- Telugu News Photo Gallery Amazing Health benefits of Barley Water and how to make it wonder detox drink in Telugu
ఈ నీరు అమృతం కన్నా ఎక్కువే.. షుగర్ సహా అనేక సమస్యలకు ఛూమంత్రం.. అస్సలు వద్దనకండి
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, కాలేయాన్ని నిర్విషీకరణ చేయడానికి చాలా మంది ఇప్పుడు డిటాక్స్ పానీయాలపై ఆధారపడుతున్నారు. అయితే.. ఈ నీటిలో కాల్షియం, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, జింక్, కాపర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉన్నాయి.. దీంతో శరీరానికి బోలెడన్ని ప్రయోజనాలు లభిస్తాయి..
Updated on: Nov 28, 2024 | 2:10 PM

భారతదేశంలో బార్లీ ట్రెండ్ కొత్తది కాదు. కానీ ఈ ధాన్యాన్ని ఉపయోగించి డిటాక్స్ వాటర్ తయారు చేసే విధానం కాస్త ఆధునికమైనది. కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.. బార్లీ ఆరోగ్యంగా ఉంచడంతోపాటు శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. బార్లీ నీటిలో కాల్షియం, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, జింక్, కాపర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉన్నాయి.. దీంతో శరీరానికి బోలెడన్ని ప్రయోజనాలు లభిస్తాయి.. బార్లీ నీళ్లు రెగ్యులర్‌గా తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి.. వాస్తవానికి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, కాలేయాన్ని నిర్విషీకరణ చేయడానికి చాలా మంది ఇప్పుడు డిటాక్స్ పానీయాలపై ఆధారపడుతున్నారు. అలాంటి డిటాక్స్ డ్రింక్స్ లో బార్లీ నీరు కూడా ఒకటి.. బార్లీతో చేసిన నీరు ఇది.. బార్లీ గింజలను రాత్రంతా నానాబెట్టి మరిగించి ఆ నీటిని తాగాలి.. లేదా బార్లీ పొడిని నేరుగా మరిగించి తాగాలి.. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.

బార్లీ నీరు ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్ వంటి పోషకాలతో నిండి ఉంటుంది. రెగ్యులర్ గా గ్యాస్-హార్ట్ బర్న్ సమస్యలతో బాధపడేవారు ఈ బార్లీ నీటిని తాగవచ్చు.. ఇది ఫైబర్ కలిగి ఉంటుంది.. ఇది మంచి జీర్ణ ఆరోగ్యాన్ని నిర్వహించడానికి, మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. డీహైడ్రేషన్ ప్రమాదాన్ని దూరం చేస్తుంది.

Barley Water

బరువు తగ్గాలనుకున్న వారు బార్లీ నీరు రెగ్యులర్ గా తాగితే మంచి ఫలితం ఉంటుంది.. అలాగే ఉదయం, మధ్యాహ్నం జిమ్‌కి వెళ్లేవారు బార్లీ వాటర్‌ను తాగవచ్చు. బార్లీ చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను గ్రహిస్తుంది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

అధిక రక్తపోటుతో బాధపడుతుంటే బార్లీ నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది.. బార్లీ నీరు అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. దానితో పాటు మీరు ఉపయోగించే ఉప్పు పరిమాణాన్ని తగ్గించాలి. ఇది కిడ్నీ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

బార్లీలో ఫైబర్ అధికంగా ఉన్నందున, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. అంటే మధుమేహం సమస్యతో బాధపడేవారు బార్లీ వాటర్ కూడా తీసుకోవచ్చు.. అంతేకాకుండా, బార్లీలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉపయోగకరంగా ఉంటుంది.




