మొబైల్ షాపులో రూ.24 లక్షల విలువైన ఫోన్ల చోరీ.. దొంగ చెప్పిన మాటలకు పోలీసుల షాక్!

ఓ 20 ఏళ్ల యువకుడు మొబైల్ షాపు తాళం పగులగొట్టి, చోరీకి పాల్పడ్డ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. లోపలికి ప్రవేశించి ఒకటి రెండు కాదు ఏకంగా 41 మొబైల్ ఫోన్లను అపహరించాడు.

మొబైల్ షాపులో రూ.24 లక్షల విలువైన ఫోన్ల చోరీ.. దొంగ చెప్పిన మాటలకు పోలీసుల షాక్!
Ai Image 1
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 28, 2024 | 1:05 PM

ప్రతిరోజూ ఏదోక చోట, అనేక దొంగతనాలు వెలుగులోకి వస్తున్నాయి. వారిలో కొందరు చాలా తెలివైన దొంగలు, వారు తమ అభిరుచులను నెరవేర్చుకోవడానికి దొంగిలిస్తారు. కొందరైతే బలవంతంగా చోరీలు పాల్పడుతున్నట్లు చాలాసార్లు దొంగల మాటల్లో విన్నాం. తాజాగా ఓ 20 ఏళ్ల యువకుడు మొబైల్ షాపు తాళం పగులగొట్టి, చోరీకి పాల్పడ్డ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. లోపలికి ప్రవేశించి ఒకటి రెండు కాదు ఏకంగా 41 మొబైల్ ఫోన్లను అపహరించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ చోరీ ఘటనలో ఇంజినీరింగ్ విద్యార్థిగా తేలిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంజినీరింగ్ ఫీజు కట్టేందుకు దొంగతనం చేశానని పోలీసులకు చెప్పాడు. అయితే క్రైం బ్రాంచ్ విచారణ జరిపి నిందితుడిని క్షుణ్ణంగా విచారించగా.. మెరుగైన జీవితం గడపాలని, కాలేజీలో డబ్బులు వెచ్చించాలనే ఉద్దేశంతో చోరీకి పాల్పడినట్లు తేలింది.

చోరీకి పాల్పడ్డ వ్యక్తిని రాయ్‌గఢ్ జిల్లాలోని ఉరాన్ నివాసి ఆకాష్ రాజారామ్ రాజ్‌కుండేగా గుర్తించారు. ఆకాష్ నెతుల్‌లోని ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. ఉత్తరాదిలోని ఓ మొబైల్ షాపులో రూ.24 లక్షల విలువైన 41 మొబైల్ ఫోన్లను దొంగిలించాడు. దుకాణంలో అమర్చిన సీసీ కెమెరాల సాయంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆకాష్‌కు క్రైమ్ హిస్టరీ లేదని, అంటే ఇంతకు ముందు ఏ కేసులోనూ ప్రమేయం లేదని తేలింది.

ఆకాష్ తండ్రి కొన్నేళ్ల క్రితమే చనిపోయాడు. దీంతో కుటుంబం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినా ఆకాష్ మేనమామ ఇంటి నిర్వహణలో వారికి సహాయం చేస్తున్నాడు. ఆకాష్ కాలేజీ ఫీజు కూడా అతని మామ చెల్లిస్తున్నాడు. అయితే ఆకాష్ తన అవసరాలు, కోరికలు తీర్చుకునేందుకే ఈ చోరీకి పాల్పడ్డాడని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఆస్ట్రేలియాలో ఫ్లాప్‌షో.. కట్‌చేస్తే.. ఆ ముగ్గురు ఔట్?
ఆస్ట్రేలియాలో ఫ్లాప్‌షో.. కట్‌చేస్తే.. ఆ ముగ్గురు ఔట్?
సుప్రీంకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు స్వల్ప ఊరట
సుప్రీంకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు స్వల్ప ఊరట
ఏది నిజం..? గుండెపోటుకు సంబంధించి ఈ పుకార్లను అస్సలు నమ్మకండి..
ఏది నిజం..? గుండెపోటుకు సంబంధించి ఈ పుకార్లను అస్సలు నమ్మకండి..
బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న చాహల్, శ్రేయాస్ అయ్యర్
బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న చాహల్, శ్రేయాస్ అయ్యర్
పండుగ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం ఉంటుందా..?
పండుగ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం ఉంటుందా..?
దేశంలో 11కి చేరిన HMPV కేసులు.. జేబుకు చిల్లు పెడుతున్న టెస్టులు
దేశంలో 11కి చేరిన HMPV కేసులు.. జేబుకు చిల్లు పెడుతున్న టెస్టులు
ప్రాణాలు తీస్తోన్న చైనా మాంజా.. అందుకే ఈయన ఇలా
ప్రాణాలు తీస్తోన్న చైనా మాంజా.. అందుకే ఈయన ఇలా
పిల్లల ఫీజుల కోసం సచిన్ డబ్బు పంపాడు.. కానీ: కాంబ్లీ భార్య
పిల్లల ఫీజుల కోసం సచిన్ డబ్బు పంపాడు.. కానీ: కాంబ్లీ భార్య
గేమ్ ఛేంజర్ మేకింగ్ వీడియో అదిరిపోయింది.. హైలెట్ అదే..
గేమ్ ఛేంజర్ మేకింగ్ వీడియో అదిరిపోయింది.. హైలెట్ అదే..
ఖరీదైన పండు.. పోషకాలు మెండు.. డైలీ తిన్నారంటే కొలెస్ట్రాల్ ఖతమే..
ఖరీదైన పండు.. పోషకాలు మెండు.. డైలీ తిన్నారంటే కొలెస్ట్రాల్ ఖతమే..