Andhra Pradesh: ప్రభుత్వాస్పత్రిలో మాయమవుతున్న శవాలు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!

మార్చురీలో శవాల మాయానికి సంబంధించి అసిస్టెంట్‌ అశోక్‌పై ఏలూరు టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో అతన్ని విధుల నుంచి తొలగించారు.

Andhra Pradesh: ప్రభుత్వాస్పత్రిలో మాయమవుతున్న శవాలు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!
Eluru Government Hospital
Follow us
B Ravi Kumar

| Edited By: Balaraju Goud

Updated on: Nov 28, 2024 | 8:44 AM

ఏలూరు ప్రభుత్వాస్పత్రిలోని అనాథ శవాల మాయం వ్యవహారంలో ఉచ్చు బిగుస్తోంది. మెడికల్‌ బోర్డు అధికారుల బృందం విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి రావడం షాకిస్తోంది.

ఏలూరు ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీలో మృతదేహాల మాయం కేసు ప్రకంపనలు రేపుతోంది. దీనికి సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషవ్ టీమ్‌ విచారణ వేగవంతం చేసింది. డీఎంఈ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ స్థాయి అధికారితోపాటు మెడికల్‌ కాలేజ్‌ ప్రిన్సిపల్‌ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. మార్చురీలోని మృతదేహాల మాయం వ్యవహారంపై డీఎంఈ సీనియర్‌ వైద్యాధికారి వెంకటేశ్‌ తన బృందంతో ఏలూరు ప్రభుత్వ వైద్యకళాశాలలో విచారణ చేశారు.

ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో అనాథ శవాలను వేర్వేరు ప్రాంతాలకు విక్రయించిన వ్యవహారంపై ఫోకస్‌ పెట్టారు. మార్చురీలోని రికార్డులతోపాటు సీసీ ఫుటేజ్‌ను ఆరా తీశారు. ఈ క్రమంలోనే.. రిజిస్టర్‌లో కొన్ని పేజీలను ఇటీవల చించివేసినట్లు ఆరోపణలు రావడంతో దానిపైనా విచారించారు. ప్రధానంగా.. మార్చురీ ఇన్‌ఛార్జ్‌, ఆ విభాగంతో సంబంధాలున్న ఇతర అధికారులు, పనిచేసే సిబ్బందినీ వేర్వేరుగా ఎంక్వైరీ చేశారు.

ఆస్పత్రిని మెడికల్‌ కాలేజ్‌కు అనుసంధానం చేసిన తర్వాత మార్చురీలో ఎన్ని అనాథ శవాలున్నాయి? ఎన్నింటిని ఖననం చేశారు? లెక్కల్లోకి రానివి ఎన్ని?.. అనే అంశాలపై విచారణ చేసి కీలక విషయాలు రాబట్టారు. ఇప్పటికే.. అక్టోబర్ 8న రాత్రి మార్చురీలోని అసిస్టెంట్ అశోక్ ఒక అనాథ మృతదేహాన్ని అంబులెన్స్‌లో బయటకు తీసుకువెళ్ళినట్లు తేలింది. శవం మాయంపై డ్యూటీలోని మరో మార్చురీ అసిస్టెంట్ గుర్తించి సంబంధిత హెచ్‌వోడీకి ఫిర్యాదు చేయడంతో గుట్టురట్టు అయింది. దాంతో.. బయటకు వెళ్లిన మృతదేహాన్ని వెనక్కి రప్పించి మార్చురీలో పెట్టారు.

అయితే.. మార్చురీలో శవాల మాయానికి సంబంధించి అసిస్టెంట్‌ అశోక్‌పై ఏలూరు టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో అతన్ని విధుల నుంచి తొలగించారు. తాజాగా.. శవాల మాయం వ్యవహారంలో మరికొందరి పాత్ర ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఆ కోణంలోనూ విచారిస్తున్నారు మెడికల్‌ అధికారులు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..