రిలీజ్ అయిన 20 రోజుల్లోనే OTTకి వచ్చిన నిఖిల్ కొత్త సినిమా
‘స్వామి రారా’, ‘కేశవ’ సినిమాలతో సూపర్ హిట్ కాంబోగా పేరు తెచ్చుకున్నారు నిఖిల్- సుధీర్ వర్మ. ఇప్పుడు వీరి కలయికలోనే వచ్చిన చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. సప్త సాగరాలు దాటి సినిమాతో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకున్న రుక్మిణి వసంత్ ఈ సినిమాలో కథానాయికగా నటించింది. కరోనా కాలంలో పట్టాలెక్కిన ఈ మూవీ ఎన్నో అవాంతరాలు దాటి.. కనీసం ప్రమోషన్స్ కూడా లేకుండానే.. నవంబర్ 08న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఆడియన్స్‌ను మెప్పించలేకపోయింది. ఇక ఇప్పుడేమో…ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా లేకుండా… సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఇక నిఖిల్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో నవంబర్ 27 అర్ధరాత్రి నుంచే నిఖిల్ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. నిఖిల్-రుక్మిణీల జోడీకి మంచి పేరొచ్చినప్పటికీ ఆకట్టుకునే కథ, కథనాలు సినిమాలో లేకపోవడంతో ఆడియన్స్ పెదవి విరిచారు. ఫలితంగా స్పై సినిమా తర్వాత నిఖిల్ ఖాతాలో మరో ఫ్లాప్ చేరింది. థియేటర్లలో ఆడియన్స్ ను నిరాశపర్చిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమా ఇప్పుడు సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Top 9 ET News: పుష్ప2కు రూ.300 కోట్ల రెమ్యూనరేషన్ మనోడే టాప్
Priyanka Jain: తిరుమలలో ప్రియాంక ప్రాంక్ వీడియో !! హెచ్చరించిన భక్తులు
Subbaraju: 47ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న సుబ్బరాజ్
చైతూ, శోభిత పెళ్లి డిజిటల్ రైట్స్ పై ప్రచారం క్లారిటీ ఇచ్చిన నాగ్ టీం
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది
"పాలక్ పనీర్" దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ
రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి
కేజీ బంగారు నిధి కేసులో బిగ్ ట్విస్ట్..కుటుంబ సభ్యులకు పండగే పండగ
దారం లేని పతంగ్ చూసారా? ఎలా ఎగురుతుందంటే..
20 అడుగుల ఎత్తుతో భారీ బాహుబలి భోగిమంట.. వీడియో

