Lifestyle: నిత్యం కడుపు ఉబ్బరంగా ఉంటుందా.? ఇదే కారణం..

కడుపు ఉబ్బరం తీసుకునే ఆహారం కారణంగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వేయించిన ఆహారాన్ని తీసుకోవడం, జీర్ణక్రియ సమస్యలతో పాటు కొన్ని రకాల ఆరోగ్య సంబంధిత సమస్యల వల్ల కడుపుబ్బరం వేధిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఒత్తిడితో ఇబ్బందిపడుతోన్న వారిలోనూ ఇలాంటి సమస్యలు వస్తాయి...

Lifestyle: నిత్యం కడుపు ఉబ్బరంగా ఉంటుందా.? ఇదే కారణం..
Stomach Bloating
Follow us

|

Updated on: Apr 25, 2024 | 12:12 PM

కడుప్పు ఉబ్బరం సర్వసాధారణమైన సమస్య. మనలో చాలా మంది ఏదో ఒక సమయంలో ఈ సమస్యను ఎదుర్కొనే ఉంటాం. మరీ ముఖ్యంగా వేసవిలో కడుపు ఉబ్బరం సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. అయితే ఈ సమస్య రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ప్రధానమైంది తీసుకునే ఆహారమే అని చెప్పాలి. ఆహారంలో కొన్ని మార్పుల కారణంగా కడుపు ఉబ్బరంగా మారుతుంది. ఇంతకీ కడుపు ఉబ్బరం సమస్య ఎందుకు వస్తుంది.? ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం..

కడుపు ఉబ్బరం తీసుకునే ఆహారం కారణంగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వేయించిన ఆహారాన్ని తీసుకోవడం, జీర్ణక్రియ సమస్యలతో పాటు కొన్ని రకాల ఆరోగ్య సంబంధిత సమస్యల వల్ల కడుపుబ్బరం వేధిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఒత్తిడితో ఇబ్బందిపడుతోన్న వారిలోనూ ఇలాంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే శారీరకంగా చురుకుగా ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం వాకింగ్‌ను అలవాటుగా మార్చుకోవాలని చెబుతున్నారు.

వీటివల్ల జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. అలాగే యోగాసానల వల్ల కూడా కడుపులో గ్యాస్‌ సమస్యలు దరిచేరకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మలబద్ధకం సమస్య ఉన్న వారు కూడా కడుపుబ్బరం సమస్యతో బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి వారు తీసుకునే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉండే ఫుడ్‌ను తీసుకోవాలి.

ఆహారంలో పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫైబర్‌ ఎక్కువగా లభించే అరటి పండు, యాపిల్‌, ఆరెంజ్‌ వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇక కడుపు సంబంధిత సమస్యల నుంచి బయటపడాలంటే సోడియం ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి. ఉప్పుడు ఎక్కువగా తీసుకోవడం కడుపుఉబ్బరంతో పాటు, అధిక రక్తపోటు సమస్య కూడా వస్తుందని చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..