సంతోషంగా స్నేహితుడి పెళ్లికి వెళ్లాడు.. గిఫ్ట్ ఇస్తూ ఒక్కసారిగా..
మాయదారి గుండెపోటుకు మరో యువకుడు బలైపోయాడు. మహమ్మారిలా మారిన గుండెపోటు వయసుతో సంబంధం లేకుండా క్షణాల్లో ప్రాణాలు హిరిస్తోంది. స్నేహితుడి పెళ్లికి ఎంతో సంతోషంగా వెళ్లిన ఆ యువకుడు మిత్రులందరితో కలిసి వధూవరులకు గిఫ్ట్ ఇస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దాంతో ఎంతో సంతోషంగా జరుగుతున్న వివాహ వేదిక విషాదంగా మారిపోయింది.
నంద్యాల జిల్లా కృష్ణ గిరి మండలం పెనుమడ గ్రామంలో ఓ కళ్యాణ మండపంలో వివాహ వేడుక జరుగుతోంది. బంధుమిత్రులంతా హాజరయ్యారు వివాహ తంతు ముగిసింది. బంధుమిత్రులంతా వధూవరులకు కానుకలు ఇస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈక్రమంలో వరుడి మిత్రబృందం కూడా స్టేజ్‌పైకి చేరింది. వరుడ్ని ఆటపట్టిస్తూ సరదాగా గడిపారు. వరుడికి గిఫ్ట్ ఇచ్చారు. ఈ క్రమంలో గిప్ట్ ఇస్తూ వారిలో వంశీ అనే యువకుడు అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే అలర్టయిన మిగతా స్నేహితులు అతన్ని కాపాడే ప్రయత్నం చేశారు. వెంటనే అతన్ని డోన్ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటిగే జరగకూడనిది జరిగిపోయింది. వంశీ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. అప్పటివరకూ స్నేహితులతో కలిసి ఎంతో ఉత్సాహంగా గడిపిన వంశీ ఒక్కసారిగా నిర్జీవంగా మారిపోవడంతో అందరూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వంశీ బెంగళూరులో అమెజాన్‌లో పనిచేస్తున్నట్టు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒక్క నెలలో.. కోటి మంది కస్టమర్లు గోవిందా
శీతాకాలం సూపర్ ఫుడ్‌గా తేగలు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..
పిల్లల కోసం తిండి మానేస్తున్న తల్లిదండ్రులు
పూజలో మునిగిపోయిన భార్య..పెట్రోలుతో వచ్చిన భర్త ఏం చేశాడంటే..
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

