Andhra Pradesh: బైక్ కొనివ్వాలంటూ మంకు పట్టుపట్టిన యువకుడు.. తల్లిదండ్రులు లేని సమయంలో ఏం చేశాడంటే..?

చిన్నపిల్లాడిలా చాక్లెట్ల కోసం మారాం చేసినట్టు.. బైక్ కోసం రోజూ తల్లిదండ్రులతో గొడవ పడుతున్నాడని స్థానికులు చెబుతున్నారు.

Andhra Pradesh: బైక్ కొనివ్వాలంటూ మంకు పట్టుపట్టిన యువకుడు.. తల్లిదండ్రులు లేని సమయంలో ఏం చేశాడంటే..?
Young Man For Bike
Follow us
Nalluri Naresh

| Edited By: Balaraju Goud

Updated on: Nov 28, 2024 | 1:26 PM

చిన్న చిన్న విషయాలకు యువత నిండు జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. చిన్నపాటి మనస్పర్థలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా అనంతపురంలో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడి తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చాడు. బైక్ కొనివ్వలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని రొద్దం మండలం రాచూరు గ్రామానికి చెందిన శబరి(22) అనే యువకుడు తనకు బైక్ కావాలని గత కొద్ది రోజులుగా తల్లిదండ్రులను అడుగుతున్నాడు. వ్యవసాయం చేసుకుంటూ అరకొర ఆదాయంతో జీవనం సాగిస్తున్న తల్లిదండ్రులు కొడుకు కోరికను సున్నితంగా తిరస్కరించారు. తల్లిదండ్రులు కొడుకు శబరికి బైక్ కొనివ్వలేమని ఎంతో నచ్చచెప్పారు.

అయితే, గత కొద్ది రోజులుగా యువకుడు శబరి బైక్ కొనివ్వాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొచ్చాడు. ఉన్న పళంగా బైక్ కొనివ్వమంటే అంత ఆర్థిక స్తోమత లేదని, బైక్ కొనివ్వలేమని కొడుకుకు తేల్చి చెప్పారు. దీంతో బైక్ కొనివ్వలేదన్న మనస్థాపంతో… క్షణికావేశంలో ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో శబరి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతనిని గమనించిన స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.

చిన్నపిల్లాడిలా చాక్లెట్ల కోసం మారాం చేసినట్టు.. బైక్ కోసం రోజూ తల్లిదండ్రులతో గొడవ పడుతున్నాడని స్థానికులు చెబుతున్నారు. చదువు సరిగా అబ్బక.. సెంట్రింగ్ పని చేస్తున్న కొడుకు శబరి.. ఒక బైక్ కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

సాధారణ ప్రయాణికులకు కష్టాలు తప్పినట్లేనా.. జనరల్ బోగీల పెంపు
సాధారణ ప్రయాణికులకు కష్టాలు తప్పినట్లేనా.. జనరల్ బోగీల పెంపు
పుష్ప 2 స్ట్రీమింగ్‌కు వచ్చేది ఆ ఓటీటీలోనే.. డీల్ ఎన్ని కోట్లంటే?
పుష్ప 2 స్ట్రీమింగ్‌కు వచ్చేది ఆ ఓటీటీలోనే.. డీల్ ఎన్ని కోట్లంటే?
ఫీచర్స్‌తో టాప్ రేపుతున్న స్మార్ట్ ఫోన్లు..!
ఫీచర్స్‌తో టాప్ రేపుతున్న స్మార్ట్ ఫోన్లు..!
ప్రతి టికెట్‌పై రైల్వేశాఖ ఎంత సబ్సిడీ ఇస్తుందో తెలుసా..?
ప్రతి టికెట్‌పై రైల్వేశాఖ ఎంత సబ్సిడీ ఇస్తుందో తెలుసా..?
కొత్త ఏడాదికి అద్భుతంగా వెల్కం చెప్పాలంటే ఈప్లేసెస్ బెస్ట్ ఎంపిక
కొత్త ఏడాదికి అద్భుతంగా వెల్కం చెప్పాలంటే ఈప్లేసెస్ బెస్ట్ ఎంపిక
డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్కయిన నటుడి పుత్రరత్నం..
డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్కయిన నటుడి పుత్రరత్నం..
పిల్లలకు చాయ్‌ తాగిస్తున్నారా ?? ఈ వీడియో చూడండి
పిల్లలకు చాయ్‌ తాగిస్తున్నారా ?? ఈ వీడియో చూడండి
ఒకే చోట గంటల కొద్దీ కూర్చునేవారికి.. షాకింగ్‌ న్యూస్‌
ఒకే చోట గంటల కొద్దీ కూర్చునేవారికి.. షాకింగ్‌ న్యూస్‌
రైలుకు ఎదురుగా బైక్‌పై దూసుకెళ్లిన వ్యక్తి.. సరిగ్గా అదే సమయంలో
రైలుకు ఎదురుగా బైక్‌పై దూసుకెళ్లిన వ్యక్తి.. సరిగ్గా అదే సమయంలో
'మా ఆడబిడ్డల చదువును అడ్డుకోవద్దు'.. తాలిబన్లపై రషీద్ ఖాన్ ఆగ్రహం
'మా ఆడబిడ్డల చదువును అడ్డుకోవద్దు'.. తాలిబన్లపై రషీద్ ఖాన్ ఆగ్రహం