Winter Skin Care Tips: ఈ సీజన్ లో ముఖం అందంగా అద్దంలా మెరిసిపోవాలా.. తేనెతో వీటిని కలిపి రాసుకోండి..

చలికాలంలో చర్మం పొడిబారడం చాలా సాధారణం. అందువల్ల ముఖం మెరుస్తూ, మృదువుగా ఉండటానికి సరైన చర్మ సంరక్షణ దినచర్య చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో తేనెలో కొన్ని రకాల వస్తువులను కలిపి ఫేస్ ప్యాక్ గా తయారు చేసుకోవచ్చు. ఇవి చర్మానికి తేమను అందించడంలో సహాయపడతాయి.

Surya Kala

|

Updated on: Nov 28, 2024 | 11:15 AM

చలికాలంలో శరీరం డీ హైడ్రేట్ కు గురవుతుంది. దీంతో చర్మం పొడిబారడం సర్వసాధారణం. దీని వల్ల ముఖం డల్ గా కనబడుతుంది. ఇది సాధారణ విషయం అయినప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ సమస్య మరింత పెరుగుతుంది. చర్మం పొడిబారిన తర్వాత చర్మంలో పగుళ్లు కనిపించడం ప్రారంభిస్తాయి. దీనిని స్కిన్ క్రాకింగ్ అని కూడా పిలుస్తారు. అదే సమయంలో పొడి బారిన చర్మం దురద, బర్నింగ్, ఫ్లాకీ చర్మం, ఎరుపు వంటి ఇబ్బందులు కలుగుతాయి. కనుక శీతాకాలంలో చర్మం పొడిబారకుండా నిరోధించడానికి, సరైన చర్మ సంరక్షణ దినచర్యను పాటించడం చాలా ముఖ్యం. స్కిన్ పొడిబారడం తగ్గి ముఖం మెరిసిపోయెలా రకరకాల టిప్స్ పాటిస్తూ ఉంటారు. వివిధ రకాల బ్యూటీ ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అంతేకాదు వంటింటి నివారణ చిట్కాలను అనుసరిస్తారు.

1 / 8
చర్మ సంరక్షణ కోసం హోం రెమెడీస్ ప్రభావవంతంగా ఉండటమే కాదు చర్మాన్ని మెరిసేలా చేయడంలో కూడా సహాయపడతాయి. అదే సమయంలో చర్మం మెరుస్తూ ఉండటానికి తేనెతో కలిపిన కొన్ని వస్తువులను ఉపయోగించవచ్చు. అందులో కొన్ని పదార్థాలను మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి ఫేస్ ప్యాక్ తయారు చేసి అప్లై చేయడం వలన ముఖం మెరిసిపోతూ కనిపిస్తుంది.

2 / 8
తేనె పసుపు ఫేస్ ప్యాక్ : పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల ఫేస్ గ్లో రావడంతోపాటు మచ్చలు తగ్గుతాయి.

3 / 8
తేనె, పసుపు, పచ్చి పాల ఫేస్ ప్యాక్: ఈ మిశ్రమం కూడా ముఖానికి గ్లో తీసుకొస్తుంది. పచ్చి పాలల్లో ఉండే లాక్టిక్ యాసిడ్ మృత చర్మ కణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాదు ప్రోటీన్, కొవ్వు చర్మానికి తేమను అందించడంలో సహాయపడతాయి.

4 / 8
ఫేస్ ప్యాక్  తయారీ ఎలా:  ఒక గిన్నెలో 2 చిటికెల పసుపు, 1/2 చెంచా తేనె, 3 చెంచాల పచ్చి పాలు తీసుకుని బాగా మిక్స్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. శుభ్రమైన చేతులు లేదా దూదిని ఈ మిశ్రమంలో ముందు ముఖంపై అప్లై చేయండి. ఆపై వృత్తాకారంలో అప్లై చేసి.. ముఖానికి మసాజ్ చేసి.. 15 నుంచి 20 నిమిషాల పాటు ఈ పేస్ట్‌ను ఉంచుకుని అనంతరం ముఖాన్ని గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

5 / 8
పాలు- తేనె: ఆరోగ్యంతో పాటు మన చర్మానికి కూడా ఉపయోగకరం. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు చర్మానికి మేలు చేస్తాయి. పాలలో కొంచెం తేనె మిక్స్ చేసి ముఖానికి రాసుకోవచ్చు. దీన్ని అప్లై చేసేటప్పుడు.. సర్క్యులేషన్ మోషన్‌లో ముఖాన్ని మసాజ్ చేసి, 10 నిమిషాల పాటు ఉంచిన తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తేనె, పాలు రెండూ చర్మాన్ని తేమగా మార్చడంలో సహాయపడతాయి. అంతేకాదు ఈ ఫేస్ వాష్ చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో పాటు ముఖ ఛాయను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.

6 / 8
కలబంద- తేనె: కలబందలో సహజ యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో , మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి. తేనె చర్మానికి తేమను అందించి మృదువుగా మార్చడంలో మేలు చేస్తుంది. ఈ పేస్ట్ చేయడానికి ఒక చెంచా అలోవెరా జెల్, ఒక చెంచా తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 15-20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.

7 / 8
ఏదైనా రెమెడీని అప్లై చేసే ముందు చర్మానికి ఈ సహజ పదార్ధాలవలన మీకు అలెర్జీ లేదని నిర్ధారించుకోవాలి. చర్మం సున్నితంగా ఉంటే ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసి ఆపై దాన్ని ఉపయోగించండి. అంతేకాదు ఈ హోం రెమెడీలను వారానికి రెండు సార్లు కంటే ఎక్కువ ఉపయోగించవద్దు.

8 / 8
Follow us