పూజలో మునిగిపోయిన భార్య..పెట్రోలుతో వచ్చిన భర్త ఏం చేశాడంటే..
అతి ఎప్పుడూ అనర్ధానికి హేతువు అంటారు. ఓ మహిళ అతిభక్తి తన ప్రాణాలమీదకు తెచ్చింది. నిత్యం పూజల్లో గడుపుతూ ఇంటిని పట్టించుకోవడంలేదన్న కోపంతో ఆమె భర్త భార్యపై పెట్రోలు పోసి బెదిరించాలనుకున్నాడు. కానీ అతని ప్లాన్ బెడిసి కొట్టి ఇద్దరినీ ప్రమాదంలో పడేసింది.
పూజగదిలో ఉన్న భార్యపై పెట్రోలు పోయగానే పక్కనే దీపం ఉండటంతో వెంటనే మంటలు అంటుకొని ఇద్దరూ మంటల్లో చిక్కుకున్నారు. తమిళనాడులోని తిరువెరుమూర్‌లో జరిగిందీ ఘటన. రాజేంద్రప్రసాద్ , హిమబిందు భార్యాభర్తలు. దైవంపై ఎనలేని విశ్వాసం పెంచుకున్న బిందు నిత్యం పూజల్లోనే గడిపేది. దీంతో పూజల్లో పడి కుటుంబాన్ని పట్టించుకోవడం లేదంటూ ప్రసాద్ ఆమెతో గొడవపడేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి 11 గంటల సమయంలో బిందు ప్రార్థనలు ప్రారంభించింది. ఈ సమయంలో పూజలు ఏంటంటూ ప్రసాద్ ఆమెపై కోప్పడ్డాడు. ఇది ఇద్దరి మధ్య వాగ్వివాదానికి దారితీసింది. అది మరింత పెరగడంతో కోపం పట్టలేని ప్రసాద్ బైక్ కోసం సీసాలో తెచ్చిపెట్టుకున్న పెట్రోలును ఆమెపై పోశాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న పూజా దీపం ఆమెకు అంటుకోవడంతో మంటలు చెలరేగాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సెంట్రల్ జైల్లో ఖైదీల రాజభోగాలు..!
కళ్లు చెదిరేంత బంగారం దొరికినా కన్నెత్తి చూడలేదు..
అక్కను వేధిస్తున్నాడని బావను చంపిన బావమరుదులు
పేకాట రాయుళ్లకు కోర్టు.. శ్రీకాకుళం కోర్ట్ వినూత్న శిక్ష
ప్రేమించలేదని పగబట్టి.. జైలు పాలైన లేడీ కిలాడీ
వెబ్సైట్లు,యూట్యూబ్లో సెర్చ్ చేసి అత్తను హత్య చేసిన కోడలు
ఫేక్ ర్యాపిడో యాప్తో క్యాబ్ డ్రైవర్ మోసం

