Periods Care: పీరియడ్స్‌లో బ్రెస్ట్ పెయిన్ వస్తుందా.. ఎందుకో తెలుసుకోండి..

పీరియడ్స్‌లో వచ్చే సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నెలసరిలో ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కొంత మందికి నెలసరిలో బ్రెస్ట్ పెయిన్ కూడా వస్తూ ఉంటాయి. అందుకు కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

Periods Care: పీరియడ్స్‌లో బ్రెస్ట్ పెయిన్ వస్తుందా.. ఎందుకో తెలుసుకోండి..
Periods Care
Follow us
Chinni Enni

|

Updated on: Nov 28, 2024 | 5:19 PM

పీరియడ్స్ అనేది మహిళలకు వచ్చే సాధారణ సమస్య. పీరియడ్స్‌ వచ్చినప్పుడు మహిళల్లో అనేక మార్పులు కనిపిస్తాయి, ఎన్నో హార్మోన్లు చేంజ్ అవడం వల్ల మహిళల్లో పలు రకాల మూడ్ స్వింగ్స్ ఉంటాయి. కొంత మంది అరుస్తూ, చిరాకు పడుతూ ఉంటారు. మరికొంత మందికి చాలా అలసటగా నీరసంగా ఉంటుంది. ఏ పనీ చేయలేరు. ఇలా అనేక రకాల మార్పులు కనిపిస్తాయి. నెలసరిలో వచ్చే మార్పులు కామన్‌గా అనుకుంటారు. కానీ ఎలాంటి మార్పులు వచ్చినా వైద్యుల్ని సంప్రదించడం మేలు. చాలా మందిలో తీవ్రంగా కడుపులో నొప్పి, నడుము నొప్పవి వేధిస్తుంది. ఇంకొంత మందికి తీవ్రంగా రక్త స్రావం అవుతుంది. అలాగే కొందరిలో రొమ్ములు కూడా నొప్పిగా ఉంటాయి. ఎంతో మందికి ఇలా అనిపించినా.. పెద్దగా గమనించారు. నొప్పి తీవ్రంగా ఉంటే మాత్రం వైద్యుల సలహా తప్పని సరి. మరి ఈ పీరియడ్స్‌లో రొమ్ములు నొప్పులు వస్తే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

ఎందుకు వస్తుంది?

బ్రెస్ట్‌లో పెయిన్ రావడం అనేది నెలసరిలో వచ్చే సాధారణ లక్షణం. ఇది హార్మోన్ల మార్పుల వలన వస్తుంది. రొమ్ములు బరువుగా అనిపించడం, నొప్పులు రావడం ఉంటాయి. ఇది ఎక్కువ మందిలో కనిపించే లక్షణం. రుతుక్రమం ఆగిపోయినప్పుడు నొప్పులు కూడా కంట్రోల్ అవుతాయి. పీరియడ్స్‌లో ఈస్ట్రోజెన్, ప్రాసెస్టరాన్ హార్మోన్లు కొందరిలో తగ్గుతాయి. దీని కారణంగా బ్రెస్ట్ పెయిన్స్ వస్తాయి.

ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి?

కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల కూడా రొమ్ములు తీవ్రంగా నొప్పులు వస్తాయి. కాబట్టి రొమ్ములు నొప్పిని కలిగించే ఆహారాలు తినడం మానేయండి. ఆల్కహాల్, ఉప్పు ఎక్కువగా ఉండే పదార్థాలు తినకూడదు. కొవ్వు అధికంగా లభించే ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి. అవకాడో, అరటి పండ్లు, పాలకూర, బ్రైన్ రైస్, వేరు శనగ, క్యారెట్లు వంటి ఆహారాలను తీసుకోండి. విటమిన్ ఈ ఎక్కువగా ఉండే ఆహారాలు తింటే రొమ్ములు నొప్పులు రావు.

ఇవి కూడా చదవండి

అదే విధంగా ఈ నొప్పులు అనేవి తీవ్రంగా ఉంటే మాత్రం వైద్యుల్ని సంప్రదించడం మంచిది. కేవలం పీరియడ్స్‌లో వచ్చే నొప్పి అని తేలికగా తీసుకోకూడదు. కాబట్టి జాగ్రత్తలు అవసరం. రొమ్ముల్లో నొప్పులు ఎక్కువగా ఉంటే వైద్యుల్ని సలహా తీసుకోవాలి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

ఇషా అంబానీ బంగ్లాను కొన్న హాలీవుడ్ స్టార్ కపుల్.. ఎన్ని కోట్లంటే?
ఇషా అంబానీ బంగ్లాను కొన్న హాలీవుడ్ స్టార్ కపుల్.. ఎన్ని కోట్లంటే?
ఈ సీఎం సాబ్ గారి భార్య బాలీవుడ్‌లో స్టార్ సింగర్ అని తెలుసా?
ఈ సీఎం సాబ్ గారి భార్య బాలీవుడ్‌లో స్టార్ సింగర్ అని తెలుసా?
రైఫిల్ గురిపెట్టిన సీఎం రేవంత్.. టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు!
రైఫిల్ గురిపెట్టిన సీఎం రేవంత్.. టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు!
సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే..
సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే..
ఆధార్ కార్డులో సాహా బ్యూటీ శ్రద్ధా కపూర్ ఎలా ఉందో చూశారా? వీడియో
ఆధార్ కార్డులో సాహా బ్యూటీ శ్రద్ధా కపూర్ ఎలా ఉందో చూశారా? వీడియో
రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా: అల్లు అర్జున్
రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా: అల్లు అర్జున్
‘భారతీయ వాయుయాన్‌ విధేయక్‌’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..
‘భారతీయ వాయుయాన్‌ విధేయక్‌’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..
అయ్యో చిట్టి తల్లి!.. పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న తల.. 
అయ్యో చిట్టి తల్లి!.. పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న తల.. 
అతడి యాక్టింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..
అతడి యాక్టింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..
చలికాలంలో పిల్లలకు అరటిపండు ఇవ్వడం సరైనదా.. కాదా?
చలికాలంలో పిల్లలకు అరటిపండు ఇవ్వడం సరైనదా.. కాదా?