పిల్లల కోసం తిండి మానేస్తున్న తల్లిదండ్రులు
కెనడాలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెను సవాలుగా మారాయి. తల్లిదండ్రుల్లో 24 శాతం మంది తమ పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టడం కోసం తాము తినడం తగ్గించుకుంటున్నారు. సాల్వేషన్ ఆర్మీ అనే సంస్థ విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు తెలిసాయి. ఇతర ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి పొదుపు చేయడం కోసం కిరాణా సరుకుల ఖర్చును తగ్గించుకుంటున్నామని సర్వేలో పాల్గొన్నవారిలో 90 శాతం మంది చెప్పారు.
ఆర్థిక బాధ్యతలను నెరవేర్చడం కోసం తల్లిదండ్రులు తమ ఆహారాన్ని, నిత్యావసరాలను త్యాగం చేస్తున్నారు. కెనడాలో ఉచితంగా ఆహారాన్ని పంపిణీ చేసే ఫుడ్ బ్యాంకుల్లో కూడా ఆహార కొరత ఉంది. దీంతో కొన్ని ఫుడ్ బ్యాంకులు అంతర్జాతీయ విద్యార్థులకు ఆహారాన్ని ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాయి. భారతీయ విద్యార్థులు కూడా ఈ బాధితుల్లో ఉన్నారు. కిరాణా సరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో జీవన వ్యయం భారీగా పెరిగింది. తమ పిల్లలకు తగినంత ఆహారం అందించడం కోసం తాము తిండి తగ్గించుకున్నామని 24 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు. పోషక విలువలు తక్కువగా ఉండే ఆహారం కాస్త చౌకగా లభిస్తుండటంతో దానినే కొంటున్నట్లు తెలిపారు. ఒక పూట తింటే, మరో పూట తినడం మానేస్తున్నట్లు 84 శాతం మంది చెప్పారు. కెనడాలో ఆర్థిక సంక్షోభానికి సంకేతం ఇదొక్కటే కాదు. ఈ సంక్షోభ సమయంలో కెనడియన్లు ఎలా జీవించగలుగుతున్నారోనని చాలా మంది సోషల్ మీడియాలో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పూజలో మునిగిపోయిన భార్య..పెట్రోలుతో వచ్చిన భర్త ఏం చేశాడంటే..
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

