Winter Care: వింటర్ సీజన్‌లో గుండె పోటు ముప్పు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
సాధారణంగా చలి కాలంలో అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వీటితో పాటు గుండె పోటు రిస్క్ కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి..
వింటర్ సీజన్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోతున్నాయి. చలి తీవ్రత కొద్ది కొద్దిగా పెరుగుతుంది. ఆరోగ్య పరంగా ఇతర సీజన్ల కంటే చలి కాలంలో మరింత జాగ్రత్తలు అవసరం. పొగ మంచు, చలి కారణంగా అనేక అనారోగ్య సమ్యల ముప్పు ఎక్కువగా ఎటాక్ చేస్తుంది. శరీర నొప్పులు, అలసట, నీరసం, ఇమ్యూనిటీ తగ్గడం, బద్ధకమే కాకుండా గుండె పోటు ముప్పు కూడా ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలి కాలంలో రక్త పోటు తీవ్రంగా పెరిగి.. గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఈ సీజన్‌లో గుండెపై ఎక్కువగా ఒత్తిడి పడుతుందట. గుండె వ్యాధులతో ఉన్నవారు ఈ కాలంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. శీతా కాలంలో గుండె పోటు ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాం.
రక్త నాళాల సంకోచం:
శీతా కాలంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఉదయం 9 లేదా 10 గంటలు అయితే కానీ ఎండ తగలదు. దీంతో శరీరంపై ఒత్తిడి పడుతుంది. శరీరాన్ని వెచ్చదనంగా ఉంకేందుకు రక్త ప్రసరణ వేగంగా జరగడం వల్ల గుండెకు ఎక్కువగా పని పడుతుంది. దీంతో రక్త నాళాలు ఒక్కోసారి సంకోచిస్తూ ఉంటది. దీంతో గుండెకు అందే ఆక్సిజన్, రక్తంలో అడ్డంకుల కారణంగా హార్ట్ ఎటాక్ రిస్క్ పెరుగుతుంది.
శ్వాస సమస్యలు:
శ్వాస సమస్యల కారణంగా కూడా గుండెకు రిస్క్ ఉంది. ఎందుకంటే చలి కారణంగా ఎక్కువగా జలుబు చేస్తుంది. ఆస్తమా వంటి సమస్యలు కూడా పెరుగుతాయి. దీంతో శ్వాస తీసుకునేందుకు ఎక్కువగా ఇబ్బందులు పడతాయి. అలాగే రక్త పోటు పెరగడం, రక్తం గడ్డ కడుతూ ఉంటాయి. దీంతో శ్వాస తీసుకోవడం ఒత్తిడి పెరిగి.. గుండెకు ఇబ్బందిగా మారుతుంది.
ఫిట్ నెస్ కోల్పోతారు:
చలి కాలంలో చాలా బద్ధకంగా ఉంటుంది. ఉదయం సమయం గడుస్తున్నా వాతావరణంలో మార్పులు లేకపోవడంతో నిద్ర లేచేందుకు, పనులు చేసేందుకు బద్ధకిస్తూ ఉంటారు. దీని కారణంగా వ్యాయామాలు చేయరు. సరైన ఆహారం కూడా తీసుకోలేరు. దీంతో ఫిట్ నెస్‌పై ఇబ్బందిపడి.. గుండె సమస్యలు రావచ్చు. కాబట్టి చలి కాలంలో వేడిగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. పొగ మంచు శరీరంపై పడకుండా ముక్కు, నోరు, శరీరాన్ని కవర్ చేసుకోవాలి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..