Japanese Encephalitis: వామ్మో.. పదేళ్ల తర్వాత ఢిల్లీలో డేంజరస్ వైరస్ కేసు నిర్ధారణ.. లక్షణాలు ఏమంటే..?

ఏ సమయంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిందో ఏమో.. అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా రకరకాల వైరస్ లు వెలుగులోకి వస్తూ మానవాళిని భయభ్రాంతులకు గురి చేస్తూనే ఉన్నాయి. తాజాగా జపనీస్ మెదడువాపు జ్వరం దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) ప్రకారం, ఢిల్లీలోని వెస్ట్ జోన్‌లోని బందీపూర్ ప్రాంతంలో ఒక కేసు వెలుగులోకి వచ్చింది. ఈ వ్యాధి చాలా ప్రమాదకరమైనది. ఇది దోమల కాటు ద్వారా వ్యాపిస్తుంది.

Japanese Encephalitis: వామ్మో.. పదేళ్ల తర్వాత ఢిల్లీలో డేంజరస్ వైరస్ కేసు నిర్ధారణ.. లక్షణాలు ఏమంటే..?
Japanese Encephalitis
Follow us
Surya Kala

|

Updated on: Nov 28, 2024 | 12:22 PM

2019 సంవత్సరంలో కోవిడ్-19 భారతదేశంలో అడుగు పెట్టింది.. మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ విజృంభించింది. ఈ వైరస్ రకరకాల రూపాలను సంతరించుకుని మానవాళి వినాశనానికికారణం అయింది. ఇది మన దేశాన్ని మాత్రమే కాదు యావత్ ప్రపంచాన్ని వణికించింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశంలో లాక్‌డౌన్ విధించింది. భారీ సంఖ్యలో చనిపోయారు. ఇప్పుడిప్పుడే కరోనా సృష్టించిన భయభ్రాంతుల నుంచి ప్రజలు కోలుకుంటున్నారు. తాజాగా మరొక ప్రాణంతక వైరస్ దేశంలో అడుగు పెట్టినట్లు తెలుస్తోంది. జపనీస్ వ్యాధి ఇప్పుడు దేశ రాజధానిలో వెలుగులోకి వచ్చింది. ఇది చాలా ప్రమాదకరమైనదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డెంగ్యూ జ్వరం వలె ఈ వ్యాధి కూడా ప్రధానంగా దోమల ద్వారా వ్యాపిస్తుంది. బర్డ్ ఫ్లూ వలె, ఈ వ్యాధి జంతువుల నుంచి మానవులకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధి పేరు జపనీస్ ఎన్సెఫాలిటిస్ జ్వరం. ఈ వ్యాధికి సంబంధించిన కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. దీనితో జాగ్రత్తగా ఉండటం ముఖ్యం.

మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) ప్రకారం ఢిల్లీలోని వెస్ట్ జోన్‌లోని బందీపూర్ ప్రాంతంలో ఒక కేసు వెలుగులోకి వచ్చింది. మెదడువాపు జ్వరం చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. దీనిని బ్రెయిన్ ఫీవర్ అని కూడా అంటారు. జపనీస్ ఎన్సెఫాలిటిస్ (JE) అనేది జపనీస్ ఎన్సెఫాలిటిస్ వైరస్ (JEV) వల్ల కలిగే వైరల్ వ్యాధి. ఈ వైరస్ దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఇది జంతువులు, పక్షులు, పందుల ద్వారా కూడా వ్యాపిస్తుంది. ఈ వైరస్ సోకిన జంతువులను దోమలు కుట్టిన తర్వాత అవి మనిషిని కుడితే.. ఈ వైరస్ మానవ శరీరంలోకి ప్రవేశించి జపనీస్ ఎన్సెఫాలిటిస్ ఫీవర్‌కు కారణమవుతుంది.

జపనీస్ ఎన్సెఫాలిటిస్ ఫీవర్‌ లక్షణాలు ఏమిటి?

జపనీస్ ఎన్సెఫాలిటిస్ ఫీవర్‌ లక్షణాలు సాధారణంగా దోమ కాటు తర్వాత 5 నుంచి 15 రోజులకు కనిపిస్తాయి.

ఇవి కూడా చదవండి

1. తీవ్ర జ్వరం 2.తలనొప్పి 3.కండరాల నొప్పి 4. తలనొప్పితో కూడిన వాంతులు 5. మూర్ఛ

జపనీస్ ఎన్సెఫాలిటిస్ ఫీవర్‌ ను ఎలా గుర్తించాలంటే

జపనీస్ ఎన్సెఫాలిటిస్ ఫీవర్‌ ని నిర్ధారించడానికి సెరెబ్రోస్పానియల్ ఫ్లూయిడ్ (CSF) పరీక్ష ను చేయించుకోవాలి. రక్త పరీక్షలో JEVకి వ్యతిరేకంగా ప్రతిరోధకాలు ఉంటే ఈ వ్యాధి బారిన పడినట్లే..

ఈ జ్వరం మెదడుకు చేరితే చికిత్స చేయడం కష్టం. ఇది మరణానికి కూడా కారణం కావచ్చు. ఈ వైరస్ బారిన ఎక్కువగా పిల్లలు పడతారు. ఈ వ్యాధి అధిక కేసు మరణాల రేటు (CFR) కలిగి ఉంది. ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొంది జీవించి ఉన్నవారు కాలక్రమంలో రకరకాల వ్యాధుల బారిన పడతారు. వివిధ స్థాయిల నరాల సంబంధిత ఇబ్బందులను పడే అవకాశం ఉంది. ఈ వైరస్ మొదటసారి 1871 లో జపాన్‌లో వెలుగులోకి వచ్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..