AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bulletproof Coffee: బుల్లెట్‌ప్రూఫ్ కాఫీ అంటే ఏమిటి? బరువు తగ్గడంలో ఇది ఎలా సహాయపడుతుందో తెలుసా..!

బరువు తగ్గడానికి అనేక రకాల పద్ధతులను పాటిస్తూ ఉంటారు. యోగా, శరీరక శ్రమతో పాటు ఆహారం విషయంలో కూడా ప్రయోగాలు చేస్తూ ఉంటారు. వాటిలో ఒకటి బుల్లెట్‌ప్రూఫ్ కాఫీ. ఈ బరువు తగ్గించే పానీయం ట్రెండ్‌లో ఉంది. ఇది ఎలా పని చేస్తుందో.. ఏ ప్రయోజనాలను అందజేస్తుందో తెలుసుకోండి

Bulletproof Coffee: బుల్లెట్‌ప్రూఫ్ కాఫీ అంటే ఏమిటి? బరువు తగ్గడంలో ఇది ఎలా సహాయపడుతుందో తెలుసా..!
Bulletproof CoffeeImage Credit source: pexel
Surya Kala
|

Updated on: Nov 28, 2024 | 9:58 AM

Share

బరువు తగ్గడం కోసం, ప్రత్యేకమైన వ్యాయామాలతో పాటు, వివిధ రకాల ఆహార ప్రణాళికలను కూడా అనుసరిస్తారు. ఈ ప్రణాళికలు కాకుండా బరువు తగ్గడంలో చాలా ప్రభావవంతమైనవిగా నిరూపించబడే అనేక ఉపాయాలు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి ఒక ట్రిక్.. ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్న బుల్లెట్‌ప్రూఫ్ కాఫీ. ఇది చాలా పాత పానీయం అయినప్పటికీ.. ఇప్పుడు ప్రజలు తమ ఆహారం లేదా దినచర్యలో దీనిని ఎక్కువగా తాగడం ప్రారంభించారు. దీని పేరు చాలా భిన్నంగా ఉంటుంది. కొవ్వుగా ఉన్నప్పటికీ బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇది ఒక రకమైన బటర్ కాఫీ.. ఇందులో వెన్న కలిపిన తర్వాత కాఫీ తాగుతారు. బుల్లెట్‌ప్రూఫ్ కాఫీ తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి. కేలరీలను బర్న్ చేయడంలో ఇది ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.

బరువు తగ్గడానికి బుల్లెట్‌ప్రూఫ్ కాఫీ ఎలా సహాయపడుతుంది..ఇది ఎలా తయారు చేస్తారు? దాని ప్రయోజనాలు ఏమిటి? దీని వలన కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి..? ట్రెండీ బుల్లెట్‌ప్రూఫ్ కాఫీకి సంబంధించిన కొన్ని ప్రత్యేక విషయాల గురించి తెలుసుకుందాం..

బుల్లెట్ ప్రూఫ్ కాఫీని ఎలా సిద్ధం చేసుకోవాలంటే

ఈ కాఫీని సిద్ధం చేయడానికి.. వేడి కాఫీ, ఒక చెంచా MCT నూనె లేదా కొబ్బరి నూనె, ఉప్పు వేయని వెన్న అవసరం. దీన్ని చేయడానికి ముందుగా వేడి వేడిగా కాఫీని సిద్ధం చేసి.. ఉప్పు లేని వెన్న, కొబ్బరి నూనెను జోడించండి. అంతే బుల్లెట్ ప్రూఫ్ కాఫీ రెడీ. ఇప్పుడు ఈ కాఫీని సిప్ బై సిప్ తాగండి. ప్రతిరోజూ ఈ పానీయం తాగవచ్చు. అయితే దీనిని రోజూ తాగాలనుకుంటే ముందు నిపుణుల సలహా తీసుకోవాలని అని గుర్తుంచుకోండి.

ఇవి కూడా చదవండి

బుల్లెట్‌ప్రూఫ్ కాఫీ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే

నిజానికి బుల్లెట్ ప్రూఫ్ కాఫీ కొవ్వును కరిగిస్తుంది. శరీరంలో కీటోనోసిస్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఇది శరీరంలోని కొవ్వును కీటోన్‌లుగా మారుస్తుంది. ఎక్కువ కాలం కార్బోహైడ్రేట్లు తీసుకోనప్పుడు, గ్లూకోజ్ స్థాయి కూడా తగ్గినప్పుడు, కొవ్వు బర్నింగ్ ప్రారంభమవుతుంది. అటువంటి పరిస్థితిలో ఈ రకమైన కాఫీ కొవ్వును బర్న్ చేసే ప్రక్రియను పెంచుతుంది. అంతేకాదు ఈ కాఫీ తాగడం వల్ల ఆకలి కూడా తగ్గుతుంది. అతిగా తినరు. ఈ విధంగా ఈ కాఫీ బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

కాఫీ మనకు శక్తిని ఇవ్వడమే కాదు ఆకలిని కూడా చంపుతుందని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. వెన్నను, కొబ్బరి నూనెను బుల్లెట్ ప్రూఫ్ కాఫీకి జోడించడం ద్వారా ఆరోగ్యకరమైన కొవ్వును పొందవచ్చు. అందులో ఎంసీటీ ఆయిల్ తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు లభిస్తాయి. MCT అంటే మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ త్వరగా శోషించబడతాయి. శక్తిని అందిస్తాయి. ఈ విధంగా కొవ్వు పెరిగే ప్రక్రియ మందగిస్తుంది. ఈ విధంగా కీటోనోసిస్ ప్రక్రియ పెరుగుతుంది. తక్కువ ఆకలి ఉంటుంది.

బుల్లెట్‌ప్రూఫ్ కాఫీ ఎవరు తాగవద్దు అంటే

ఈ కాఫీ బరువు తగ్గడంలో సహాయపడినప్పటికీ ఇది పోషకాహారాన్ని అందించదు. భోజనం మానేసి కేవలం ఇలాంటి పానీయాలపై ఆధారపడే వ్యక్తులు పోషకాల లోపంతో బాధపడే అవకాశం ఉంది. దీని కారణంగా తలనొప్పి, బలహీనత లేదా ఇతర ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి.

ఇందులో ఎక్కువ కొవ్వు ఉంటుంది.. అందుకే లావు తగ్గాలనుకునే వారు ఇలాంటి పానీయం తాగొద్దు. ఎందుకంటే ఇందులో కొబ్బరి నూనె, వెన్న రెండూ ఉన్నాయి. దీని కారణంగా కొవ్వు పెరిగే సమస్య కలగవచ్చు.

మరిన్ని లైఫ్‌‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)