Tollywood: అటు డాక్టర్.. ఇటు క్రేజీ హీరోయిన్.. హాట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్ ఈ అమ్మడు.. ఎవరో తెలుసా..
సోషల్ మీడియాలో ఓ ముద్దుగుమ్మ ఫోటో తెగ హల్చల్ చేస్తుంది. ఇన్నాళ్లు కథానాయికగా వెండితెరపై సందడి చేసిన ఈ అమ్మడు.. మరోవైపు వైద్యురాలిగా సేవలు అందిస్తుంది. అలాగే సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో కుర్రాళ్లకు వెర్రెక్కిస్తోంది ఈ వయ్యారి. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా.. ?
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది డాక్టర్స్ కమ్ యాక్టర్స్ ఉన్నారు. అటు ఎంబీబీఎస్ చదువుతూ ఇటు హీరోయిన్లుగా వెండితెరపై సందడి చేస్తున్నారు. తెలుగు చిత్రపరిశ్రమలో అందం, అభినయంతో కట్టిపడేస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన్ క్రేజీ ఫోటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పైన ఫోటోస్ చూస్తున్నారు కదా.. అందులో కనిపిస్తున్న హీరోయిన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా ఫేమస్. ఇన్నాళ్లు హీరోయిన్ గా వరుస సినిమాలతో అలరించిన ఆ అమ్మాయి డాక్టర్ అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. వరుస ఆఫర్స్ అందుకుంటూ నటిగా ప్రశంసలు సొంతం చేసుకుంటుంది. అలాగే అటు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తుంది. ఇతంకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? తనే కామాక్షి భాస్కర్ల. ఇండస్ట్రీలో ఛాలెంజింగ్ రోల్స్ పోషిస్తూ సత్తా చాటుతున్న అచ్చ తెలుగమ్మాయి.
2018లో మిస్ తెలంగాణగా నిలిచిన కామాక్షి.. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది. అంతకు ముందు చైనాలో ఎంబీబీఎస్ చేసి అపోలో ఆసుపత్రిలో కొన్నాళ్లుగా డాక్టర్ గా పనిచేసింది. ప్రియురాలు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కామాక్షి.. ఆ తర్వాత మా ఊరి పొలిమేర సినిమాతో మరింత పాపులర్ అయ్యింది. ఈ మూవీతో కామాక్షికి మంచి గుర్తింపు వచ్చింది. దీంతో తెలుగులో మరిన్ని ఆఫర్స్ వచ్చాయి. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, విరూపాక్ష, పొలిమేర 2, ఓం భీమ్ బుష్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. పాత్ర ప్రాధాన్యత , విభిన్నమైన కంటెంట్ కథలను ఎంచుకుంటుంది.
కామాక్షికి నటిగా గుర్తింపు తెచ్చిపెట్టిన చిత్రాలు మా ఊరి పొలిమేర, పొలిమేర 2 . స్టార్ డమ్ కాకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు ఎంచుకుంటూ సహజ నటనతో ప్రశంసలు అందుకుంది. ఝాన్సీ, సైతాన్, దూత వంటి వెబ్ సిరీస్ చేసి అలరించింది. ఎక్కుగా ఢీగ్లామర్స్ రోల్స్ పోషిస్తుంది కామాక్షి. కానీ నెట్టింట మాత్రం గ్లామర్ ఫోటోలతో మెంటలెక్కిస్తోంది.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.