ప్రియురాలితో సహా-జీవనం.. చేసిన తప్పును కప్పపుచ్చుకునేందుకు 40ముక్కలుగా నరికేసిన ప్రియుడు..!

ఇద్దరూ ఏడాదిన్నర పాటు లివ్-ఇన్-రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఏడాదిన్నర పాటు సహజీవనం చేసిన గంగి తమిళనాడుకు పనికి వెళ్లగా, నరేష్ బెంగళూరుకు వచ్చి జీవించడం ప్రారంభించాడు.

ప్రియురాలితో సహా-జీవనం.. చేసిన తప్పును కప్పపుచ్చుకునేందుకు 40ముక్కలుగా నరికేసిన ప్రియుడు..!
Ai Image
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 28, 2024 | 10:42 AM

జార్ఖండ్‌లో దారుణం వెలుగుచూసింది. రాంచీలో లైవ్-ఇన్ పార్టనర్ హత్య కేసులో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్యకు ముందు తన ప్రియురాలిపై అఘాయిత్యానికి ఒడిగట్టి, ఆపై కండువాతో ఆమె గొంతు బిగించి హత్య చేశాడు. పట్టుబడకుండా ఉండేందుకు మృతదేహాన్ని 40 ముక్కలుగా నరికేశాడు. ముక్కలను సంచిలో తీసుకువెళ్లి అడవిలో పాతిపెట్టాడు. ఇక అక్కడి నుంచి గుట్టుచప్పుడు కాకుండా తన భార్య, కొడుకు నివసించే బెంగళూరులోని తన ఇంటికి తిరిగి వచ్చాడు నిందితుడు.

అయితే మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మర్డర్ మిస్టరీని ఛేదించారు. నవంబర్ 24న జార్ఖండ్‌లోని రాంచీలో అస్థిపంజరం లభ్యమైంది. నిజానికి, ఒక కుక్క తన నోటిలో మానవ చేయితో తిరుగుతోంది. ఇది చూసిన స్థానికులు కుక్క చేయి తెచ్చిన ప్రదేశానికి వెళ్లారు. ఆ ప్రదేశంలో మట్టిని తొలగించడంతో అక్కడ ఒక మానవ శవం పడి ఉంది. అది కూడా ముక్కలుగా నరికివేసి ఉండటంతో స్థానికులు షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అక్కడ లభించిన మహిళ ఆధార్ కార్డు ఉన్న బ్యాగ్ ఆధారంగా సాంకేతిక నిఘా సహాయంతో పోలీసులు ఈ కేసును ఛేదించారు.

ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అయితే తనకు, తన స్నేహితురాలికి ఏడాదిన్నరగా ఎఫైర్ ఉందని నిందితుడు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత వేరే పెళ్లి చేసుకున్నానని, దాన్ని తన ప్రియురాలు వ్యతిరేకించడంతో ఆమెను చంపానన్నాడు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు ఆమె శవాన్ని 40 ముక్కలుగా నరికివేసినట్లు పోలీసుల ముందు అంగీకరించాడు.

జరియాగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భగవాన్ పంజ్ టోంగ్రీలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. జోజోదాగ్ గ్రామానికి చెందిన నరేష్ భెంగ్రా అనే వ్యక్తి గంగి అనే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆమె వాస్తవానికి రాంచీ జిల్లాలోని లాపుంగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాల్గో తంగ్రాటోలి గ్రామ నివాసి. నరేష్ తల్లి ఇల్లు కూడా అదే గ్రామంలో ఉంది. ఆమె తల్లి ఇంటికి వెళ్ళినప్పుడు, గంగి, నరేష్ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఇద్దరూ ఏడాదిన్నర పాటు లివ్-ఇన్-రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఏడాదిన్నర పాటు సహజీవనం చేసిన గంగి తమిళనాడుకు పనికి వెళ్లగా, నరేష్ బెంగళూరుకు వచ్చి జీవించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో నరేష్‌కు మరో అమ్మాయితో సంబంధం ఏర్పడింది. ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరికీ ఒక కొడుకు కూడా ఉన్నాడు.

నరేష్ రెండో పెళ్లి చేసుకున్నాడని తెలియగానే గంగి అతనిపై తీవ్ర ఆగ్రహాంతో ఊగిపోయింది. ఆమె బెంగళూరుకు వచ్చిందని తెలుసుకున్న నరేష్ భయపడ్డాడు. గంగి తన భార్యకు అంతా చెబితే తన జీవితం పాడైపోతుందని నరేష్ అనుకున్నాడు. ఏదో ఒక సాకుతో గంగిని కొన్ని రోజులకు వెనక్కి పంపాలని ఆలోచించాడు. మాయ మాటలు చెప్పి అతను రైలులో గంగిని హతియాకు తీసుకువచ్చాడు. నవంబర్ 8వ తేదీ సాయంత్రం అతను గంగిని భగవాన్ పంజ్ టోంగ్రీకి తీసుకెళ్లాడు. ఇక్కడ వారిద్దరూ ఇదో విషయంలో గొడవలు పడ్డారు.

అనంతరం గంగిని కండువాతో గొంతుకు ఉరేసి నరేష్ హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని గొడ్డలితో 40 ముక్కలుగా నరికి, వాటిని ఆడవి ప్రాంతంలో పాతిపెట్టి బెంగళూరులోని ఇంటికి వెళ్లాడు. నవంబర్ 24న కొంతమంది స్థానికులు టోంగ్రీలో మానవ అస్థిపంజరాన్ని చూసి జరియాగఢ్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారని SDPO తెలిపారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ కేసులో తదుపరి చర్యలు కొనసాగుతున్నాయి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఇషా అంబానీ బంగ్లాను కొన్న హాలీవుడ్ స్టార్ కపుల్.. ఎన్ని కోట్లంటే?
ఇషా అంబానీ బంగ్లాను కొన్న హాలీవుడ్ స్టార్ కపుల్.. ఎన్ని కోట్లంటే?
ఈ సీఎం సాబ్ గారి భార్య బాలీవుడ్‌లో స్టార్ సింగర్ అని తెలుసా?
ఈ సీఎం సాబ్ గారి భార్య బాలీవుడ్‌లో స్టార్ సింగర్ అని తెలుసా?
రైఫిల్ గురిపెట్టిన సీఎం రేవంత్.. టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు!
రైఫిల్ గురిపెట్టిన సీఎం రేవంత్.. టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు!
సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే..
సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే..
ఆధార్ కార్డులో సాహా బ్యూటీ శ్రద్ధా కపూర్ ఎలా ఉందో చూశారా? వీడియో
ఆధార్ కార్డులో సాహా బ్యూటీ శ్రద్ధా కపూర్ ఎలా ఉందో చూశారా? వీడియో
రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా: అల్లు అర్జున్
రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా: అల్లు అర్జున్
‘భారతీయ వాయుయాన్‌ విధేయక్‌’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..
‘భారతీయ వాయుయాన్‌ విధేయక్‌’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..
అయ్యో చిట్టి తల్లి!.. పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న తల.. 
అయ్యో చిట్టి తల్లి!.. పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న తల.. 
అతడి యాక్టింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..
అతడి యాక్టింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..
చలికాలంలో పిల్లలకు అరటిపండు ఇవ్వడం సరైనదా.. కాదా?
చలికాలంలో పిల్లలకు అరటిపండు ఇవ్వడం సరైనదా.. కాదా?