పిచ్చి మొక్క అనుకునేరు.. డయాబెటిస్‌కు బ్రహ్మాస్త్రం

28 November 2024

Ravi Kiran

ఇంటి పెరట్లో అనేక రకాల మొక్కలు పెంచుకోవడం చాలా మందికి అలవాటు. వీటిల్లో పారిజాతం మొక్కను తప్పనిసరిగా పెంచుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

ఎందుకంటే ఈ మొక్కలోని ప్రతి భాగం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నేటి కాలంలో గ్రామాల్లోనే కాకుండా అనేక పట్టణ నివాసుల ఇళ్లలో కూడా ఈ మొక్కలు కనిపిస్తాయి. 

ఈ రకమైన మొక్కలను ఇంటి బాల్కనీలో పెంచడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన మొక్కల్లో పారిజాత ఒకటి. 

కొందరు దీనిని రాత్రి మల్లె అని కూడా పిలుస్తారు. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు 

పారిజాత మొక్కలోని పూలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తాయి. టైప్ 2 డయాబెటిస్ చికిత్సలో వీటిని ఉపయోగిస్తారని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

ఈ పువ్వులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. రాత్రి సమయంలో పారిజాత పుష్పాలను నీటిలో వేసి బాగా మరిగించాలి.

నీటిని వడకట్టి మరుసటి రోజు మధ్యాహ్నం, సాయంత్రం ఆ నీటిని తాగాలి. ఇలా తాగితే షుగర్ లెవెల్ అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.