శీతాకాలం సూపర్ ఫుడ్‌గా తేగలు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..
శీతా కాలం వచ్చిందంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సీజన్‌లో ఎక్కువగా రోగాల బారిన పడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావడం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. కాబట్టి ఈ సీజన్‌లో ప్రత్యేకంగా లభించే కొన్ని రకాల సూపర్ ఫుడ్స్ తీసుకోవాలి. ఇమ్యూనిటీ బలంగా ఉంటే.. ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
కాబట్టి ఈ సీజన్‌లో లభించే ఆహారాలను ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంతకు ముందు రోజుల్లో వీటిని ఎక్కువగా తినేవారు కాబట్టే.. మీ ఇంట్లో పెద్దవాళ్లు ఆరోగ్యంగా ఉండేవారు. చలి కాలం ప్రారంభం కాగానే లభించే వాటిల్లో తేగలు కూడా ఒకటి. దీపావళి పండక్కి ఇవి ఎక్కువగా లభిస్తాయి. దేవుళ్ల ప్రసాదంగా నివేదించి.. అనంతరం వీటిని తింటూ ఉంటారు. ఈ తేగల్లో అనేక రకాల పోషకాలు లభిస్తాయి. వీటిని తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుత కాలంలో చాలా మంది బాధపడే సమస్యల్లో రక్త హీనత కూడా ఒకటి. తేగల్లో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. నేరుగా తిన్నా, ఎండలో ఆరబెట్టి పొడి చేసి.. దానిలో బెల్లం కలిపి తీసుకున్నా మంచిదే. బరువు తగ్గాలి అనుకునేవారు వీటిని డైట్‌లో చేర్చుకుంటే ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి కొద్దిగా తిన్నా కడుపు నిండిపోతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పిల్లల కోసం తిండి మానేస్తున్న తల్లిదండ్రులు
పూజలో మునిగిపోయిన భార్య..పెట్రోలుతో వచ్చిన భర్త ఏం చేశాడంటే..
వీడని డ్రమ్ము భయం.. భార్యలు అడిగింది ఇచ్చేస్తున్న భర్తలు
ఆ ఊర్లోకి ఐస్‌క్రీం బండి వెళ్లాలంటే హడల్
భారీగా పెరిగిన జొమాటో ప్లాట్‌ఫామ్ ఫీజు
గ్యాస్ ఎందుకు దండగా.. డీజిల్ ఉండగా.. ఆహా.. వాట్ యాన్ ఐడియా
బోల్తా పడ్డ లారీ.. సంతోషం తో పరుగులు తీసిన జనం
సీసీ కెమెరాలోనే రోజూ కూతుర్ని పలకరిస్తున్న అమ్మానాన్న
గ్యాస్ కష్టాలకు 'రాకెట్' పరిష్కారం..

