AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabarimala: అయ్యప్ప సన్నిధిలో అపచారం.. 18 పసిడి మెట్లపై పోలీసులు ఫోటో షూట్.. చర్యలు తీసుకున్న అధికారులు

శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప స్వామి ఆల‌యంలో అప‌శృతి చోటు చేసుకుంది. అత్యంత పవిత్రమైన పదునెట్టాంబడి మెట్ల వద్ద భక్తుల భద్రత కోసం నియమించిన పోలీసులు ఫొటోలకు ఫోజులిచ్చారు. యూనిఫాంలో ఉన్న వీరంతా అయ్యప్ప స్వామికి వ్యతిరేక దిశలో ఫొటో దిగడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై స్థానిక మీడియాలో కథనం రావడంతో కేరళ ఏడిజీపీఎస్ శ్రీజిత్ స్పందించారు.

Sabarimala: అయ్యప్ప సన్నిధిలో అపచారం.. 18 పసిడి మెట్లపై పోలీసులు ఫోటో షూట్.. చర్యలు తీసుకున్న అధికారులు
Sabarimala Photo Op Row
Surya Kala
|

Updated on: Nov 28, 2024 | 12:47 PM

Share

శబరిమల అయ్యప్ప స్వామీ దర్శనం కోసం వెళ్ళే భక్తులు అత్యంత భక్తీ శ్రద్దలతో స్వామివారిని పూజిస్తారు. మండల దీక్ష లేదా జ్యోతి దర్శనం కోసం స్వామీ మాలా ధారణ చేసినవారు తమ ఇరుముడులతో హరిహర సుతుడు దర్శనం కోసం ప‌తినెట్టంప‌డి బంగారు మెట్లను (18 పసిడి మెట్లను) ఎక్కి వెళ్తారు. మాల ధారణ చేయని సాధారణ భక్తూ స్వామివారిని దర్శించుకునేందుకు మెట్ల పక్కన ఉండే మార్గం ద్వారా వెళ్లి స్వామిని దర్శించుకుంటారు. అటువంటి అతిపవిత్రమైన ప‌తినెట్టంప‌డి బంగారు మెట్లదగ్గర పోలీసులు ఫోటోలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. శబరిమలలో విధులను నిర్వహిస్తున్న పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే..

శబరిమలలో అపశృతి

అత్యంత పవిత్ర క్షేత్రం శబరిమలలో అపశృతి చోటు చేసుకుంది. శబరిమలలోని పవిత్రమైన పతినెట్టం పడి (పద్దెనిమిది మెట్లు)పై ఇరవై మూడు మంది పోలీసు అధికారులు ఫోటో తీసుకున్నారు. ఈ ఫోటోను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో అప్ లోడ్ చేశారు. దీంతో ఏడీజీపీ శ్రీజిత్‌.. శ‌బ‌రిమ‌ల ఆఫీస‌ర్ ను ఈ ఘటనకు దీనికి సంబంధించి సమగ్ర నివేదికను అందజేయాల్సిందిగా ఆదేశించారు. నవంబరు 24 మధ్యాహ్నం 1.30 గంటకు అక్కడ విధుల్లో ఉన్న 23 మంది పోలీసులు.. తమ డ్యూటీ ముగియడానికి ముందు పదునెట్టాంబడిపై స్వామికి వ్యతిరేకంగా నిలబడి తీసుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఫోటో షూట్ లో పాల్గొన్న పోలీసులకు జరిమానా విధించి.. వేరే సెక్షన్ కు ట్రైనింగ్ నిమిత్తం పంపించినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

కేరళ హైకోర్టు సైతం ఆందోళన

ఈ ఘటనపై కేరళ హైకోర్టు సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అమోదించబోమని పేర్కొంది. అలాగే, శబరిమలలో భక్తుల వద్ద దుకాణదారులు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించింది. తరుచూ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించాలని సూచించింది. ఒకవేళ ఎవరైనా ఎంఆర్పీ కంటే అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్టు గుర్తిస్తే వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని తెలిపింది.

విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం

ఈ ఘటనపై విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. శబరిమల ఆలయం అనగానే అక్కడ ఉండే 18 మెట్లు గుర్తుకొస్తాయని, మాలధారణ చేసి, కఠోర నియమ నిష్ఠలను పాటించి, ఇరుముడితో వచ్చిన భక్తులకు మాత్రమే అధిరోహించే అర్హత ఉంటుందన్నారు. అటువంటి ఈ పవిత్రమైన మెట్లపై ఫోటో షూట్ చేయడం ఏంటి? అని మండిపడ్డారు.

18 మెట్లు దేనికి సంకేతం అంటే

పదునెట్టాంబడిపై తొలి అయిదు మెట్లను పంచేంద్రియాలుగానూ.. ఆ తరువాతి ఎనిమిది మెట్లను కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్య, అలసత్వానికి సూచికగా.. చివరి మూడు మెట్లు సత్వ, తమో, రజో గుణాలు, చివరి రెండు మెట్లు విద్య, అవిద్యకు సూచికగా భావిస్తారు. అటువంటి 18 మెట్లను అధిరోహించి అయ్యప్పను దర్శించుకోవడం వల్ల వాటన్నింటిని జయించినట్టు భక్తులు విశ్వసిస్తారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ పదునెట్టంబాడపై పోలీసులు గ్రూప్ ఫొటో దిగడం వివాదాస్పదమవుతోంది. అటు, ఉన్నతాధికారులు దీనిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. ఫోటో షూట్‌లో పాల్గొన్న 23 మంది పోలీసులను కన్నూర్ క్యాంప్‌కు అటాచ్ చేశారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..