Indian Railways: రైళ్లలో దుప్పట్లను ఎన్నాళ్లకు ఉతుకుతారో తెలుసా..? కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారంటే..

ఏసీ బోగీల్లో టికెట్ రిజర్వ్ చేసుకుంటే.. రైల్వే శాఖ మరిన్ని సౌకర్యాలను అందిస్తుంది.. ప్రయాణికులకు బెడ్‌షీట్‌లు, దుప్పట్లను అందిస్తుంది.. అయితే ఈ దుప్పట్లను అసలు ఉతుకుతారా? ఉతికితే.. ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేస్తారు.. దీని గురించి పర్యవేక్షణ ఉంటుందా..? అనే సందేహాలు తరచూ ప్రయాణికుల్లో వ్యక్తమవుతుంటాయి.

Indian Railways: రైళ్లలో దుప్పట్లను ఎన్నాళ్లకు ఉతుకుతారో తెలుసా..? కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారంటే..
Indian Railways Blankets
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 28, 2024 | 1:30 PM

రైలు ప్రయాణంలో ప్రయాణికులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా.. భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. అయితే.. ఏసీ బోగీల్లో టికెట్ రిజర్వ్ చేసుకుంటే.. రైల్వే శాఖ మరిన్ని సౌకర్యాలను అందిస్తుంది.. ప్రయాణికులకు బెడ్‌షీట్‌లు, దుప్పట్లను అందిస్తుంది.. అయితే ఈ దుప్పట్లను అసలు ఉతుకుతారా? ఉతికితే.. ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేస్తారు.. దీని గురించి పర్యవేక్షణ ఉంటుందా..? అనే సందేహాలు తరచూ ప్రయాణికుల్లో వ్యక్తమవుతుంటాయి. గతంలో దీనిపై అనేక సందర్భాల్లో చర్చలు కూడా జరిగాయి.. అయితే, తాజాగా.. ఈ విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.. లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి దీనికి సవివరంగా సమాధానం ఇచ్చారు. దుప్పట్లను రైల్వే శుభ్రపరుస్తుందా? అంటూ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్ ఎంపీ కుల్దీప్ ఇండోరా అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వ్రాతపూర్వకంగా బదులిచ్చారు.

రైళ్లలో ఉపయోగించే దుప్పట్లను కనీసం నెలకు ఒకసారి ఉతుకుతామని, బ్లాంకెట్ కవర్‌గా ఉపయోగించేందుకు బెడ్‌రోల్ కిట్‌లో అదనపు బెడ్‌షీట్‌ను అందజేస్తామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్‌సభలో తెలిపారు. ప్రాథమిక పరిశుభ్రత ప్రమాణాలకు అనుగుణంగా దుప్పట్ల కోసం ప్రయాణీకులు చెల్లిస్తున్నప్పుడు ఉన్ని దుప్పట్లను నెలకు ఒకసారి మాత్రమే ఉతుకుతారా..? అని కాంగ్రెస్ ఎంపీ కుల్దీప్ ఇండోరా అడిగిన ప్రశ్నకు అశ్విని వైష్ణవ్ బదులిచ్చారు.

అశ్విని వైష్ణవ్.. వ్రాతపూర్వక సమాధానంలో.. “ప్రస్తుత స్పెసిఫికేషన్ల ప్రకారం.. భారతీయ రైల్వేలో ఉపయోగించే దుప్పట్లు తేలికగా ఉంటాయి.. సులభంగా ఉతకవచ్చు.. ప్రయాణీకులకు మొత్తం సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం కోసం మంచి ఇన్సులేషన్‌ను అందిస్తాయి” అంటూ కేంద్రమంత్రి పేర్కొన్నారు.

మెరుగైన నాణ్యతను నిర్ధారించడానికి మెరుగైన BIS స్పెసిఫికేషన్‌లతో కూడిన కొత్త వస్త్రాన్ని (దుప్పట్లు) కొనుగోలు చేయడం.. పరిశుభ్రమైన సెట్‌ల సరఫరాను నిర్ధారించడానికి మెకనైజ్డ్ లాండ్రీలు, ప్రామాణిక యంత్రాలు, ఉతకడానికి నిర్దిష్ట రసాయనాల వినియోగం, వాషింగ్ కార్యకలాపాలను పర్యవేక్షించడంతో సహా ప్రయాణీకుల సౌకర్యం, భద్రత కోసం తీసుకున్న అనేక చర్యలను ఆయన ప్రస్తావించారు.

శుభ్రం చేసిన దుప్పట్లను తనిఖీ చేయడానికి వైట్-మీటర్లు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. గత విధానాల కంటే ప్రస్తుతం మెరుగ్గానే శుభ్రం చేస్తున్నట్లు వైష్ణవ్ చెప్పారు. “రైల్‌మదాద్ పోర్టల్‌లో నమోదైన ఫిర్యాదులపై నార/బెడ్‌రోల్‌పై ఫిర్యాదులతో సహా పర్యవేక్షించేందుకు/సత్వర చర్యలు తీసుకోవడానికి జోనల్ హెడ్‌క్వార్టర్స్, డివిజనల్ స్థాయిలలో వార్ రూమ్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు.

పర్యావరణ అనుకూల ప్యాకేజింగ్‌తో పాటు స్టేషన్‌లు, రైళ్లలో దుప్పట్లు/బెడ్‌రోల్‌లను నిల్వ చేయడానికి, రవాణా చేయడానికి, లోడ్ చేయడానికి, అన్‌లోడ్ చేయడానికి మెరుగైన లాజిస్టిక్స్ ఉపయోగిస్తున్నట్లు కేంద్ర మంత్రి వివరణ ఇచ్చారు.

అయితే.. చాలా మంది దీనిపై పలు రకాలుగా స్పందిస్తున్నారు.. కొంతమంది ప్రతీ ప్రయాణం తర్వాత దుప్పట్లను వాష్ చేయాలని కోరుతుండగా.. పలువురు నెలకొకసారి ఉతికితే చాలంటూ పేర్కొంటున్నారు.. మరికొందరు ఇప్పటివరకు ఈ విషయమే తెలియదు.. నెలకు రెండు సార్లైనా ఉతకాలంటూ సూచిస్తున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వామ్మో.. రూ.కోట్లు సంపాదించి పెడుతున్న రావిచెట్టు.!వీడియో.
వామ్మో.. రూ.కోట్లు సంపాదించి పెడుతున్న రావిచెట్టు.!వీడియో.
వింత ఆచారం.. ఇంటింటా సేకరించిన అన్నాన్ని రాశిగా పోసి.. వీడియో.
వింత ఆచారం.. ఇంటింటా సేకరించిన అన్నాన్ని రాశిగా పోసి.. వీడియో.
ఆసుపత్రిలో మనోజ్! మంచు కుటుంబంలో తుఫాన్.మోహన్‌బాబు తనను కొట్టారని
ఆసుపత్రిలో మనోజ్! మంచు కుటుంబంలో తుఫాన్.మోహన్‌బాబు తనను కొట్టారని
కాంగ్రెస్ ఏడాది పాలనపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
కాంగ్రెస్ ఏడాది పాలనపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
హీరోయిన్ తో టాలీవుడ్ డైరెక్టర్ పెళ్లి.! తిరుమల సన్నిదిలో వివాహం..
హీరోయిన్ తో టాలీవుడ్ డైరెక్టర్ పెళ్లి.! తిరుమల సన్నిదిలో వివాహం..
భారతీయ సినిమా చరిత్రలో పుష్ప 2 ఓ విస్పోటనం.! రుహానీశర్మ కామెంట్స్
భారతీయ సినిమా చరిత్రలో పుష్ప 2 ఓ విస్పోటనం.! రుహానీశర్మ కామెంట్స్
నన్ను అర్థం చేసుకోవడం కష్టం.. వారికైతే మరీ కష్టం! ధనుష్ కామెంట్స్
నన్ను అర్థం చేసుకోవడం కష్టం.. వారికైతే మరీ కష్టం! ధనుష్ కామెంట్స్
కలుస్తూ.. విడిపోతూ.. సీరియల్‌లా సాగుతోంది వీరి జీవితం.! వీడియో..
కలుస్తూ.. విడిపోతూ.. సీరియల్‌లా సాగుతోంది వీరి జీవితం.! వీడియో..
అల్లు అర్జున్ పై ఆర్జీవీ ట్వీట్.. కాంట్రవర్సీ లేకపోతే ఆర్జీవీ ఎలా
అల్లు అర్జున్ పై ఆర్జీవీ ట్వీట్.. కాంట్రవర్సీ లేకపోతే ఆర్జీవీ ఎలా
బన్నీ పై ప్రకాశ్ రాజ్‌ ట్వీట్.. గంగోత్రి నుండి చూస్తున్నా అంటూ..
బన్నీ పై ప్రకాశ్ రాజ్‌ ట్వీట్.. గంగోత్రి నుండి చూస్తున్నా అంటూ..