AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC 2025-27: ఇంగ్లాండ్‌తో ఓటమి.. డబ్ల్యూటీసీలో ఆసీస్‌కు గట్టి షాక్.. భారత్ అవుట్.!

ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ సిరీస్‌లోని నాలుగో టెస్ట్‌లో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌తో 2025-27 ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి మరి.

WTC 2025-27: ఇంగ్లాండ్‌తో ఓటమి.. డబ్ల్యూటీసీలో ఆసీస్‌కు గట్టి షాక్.. భారత్ అవుట్.!
Aus Vs Eng
Ravi Kiran
|

Updated on: Dec 28, 2025 | 7:54 AM

Share

యాషెస్ సిరీస్‌లోని నాలుగో టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఓటమితో ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్( WTC) 2025-27 సైకిల్ పాయింట్ల పట్టికలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్‌లో ఇంగ్లాండ్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 14 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియాలో మొదటి టెస్ట్ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. దీని ఫలితంగా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియాకు గట్టి షాక్ తగలగా.. ఇంగ్లాండ్ పెద్దగా లభాపడలేదు.

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక ఇలా..

ఈ విజయంతో ఇంగ్లాండ్ పాయింట్ల శాతం 27.08 నుంచి 35.19కి పెరిగింది. ఇంత శాతం పెరిగినా ఆ జట్టు ఇంకా ఏడో స్థానంలో కొనసాగుతోంది. మొత్తం తొమ్మిది మ్యాచ్‌లు ఆడి మూడింట మాత్రమే గెలిచింది ఇంగ్లాండ్. ఐదు మ్యాచ్‌లు ఓడిపోయి ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. మరోవైపు ఆస్ట్రేలియా ఈ సైకిల్‌లో తొలి ఓటమిని చవిచూసింది. మొదటి ఆరు మ్యాచ్‌లు గెలిచిన తర్వాత 100 పర్సెంట్‌తో ఉన్న కంగారూలు.. ఇప్పుడు 85.71 శాతంతో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నారు. న్యూజిలాండ్ 77.78 పాయింట్ల శాతంతో రెండవ స్థానంలో ఉండగా.. దక్షిణాఫ్రికా నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో మూడో స్థానంలో ఉంది. శ్రీలంక 66.67 పాయింట్ల శాతంతో నాలుగో స్థానంలో.. పాకిస్తాన్ 50 పాయింట్ల శాతంతో ఐదో స్థానంలో ఉంది . టీమిండియా 48.15 పాయింట్ల శాతంతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్‌లు ఆడి, నాలుగు గెలిచి, నాలుగు ఓడి, ఒక మ్యాచ్ డ్రాగా ముగించుకుంది. అలాగే టీమిండియా తన తదుపరి మ్యాచ్‌ల్లో దాదాపుగా అన్ని గెలిస్తేనే.. ఫైనల్ చేరుతుంది. అది అసాధ్యమంటున్నారు క్రికెట్ నిపుణులు.

తక్కువ స్కోరుతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ గెలుపు..

మెల్‌బోర్న్ పిచ్‌పై లోస్కోరింగ్ మ్యాచ్ జరిగింది. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకు, రెండో ఇన్నింగ్స్‌లో 132 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లాండ్ 6 వికెట్ల నష్టానికి 175 పరుగుల లక్ష్యాన్ని చేరుకుంది. ఫాస్ట్ బౌలర్లు ఆధిపత్యం చెలాయించిన ఈ పిచ్‌పై వికెట్లు త్వరతగిన పడ్డాయి. అయితే నాలుగో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ బలమైన పునరాగమనం చేయడంతో అద్భుత విజయాన్ని అందుకుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి

Follow Us
బిగ్ బాస్ హౌస్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టిన యాంకర్ రవి
బిగ్ బాస్ హౌస్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టిన యాంకర్ రవి
ప్రధాన గ్రహాల అనుకూలత..ఇక ఆ రాశులకు గోల్డెన్ టైమ్ మొదలైనట్టే..!
ప్రధాన గ్రహాల అనుకూలత..ఇక ఆ రాశులకు గోల్డెన్ టైమ్ మొదలైనట్టే..!
సబ్బు ముక్కలను చెత్తలో వేస్తున్నారా?.. వీటి బెనిఫిట్స్ తెలుసా?
సబ్బు ముక్కలను చెత్తలో వేస్తున్నారా?.. వీటి బెనిఫిట్స్ తెలుసా?
ఈ తేదీల్లో పుట్టినవారి ఇగో చాలా ఎక్కువ… మీరు కూడా వీరిలో ఉన్నారా?
ఈ తేదీల్లో పుట్టినవారి ఇగో చాలా ఎక్కువ… మీరు కూడా వీరిలో ఉన్నారా?
జిమ్ అక్కర్లేదు..ఇంట్లోనే ఈ 5 వ్యాయామాలు చేయండి! ఆర్మ్ ఫ్యాట్
జిమ్ అక్కర్లేదు..ఇంట్లోనే ఈ 5 వ్యాయామాలు చేయండి! ఆర్మ్ ఫ్యాట్
త్రివిక్రమ్ సంచలన నిర్ణయం.. ఇకపై ఆ సినిమాలు చేయరా
త్రివిక్రమ్ సంచలన నిర్ణయం.. ఇకపై ఆ సినిమాలు చేయరా
సరికొత్త గజకేసరి యోగం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి..!
సరికొత్త గజకేసరి యోగం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి..!
ఆధార్ కార్డు ఉంటే అకౌంట్లోకి రూ.50 వేలు.. అందరికీ..
ఆధార్ కార్డు ఉంటే అకౌంట్లోకి రూ.50 వేలు.. అందరికీ..
పార్ట్ 3 పై కన్‌ఫ్యూజన్‌.. ఎందుకు ఆగుతున్నట్టు ??
పార్ట్ 3 పై కన్‌ఫ్యూజన్‌.. ఎందుకు ఆగుతున్నట్టు ??
అరటి తొక్కతో ఈ రెసిపీలు చేస్తే నోట్లో నీళ్లూరడం ఖాయం.. !
అరటి తొక్కతో ఈ రెసిపీలు చేస్తే నోట్లో నీళ్లూరడం ఖాయం.. !