AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uterine Problem: కడుపు నొప్పి, జ్వరం, విపరీతమైన అలసట.. ఈ లక్షణాలు మీలో కూడా ఉన్నాయా?

కొంత మంది అమ్మాయిల్లో కడుపు నొప్పి, జ్వరం, విపరీతమైన అలసట.. వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. కానీ వీటిని పెద్దగా పట్టించుకోరు. దీంతో అవి కాలక్రమంలో పెద్ద పెద్ద అనర్ధాలకు దారి తీస్తాయని చాలా మందికి తెలియదు..

Uterine Problem: కడుపు నొప్పి, జ్వరం, విపరీతమైన అలసట.. ఈ లక్షణాలు మీలో కూడా ఉన్నాయా?
Uterine Problem
Srilakshmi C
|

Updated on: Nov 28, 2024 | 12:52 PM

Share

మహిళల శరీరంలో గర్భాశయం చాలా ముఖ్యమైన అవయవం. గర్భధారణ సమయంలో పిండాన్ని రక్షించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అయితే కొన్నిసార్లు గర్భాశయంలో సమస్యలు సంభవిస్తుంటాయి. ఇది మహిళలకు చాలా ప్రమాదకరం. ఈ విధమైన సమస్యలను ఎప్పుడూ విస్మరించకూడదు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే, వైద్యుడిని సంప్రదించాలి. గర్భాశయంలో ఎలాంటి సమస్యలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..

గర్భాశయ వాపు

బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల గర్భాశయ వాపు వస్తుంది. ఈ సమమ్య ఉన్నవారిలో సాధారణంగా కడుపు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు సంభవించవచ్చు. ఇలాంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదు.

గర్భాశయ పాలిప్స్

మహిళల్లో గర్భాశయ పాలిప్స్ అనేది గర్భాశయం గోడపై సంభవించే సమస్యలు. వీటి వల్ల క్రమరహిత పీరియడ్స్, అధిక పొత్తికడుపు నొప్పి వస్తుంటాయి. అలాగే కారణం లేకుండా అలసిపోయినట్లుగా మీకు అనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి.

ఇవి కూడా చదవండి

ఫైబ్రాయిడ్స్

ఇది గర్భాశయ వ్యాధి. దీనిలో గర్భాశయం లోపల లేదా వెలుపల గడ్డలు ఏర్పడతాయి. వీటిని ట్యూమర్స్ అంటారు. దీని కారణంగా రుతుక్రమంలో ఆటంకాలు, రక్తహీనత వంటి సమస్యలు కనిపిస్తాయి. ఈ సమస్య ఉన్నవారు వంధ్యత్వాన్ని కూడా ఎదుర్కోవచ్చు. అందుకే ఈ సమస్యలను విస్మరించకూడదు.

ఎండోమెట్రియోసిస్

గర్భాశయంలోని పొరను ఎండోమెట్రియం అంటారు. ఇది పీరియడ్స్ సమయంలో రక్తం రూపంలో శరీరం నుంచి బయటకు వస్తుంది. సాధారణంగా పీరియడ్స్ సమయంలో వచ్చే రక్తం అండాశయంలోని కటి కుహరం కణజాలం నుంచి రక్తం బయటకు వస్తుంది. అయితే ఇందుకు బదులు ట్యూబ్ లోపల రక్తం పేరుకుపోవడంతో గర్భధారణ సమయంలో సమస్యలు వస్తాయి. ప్రపంచంలోని ప్రతి 10 మంది మహిళల్లో ఒకరికి ఈ సమస్య ఉన్నట్లు చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది వంధ్యత్వం వంటి సమస్యలను కలిగిస్తుంది.

గర్భాశయ సమస్యల చికిత్స..

గర్భాశయం వాపు లేదా సంక్రమణ చికిత్సకు వైద్యులు యాంటీబయాటిక్స్‌ సూచిస్తారు. గర్భాశయ పాలిప్స్ లేదా కణితులను శస్త్రచికిత్సతో నయం చేయవచ్చు. ఇలాంటి సమస్యలకు వైద్యులు స్త్రీలకు హార్మోన్ల మందులను కూడా సూచిస్తుంటారు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్‌ చేయండి.