Subbaraju: 47ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న సుబ్బరాజ్
ప్రముఖ నటుడు సుబ్బరాజు 47 ఏళ్ల వయసులో వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. ఈ మేరకు తన పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తన భార్యతో కలిసి బీచ్ లో దిగిన ఫొటోలను అందులో పంచుకున్నాడు. ప్రస్తుతం సుబ్బరాజు పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సుబ్బరాజు దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
దాంతో పాటే.. 47ఏళ్ల వయసుకు వస్తే కానీ.. పెళ్లి గుర్తుకు రాలేదంటూ కొంత మంది నెటిజన్లు సోషల్ మీడియాలో ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక భీమవరంలో పుట్టి పెరిగిన సుబ్బరాజు అనుకోకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. సీనియర్ డైరెక్టర్ కృష్ణ వంశీ దగ్గర పర్సనల్ కంప్యూటర్ బాగు చేసేందుకు వచ్చిన అతను అనుకోకుండా డైరెక్టర్ దగ్గరే పర్సనల్ అసిస్టెంట్ గా చేరాడు. మొదట ‘ఖడ్గం’ సినిమాలో ఒక చిన్న పాత్రతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆతర్వాత వరుసగా సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. తెలుగుతో పాటు తమిళ్, మళయాళం, హిందీ భాషల్లో సుమారు 100 కు పైగా సినిమాల్లో నటించాడు సుబ్బరాజు. ఎక్కువగా విలన్ వేషాలు వేసినప్పటికీ కొన్ని సినిమాల్లో కామెడీతో కడుపుబ్బా నవ్వించాడు. ఇప్పుడు 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుని తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టాడీ స్టార్ యాక్టర్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చైతూ, శోభిత పెళ్లి డిజిటల్ రైట్స్ పై ప్రచారం క్లారిటీ ఇచ్చిన నాగ్ టీం
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

