్లల ఆహారంలో తృణధాన్యాలు చేర్చడం వల్ల పిల్లల ఎత్తు పెరగడమే కాకుండా కండరాలు బలపడతాయి.
  2. పాలు: ఎముకల దృఢత్వానికి కాల్షియం అత్యంత ముఖ్యమైనది. పాలు కాల్షియం ఉత్తమ వనరుగా పరిగణిస్తారు. ఇందుకోసం పిల్లలకు ప్రతిరోజూ కనీసం ఒకటి, గరిష్టంగా మూడు గ్లాసుల పాలు ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల మీ పిల్లల ఎత్తు పెరగడంతోపాటు ఎముకలు కూడా దృఢంగా మారుతాయి.
  3. చేపలు: చేపలలో ప్రోటీన్ నిల్వ ఉంది. మీరు పిల్లలకు క్రమం తప్పకుండా చేపలను తినిపిస్తూ ఉంటే, అప్పుడు పిల్లల ఎత్తు ఖచ్చితంగా పెరుగుతుంది.
  4. సోయాబీన్: సోయాబీన్‌లో అత్యధిక ప్రొటీన్ ఉంటుంది. ఇది పిల్లల శరీర అభివృద్ధికి సహాయపడుతుంది. పిల్లల ఎత్తును పెంచడంతో పాటు, పిల్లల ఎముకలు, కండరాల బలంపై కూడా శ్రద్ధ చూపడం అవసరం. కాబట్టి పిల్లల ఆహారంలో సోయాబీన్‌ను చేర్చండి.
  5. ఇవి కూడా చదవండి
  6. ఉసిరి: పిల్లల ఎత్తును పెంచడంలో ఉసిరికాయ బాగా ఉపయోగపడుతుంది. మన శరీరంలో హార్మోన్లను సమతుల్యంగా ఉంచడంతో పాటు, మనసును కూడా ప్రశాంతగా ఉంచుతుంది.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..