దోమల బాధ? ఈ మొక్కలు పెంచి చూడండి

28 November 2024

TV9 Telugu

ఇంట్లో దోమలు ఉంటె డెంగ్యూ, మలేరియా లాంటి అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతాయి. వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

కాస్త మురుగు ఉంటే చాలు దోమలు ముసురుకుంటూ ఉంటాయి. చలికాలంలో అయితే ఫ్యాన్‌ వేస్తే ఒక బాధ వేయకుంటే దోమల రొద. కుట్టి కుట్టి చంపేస్తాయి.

ఇంటి ముందు, వెనుక, బాల్కనీలో కొన్ని రకాల మొక్కలు పెంచితే దోమలు రావు. దోమల మందులు, మస్కిటో కాయిల్స్‌ వల్ల వచ్చే అనారోగ్య సమస్యలూ ఉండవు.

దోమలను పారదోలే మొక్కల్లో లావెండర్‌ ఒకటి. దీని సువాసన మానసిక ఆందోళనను తగ్గిస్తుంది. మంచి నిద్రకూ తోడ్పడతుంది.

సిట్రొనెల్లా గ్రాస్‌ కూడా దోమలను దరి చేరనివ్వదు. ఈ నిమ్మగడ్డి ఇతర కీటకాలనూ దూరంగా ఉంచుతుంది. మంచి సువాసననూ ఇస్తుంది.

క్యాట్నిప్‌ మొక్కలు కూడా దోమలకు శత్రువులే. బెసిల్‌ జాతికి చెందిన తులసి, ఇతర మొక్కలు కూడా దోమలు, కీటకాలను దూరం పెడతాయి.

మన ఇంటి పెరట్లో, బాల్కనీలలో బంతి పూల మొక్కలను పెంచడం వల్ల ప్రయోజనం ఉంటుంది. పైగా పూలతో అందం, అలంకరణకూ వాడుకోవచ్చు.

రోజ్‌ మేరీ అయితే దోమలను దూరంగా ఉంచడమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలనూ అందిస్తుంది తల వెంట్రుకలు రాలిపోకుండా చూస్తుంది.