AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పొల్యూషన్‌లో ఢిల్లీతో పోటీపడుతోన్న భాగ్యనగరం.. ఆ ప్రాంతాల్లో క్షీణిస్తోన్న గాలి నాణ్యత.. శాస్వకోస వ్యాధులు తప్పవంటూ హెచ్చరిక

మహా నగరాల్లో ముందు ముందు ప్రజలు బ్రతికేది కష్టమేనా? హైదరాబాద్‌లో పొల్యూషన్‌పై పర్యావరణ వేత్తలు ఏం చెబుతున్నారు? అసలు వాయు కాలుష్యం నగరంలో ఏస్టేజ్‌లో ఉంది? నగరంలో పొల్యూషన్‌కి కారణాలేంటీ?. ఏ ప్రాంతాల్లో ప్రజెంట్ పొల్యూషన్‌ ప్రమాదఘంటికలు మోగుతున్నాయో తెలుసా..

Hyderabad: పొల్యూషన్‌లో ఢిల్లీతో పోటీపడుతోన్న భాగ్యనగరం.. ఆ ప్రాంతాల్లో క్షీణిస్తోన్న గాలి నాణ్యత.. శాస్వకోస వ్యాధులు తప్పవంటూ హెచ్చరిక
Air Pollution In Hyderabad
Surya Kala
|

Updated on: Nov 28, 2024 | 7:32 AM

Share

హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న జనాభాతోపాటు.. పొల్యూషన్‌ హైలెవల్‌కి చేరుతోంది. నగరంలో వాతావరణం ప్రమాదకరంగా మారుతోంది. పెరుగుతున్న వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలతో నగరంలో రోజురోజుకు గాలిలో నాణ్యత క్షీణిస్తోంది. ఢిల్లీకి సమానంగా గాలి కాలుష్యం నమోదవడం అత్యంత ఆందోళనకరంగా మారింది. నగరంలో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ నిర్ణీత పరిమాణాన్ని దాటిపోతుంది. ముఖ్యంగా కూకట్‌పల్లి, మూసాపేట్, బాలానగర్, నాంపల్లి, మెహదీపట్నం తదితర ప్రాంతాల్లో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. ఈ ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇన్‌డెక్స్ 300 దాటింది.

నగరంలో పొల్యూషన్‌పై ప్రజల్లో ఆందోళన

నగరంలో రోజురోజుకు పెరుగుతున్న పొల్యూషన్‌పై ప్రజలతోపాటు.. పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి చేజారక ముందే చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే అతి త్వరలోనే జంట నగరాల వాసులు శ్వాస కోశ వ్యాధుల భారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

హైదరాబాద్‌.. మరో ఢిల్లీ అవుతోందని ఆందోళన

నగరంలో రోజురోజుకు పెరుగుతున్న వాహనాలు ఒక కారణమైతే.. ఊరి బయట ఉండే ఫ్యాక్టరీలు ఇప్పుడు నగర నడిబొడ్డున తిష్టవేయడం మరో కారణంగా చెబుతున్నారు. దీంతో వాయి కాలుష్యం భారీగా పెరిగిపోతుందంటున్నారు. ఒక్క వాయు కాలుష్యం మాత్రమే కాదు హైదరాబాద్‌లో రోడ్లపై ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా తారుమారైంది. గతంలో రోడ్లకి ఇరువైపులా కొంతమేర భారీ వృక్షాలు ఉండేవి. రోడ్ల విస్తీర్ణం పేరుతో వాటినీ తొలగించారు. దీంతో హైదరాబాద్‌ మహానగరం కాలుష్య కోరల్లో చిక్కుకుంది. హైదరాబాద్‌ పూర్వ వైభవాన్ని కోల్పోయే పరిస్థితి నెలకొంది. ప్రతీ రోజు నగరంలో కాలుష్యం 300 మార్క్‌ ను రీచ్‌ అవుతోంది. ఒక్కోసారి 300మార్కు దాటిన సందర్భాలు ఉన్నాయి. ఇదిలాగే కొనాసాగితే హైదరాబాద్‌ కూడా మరో ఢిల్లీ అవుతుందని నగర వాసులు భయాందోళన చెందుతున్నారు. ముందస్తుగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..