టోల్ ట్యాక్స్ అడగటమే తప్పైంది.. టోల్ సిబ్బందికి చుక్కలు చూపిన లోకల్ లీడర్ భార్య..!

ఏసీపీ టోల్‌వేస్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ ఫిర్యాదు మేరకు అదాల్‌హట్‌ పోలీసులు ఏడుగురిపై, గుర్తు తెలియని ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

టోల్ ట్యాక్స్ అడగటమే తప్పైంది.. టోల్ సిబ్బందికి చుక్కలు చూపిన లోకల్ లీడర్ భార్య..!
Fatehpur Toll Plaza
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 28, 2024 | 1:05 PM

ఉత్తరప్రదేశ్‌లోని టోల్ ప్లాజా వద్ద ఓ పొలిటీషియన్ భర్త, అతని అనుచరుల రెచ్చిపోయారు. మీర్జాపూర్ అదాల్‌హట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతేపూర్ టోల్ ప్లాజా వద్ద తుపాకులతో బహిరంగంగా కాల్పులు తెగబడ్డ ఘటన వెలుగులోకి వచ్చింది. స్కార్పియో, ఫార్చ్యూనర్‌లను నడుపుతున్న వ్యక్తుల నుండి టోల్ ఉద్యోగులు టోల్ అడగడంతో, కాల్పులు జరిగాయి. ఈ ఘటన బుధవారం(నవంబర్ 27) రాత్రి జరిగింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఫతేపూర్ టోల్ ప్లాజా వద్ద స్కార్పియో, ఫార్చ్యూనర్ కార్ల డ్రైవర్లు టోల్ ట్యాక్స్ కట్టకుండానే వాహనాన్ని దాటించాలనుకున్నారు. టోల్ ఉద్యోగులు వారిని ఆపడంతో, వారు మొదట అడ్డంకిని తొలగించడానికి ప్రయత్నించారు. టోల్ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేయడంతో, వారు వాహనంలో నుండి రైఫిల్లు, పిస్టల్స్‌ను తీసి పలు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ సమయంలో టోల్ ప్లాజా వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రాణాలు కాపాడుకునేందుకు టోల్ ప్లాజా ఉద్యోగులు పరుగులు తీశారు. ఈ సంఘటనకు సంబంధించి ఫతేపూర్‌లోని ఏసీపీ టోల్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ రంజాన్ అబ్దుల్లా పటేల్ అదాల్‌హట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు ప్రకారం, బుధవారం రాత్రి 1 గంట సమయంలో సోన్‌భద్ర వైపు నుండి స్కార్పియో ఫార్చ్యూనర్స్ రెండు కార్లు ఫతేపూర్ టోల్ వద్ద ప్రయాణిస్తున్నాయి. టోల్ సిబ్బంది టోల్ టాక్స్ అడగడంతో, కారు డ్రైవర్స్ ఇద్దరూ దుర్భాషలాడటం, టోల్ వద్ద ఉన్న అడ్డంకిని తొలగించారు. ఉద్యోగులు అడ్డుకోవడంతో చంపేస్తానని బెదిరించి పిస్టల్, రైఫిల్‌తో 4 నుంచి 5 రౌండ్లు కాల్పులు జరిపారు. ఆ తర్వాత టోల్ కట్టకుండా వెళ్లిపోయారు.

ఏసీపీ టోల్‌వేస్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ ఫిర్యాదు మేరకు అదాల్‌హట్‌ పోలీసులు ఏడుగురిపై, గుర్తు తెలియని ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సోన్‌భద్రలోని బబ్ని బ్లాక్ అధ్యక్షులు బేబీ సింగ్ భర్త రాజన్ సింగ్ స్కార్పియో, ఫార్చ్యూనర్ కారులో సోన్‌భద్ర నుండి బనారస్ వైపు వెళ్తున్నట్లు సమాచారం. అందులో ఆమెతో పాటు 8 నుంచి 9 మంది ప్రయాణిస్తున్నారు. టోల్ ప్లాజా వద్దకు రాగానే టోల్ కట్టకుండానే పాస్ చేయాలన్నారు. ఈ విషయమై టోల్‌ప్లాజా ఉద్యోగులతో మాట్లాడగా.. అదాల్‌హట్‌ పోలీసులు సీసీటీవీని తీసుకెళ్లారని చెప్పారు.

దీని తర్వాత, అదాల్‌హట్ పోలీసులను సిసిటివి ఫుటేజీ అడగగా, వారు ఇవ్వడానికి నిరాకరించారు. ఈ విషయమై పోలీస్‌స్టేషన్‌ ఇన్‌చార్జి అమిత్‌ కుమార్‌ మిశ్రా మాట్లాడుతూ.. ఫిర్యాదు మేరకు స్కార్పియో, ఫార్చ్యూనర్‌ నడుపుతున్న వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఘటనా స్థలాన్ని అదనపు పోలీసు సూపరింటెండెంట్‌ ఓపీ సింగ్‌, సీఓ మంజరీరావు పరిశీలించారు. మొత్తం వ్యవహారంపై ఇంకా విచారణ కొనసాగుతోంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..