Tirumala: తిరుమలలో అక్రమార్కులకు చెక్ పెట్టేందుకు రంగం సిద్ధం.. త్వరలో అన్నిసేవలకు ఆధారే ఆధారం..

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని పాపాలను పోగొట్టుకునిసద్గతి పొందాలని భక్తులు భావిస్తారు. అందుకనే తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు దేశ విదేశాల నుంచి కూడా స్వామివారి దర్శనం కోసం తిరుమలకు విచ్చేస్తారు. అటువంటి పవిత్ర పుణ్య క్షేత్రం కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో అవినీతి పనులు జరుగుతున్నాయని ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం అవుతూనే ఉంది. అక్రమార్కులకు చెక్ పెట్టేందుకు టీటీడీ సిద్ధమైంది.

Tirumala: తిరుమలలో అక్రమార్కులకు చెక్ పెట్టేందుకు రంగం సిద్ధం.. త్వరలో అన్నిసేవలకు ఆధారే ఆధారం..
Tirumala Rush
Follow us
Surya Kala

|

Updated on: Nov 28, 2024 | 1:28 PM

తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. దీంతో ముదస్తుగా టికెట్లు బుక్ చేసుకున్న వారు కూడా దర్శనం కోసం, గదుల కోసం ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంటుంది. అటువంటిది.. స్వామివారి దర్శనం కోసం ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండా తిరుమలకు చేరుకునే భక్తుల పాట్లు చెప్పనలవి కాదు.. దీంతో కొంత మంది భక్తులు దళారులను ఆశ్రయిస్తున్నారు. కొన్ని సార్లు స్వామివారి దర్శనం పేరుతొ లక్షలు లక్షలు పోగొట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేసిన భక్తులు కూడా ఉన్నారు. అయితే శ్రీవారి సేవా టికెట్లు, వసతి గదులను నకిలీ ఐడీ కార్డ్స్ తో తీసుకుని అక్రమాలకు పాల్పడుతున్న వారికి చెక్ పెట్టేందుకు టీటీడీ సిద్ధమైంది. దళారుల ఆగడాలకు అడ్డు కట్ట వేసేందుకు ఆధార్ ను పలుసేవలకు అనుసంధానం చేయనుంది. స్వామివారి వివిధ సేవల్లో పాల్గొనే భక్తులు ఆన్ లైన్ లో, ఆఫ్ లైన్ లో సమర్పిస్తున్న ఐడీ కార్డులు ఒకటేనా, కాదా అనే విషయం తెలుసుకునే వ్యవస్థ ఇప్పటి వరకూ లేదు. దీంతో కొంతమంది అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ విషయం టీటీడీ ఈఓ శ్యామలరావు దృష్టికి చేరుకుంది. దీంతో ఆయన ఆన్​లైన్, ఆఫ్​లైన్ సేవలపై సమీక్ష నిర్వహించి ఐటీ విభాగంలో ఉన్న కొన్ని లోపాలను అడ్డం పెట్టుకుని స్వామివారి దర్శనం, వసతి గదుల విషయంలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు గుర్తించారు.

అధర్ తో దందా నడుపుతోన్న అక్రమార్కులు

స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఇచ్చే వసతి గదుల కేటాయింపులో పలు అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఒకే ఆధర్ నెంబర్, ఒకే మొబైల్ నంబరు, ఈ- మెయిల్ తో ఎక్కువగా వసతి గదులు బుక్ అయినట్లు గుర్తించారు. కరెంటు బుకింగ్​లో ఇచ్చే గదులను రకరకాల గుర్తింపు కార్డులను చూపించి .. వాటిని తీసుకుని.. అవసరం అన్న భక్తులకు ఎక్కువ ధరకు తిరిగి అద్దెకు ఇస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఈ దందాకు చెక్ పెట్టేందుకు టీటీడీ సిబ్బంది రంగంలోకి దిగింది. ఫెషియల్ రికగ్నిషన్ వ్యవస్థని ఏర్పాటు చేయాలనీ.. ఆధార్‌ ను అన్ని సేవలకు అనుసంధానం చేయాలనీ భావిస్తోంది. ఇలా చేయడం వలన తిరుమల లో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చు అని భావిస్తోంది

యూఐడీఏఐ ప్రతినిధులతో టీటీడీ సిబ్బంది సమావేశం

ఇప్పటికే యూఐడీఏఐ ప్రతినిధులతో టీటీడీ సిబ్బంది సమావేశమయ్యారు. తిరుమలలోని శీవారి పలు సేవలకు ఆధార్‌ మను అనుసంధానం చేసే విషయంపై చర్చించారు. ఆధార్‌ చట్టం-2016 ప్రకారం సేవలు వినియోగించుకోవచ్చు అని.. అయితే దీని కోసం రెండు సంవత్సరాలకు రిజిస్ట్రేషన్‌ ఫీజుగా రూ.20 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని టీటీడీకి తెలియజేశారు యూఐడీఏఐ సిబ్బంది. అంటే ఆధార్‌ గుర్తింపునకు 40 పైసలు, ఈకేవైసీకి రూ.3.40 పైసలు టీటీడీ చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ విషయంపై టీటీడీ బోర్డు ఆమోద ముద్ర వేయగా.. ఏపీ ప్రభుత్వం కూడా అంగీకరిస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ అంగీకరిస్తే ఆధార్ ను అనుసంధానం చేస్తూ సేవలు టిటిడీ వినియోగించే అవకాశం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

వామ్మో.. రూ.కోట్లు సంపాదించి పెడుతున్న రావిచెట్టు.!వీడియో.
వామ్మో.. రూ.కోట్లు సంపాదించి పెడుతున్న రావిచెట్టు.!వీడియో.
వింత ఆచారం.. ఇంటింటా సేకరించిన అన్నాన్ని రాశిగా పోసి.. వీడియో.
వింత ఆచారం.. ఇంటింటా సేకరించిన అన్నాన్ని రాశిగా పోసి.. వీడియో.
ఆసుపత్రిలో మనోజ్! మంచు కుటుంబంలో తుఫాన్.మోహన్‌బాబు తనను కొట్టారని
ఆసుపత్రిలో మనోజ్! మంచు కుటుంబంలో తుఫాన్.మోహన్‌బాబు తనను కొట్టారని
కాంగ్రెస్ ఏడాది పాలనపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
కాంగ్రెస్ ఏడాది పాలనపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
హీరోయిన్ తో టాలీవుడ్ డైరెక్టర్ పెళ్లి.! తిరుమల సన్నిదిలో వివాహం..
హీరోయిన్ తో టాలీవుడ్ డైరెక్టర్ పెళ్లి.! తిరుమల సన్నిదిలో వివాహం..
భారతీయ సినిమా చరిత్రలో పుష్ప 2 ఓ విస్పోటనం.! రుహానీశర్మ కామెంట్స్
భారతీయ సినిమా చరిత్రలో పుష్ప 2 ఓ విస్పోటనం.! రుహానీశర్మ కామెంట్స్
నన్ను అర్థం చేసుకోవడం కష్టం.. వారికైతే మరీ కష్టం! ధనుష్ కామెంట్స్
నన్ను అర్థం చేసుకోవడం కష్టం.. వారికైతే మరీ కష్టం! ధనుష్ కామెంట్స్
కలుస్తూ.. విడిపోతూ.. సీరియల్‌లా సాగుతోంది వీరి జీవితం.! వీడియో..
కలుస్తూ.. విడిపోతూ.. సీరియల్‌లా సాగుతోంది వీరి జీవితం.! వీడియో..
అల్లు అర్జున్ పై ఆర్జీవీ ట్వీట్.. కాంట్రవర్సీ లేకపోతే ఆర్జీవీ ఎలా
అల్లు అర్జున్ పై ఆర్జీవీ ట్వీట్.. కాంట్రవర్సీ లేకపోతే ఆర్జీవీ ఎలా
బన్నీ పై ప్రకాశ్ రాజ్‌ ట్వీట్.. గంగోత్రి నుండి చూస్తున్నా అంటూ..
బన్నీ పై ప్రకాశ్ రాజ్‌ ట్వీట్.. గంగోత్రి నుండి చూస్తున్నా అంటూ..